Nizamabad

News April 1, 2026

నిజామాబాద్: అకాల వర్షంతో అన్నదాత విలవిల

image

నిజామాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. చేతికొచ్చే దశలో ఉన్న వరి, మొక్కజొన్న పంటలు నేలకొరగగా.. మామిడి కాయలు రాలిపోయాయి. జిల్లావ్యాప్తంగా 76 గ్రామాల్లో సుమారు 2,209 మంది రైతులకు చెందిన 2,559 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ముఖ్యంగా నవీపేట్, భీమ్‌గల్ మండలాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది.

News March 31, 2026

క్షయ రహిత నిజామాబాద్ లక్ష్యం.. ఆరోగ్య సిబ్బందికి శిక్షణ

image

నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో TBMBA 2.0 కార్యక్రమంపై మెడికల్ ఆఫీసర్లు, MLHPలకు శిక్షణ నిర్వహించారు. టీబీ వ్యాధి గుర్తింపు, చికిత్స, ఫాలోఅప్‌పై అవగాహన కల్పించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ.. క్షయ నిర్మూలనకు సిబ్బంది సమర్థంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News March 31, 2026

అధికారులను సమాయత్తం చేశాం: కలెక్టర్

image

గ్రామ వార్డు సభల నిర్వహణకు సంబంధించి అధికారులను సమాయత్తం చేశామని NZBజిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ఉ.7.30 గంటల నుంచి 10.30 గంటల లోపు సభలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించి క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులను సమాయత్తం చేశామన్నారు. అన్ని వర్గాల ప్రజలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ జిల్లాలో గ్రామ, వార్డు సభలను విజయవంతం చేస్తామని అన్నారు.

News March 31, 2026

నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ 2న వైన్స్ బంద్: సీపీ

image

నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ 2న వైన్ షాపులు బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశించారు. ఏప్రిల్ 2 ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 3 ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 31, 2026

పిల్లల మరణాల తగ్గింపుపై సమీక్ష: DM&HO

image

నిజామాబాద్‌లో డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రాజశ్రీ ఆధ్వర్యంలో ఐదేళ్లలోపు పిల్లల మరణాల తగ్గింపుపై సమీక్ష సమావేశం జరిగింది. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యత, పోషణ, సమయానికి వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని తెలిపారు. ఈ సమావేశంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News March 31, 2026

రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కీలకం: కలెక్టర్

image

నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. బ్లాక్ స్పాట్‌లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రమాదాలను తగ్గించే విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.

News March 31, 2026

NZB: బైక్‌టైర్‌లో చీరకొంగు చిక్కుకొని మహిళ మృతి

image

మెండోరా మండలంలోని దూదిగం వద్ద జరిగిన ప్రమాదంలో బస్సాపూర్‌కు చెందిన కమల మరణించారు. భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా, ఆమె కట్టుకున్న చీరకొంగు అకస్మాత్తుగా వెనుక టైర్‌లో చిక్కుకోవడంతో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన కమల నిర్మల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుహాసిని తెలిపారు.

News March 31, 2026

NZB: స్కౌట్ మాస్టర్ల పోస్టుల భర్తీకై దరఖాస్తుల ఆహ్వానం

image

NZB జిల్లాలోని మండలాల వారీగా ది స్కౌట్/గైడ్స్ ఆర్గనైజేషన్‌ (SGO)లో పనిచేయడానికి స్కౌట్ మాస్టర్ల ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు SGO జిల్లా కమిషనర్ బానేష్ జాడి తెలిపారు. ఏప్రిల్ 1 ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు, విద్యుత్ నగర్, కంటేశ్వర్, DS చౌరస్తాలోని నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన సూచించారు.