India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెండోర మండలం సోన్ పేట్‌కు చెందిన పిండి మధు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురై గడ్డిమందు తాగాడు. నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుహాసిని తెలిపారు.

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం పరిహారం అందించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB మాజీ MP కవిత ఆదివారం X వేదికగా డిమాండ్ చేశారు. వడగళ్ల వాన బోధన్ నియోజకవర్గ రైతులకు కన్నీటిని మిగిల్చిందని సాలూర, ఖాజాపూర్, హున్సా, మందర్నా గ్రామాల్లో వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి రైతులకు భరోసా ఇవ్వాలన్నారు.

సిరికొండ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం సర్‌పల్లితండాకు చెందిన మాలవత్ రమేశ్ చేపలు పట్టేందుకు వెళ్లి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ ఆదివారం తెలిపారు.

గడచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. వేంపల్లె, నిజామాబాద్ సౌత్ 40.1°C, కోటగిరి 40°Cల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా జిల్లాలోని అన్నిప్రాంతాల్లో 35°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యి. ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరయ్యారు. నిన్న సాయంత్రం జిల్లాలో పలుచోట్ల వర్షపాతం నమోదయ్యింది. జానకంపేటలో 26.8 మి.మీ, సిరికొండ, సాలూరలో 10 మి.మీ. వర్షం కురిసింది.

నిజామాబాద్ కాంగ్రెస్‌లో రాజకీయ సెగలు రేగుతున్నాయి. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్న ధర్మపురి సంజయ్‌కు పదవుల పంపకంలో అన్యాయం జరిగిందని ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తగిన గుర్తింపు దక్కడం లేదని ఆగ్రహంతో ఉన్న అభిమానులు, నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ధర్నాకు దిగారు. బలమైన ఓటు బ్యాంకు కలిగిన నేత కావడంతో, ఆయన పార్టీ వీడితే నష్టం తప్పదని కేడర్ ఆందోళన చెందుతోంది.

NZB జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి నిర్వహించే ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని DRDA PD సాయగౌడ్ ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అన్ని డిపార్ట్‌మెంట్లు అవసరమైన మేరకు కోఆర్డినేషన్ అందించి పరీక్షలను సజావుగా జరిగేలా సహకరించాలన్నారు.
ఈ సమావేశంలో DEO అశోక్, DMHO రాజశ్రీ, ACP తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు 3 టౌన్ ఎస్ఐ హరిబాబు శుక్రవారం తెలిపారు. మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్ పోలీస్ లైన్‌లో ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా ఎస్సై హరిబాబు తన సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి, వారి నుంచి 6 సెల్ ఫోన్లు, రూ.6,200 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Sorry, no posts matched your criteria.