India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహిళల భద్రత కోసం షీ టీమ్స్ నిఘా ముమ్మరం చేశాయి. ముఖ్యంగా NZB నగరంలోని ఖిల్లా ప్రభుత్వ కళాశాల, గిరిరాజ్ కాలేజీ వంటి విద్యాసంస్థలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక దృష్టి సారించారు. 3 నెలల్లో 150కి పైగా ఈవ్ టీజింగ్ కేసులు నమోదు కాగా, పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వేధింపులు ఎదురైతే వెంటనే 100 లేదా షీ టీమ్ ను సంప్రదించాలన్నారు.

నిజామాబాద్ జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన తైబజార్ వేలం పాటలు ఈ ఏడాది భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. నవీపేట్, బోధన్, రుద్రూర్ వంటి ప్రాంతాల్లో భారీగా రూ.లక్షల్లో ధరలు పలికాయి. పెరిగిన పోటీతో స్థానిక సంస్థల ఖజానాకు భారీగా నిధులు సమకూరడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులను పట్టణ, గ్రామ అభివృద్ధి పనులకు వెచ్చించనున్నారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో ఈవీఎం గోడౌన్‌ను నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం సందర్శించారు. సీళ్ల స్థితి, పోలీసు బందోబస్తును క్షుణ్ణంగా పరిశీలించిచారు.అన్ని విధానాలు కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంపులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. తరగతి గదులు, అటెండెన్స్ రిజిస్టర్, మెనూ పరిశీలించి నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. పరిశుభ్రత, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి అభ్యాసాన్ని పరిశీలించారు. నూతన భవన పనులు వెంటనే వెంటనే ప్రారంభించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం ఉపాద్యాయ, ఉద్యోగ తదితర సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని నిజామాబాద్ రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ బుస ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన వీడియో ప్రకటనను విడుదల చేశారు. సంస్థలే కాకుండా ఆసక్తి ఉన్నవారు వ్యక్తిగతంగా రెడ్ క్రాస్‌కు వచ్చి రక్తదానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

నిజామాబాద్ జిల్లాలో అనుమతులు లేకుండా మొరం, ఇసుక తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. నందిపేట పలుగుట్ట ప్రాంతంలో అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్న వారిపై సీసీఎస్ పోలీసులు దాడి చేసి మూడు టిప్పర్లు, రెండు జెసిబీలు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకాల దరఖాస్తు గడువు ఈ నెల 8తో ముగియనుంది. పాడి గేదెల పెంపకం, ఈవీ వాహనాలు, సోలార్ పంపు వంటి పథకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసి, సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

NZB జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 8న ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి B.P.మధుసూదన్ రావు తెలిపారు. Shbha Gruha Developers, Google pay కంపెనీలలో నియామకాలుంటాయన్నారు. ఇందులో సేల్స్ ఎక్సిక్యూటివ్స్, Filed Telecalleres, Filed sales executive ఉద్యోగాల కోసం ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతలు ఉండాలన్నారు. ఆసక్తి గలవారు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో రావాలన్నారు.

నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన మందుబాబులకు కోర్టు భారీ జరిమానా విధించింది. తనిఖీల్లో దొరికిన 43 మందిని న్యాయస్థానంలో హాజరుపరచగా, 40 మందికి ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 4 లక్షల జరిమానా విధించారు. మిగిలిన ముగ్గురికి వారం రోజుల పాటు జైలు శిక్ష ఖరారు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఐదేళ్ల క్రితం జరిగిన దారుణ హత్య కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. 2021 ఆగస్టులో అడ్డమీద కూలి డబ్బుల విషయంలో జరిగిన గొడవలో నిందితుడు తన మామ, బామ్మర్దిపై కత్తితో దాడిచేసి హత్య చేశాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని కర్ణాటకలో అరెస్ట్ చేశారు. పక్కా సాక్ష్యాధారాలతో నేరాన్ని నిరూపించిన పోలీసు సిబ్బందిని, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను సీపీ పి.సాయిచైతన్య అభినందించారు.
Sorry, no posts matched your criteria.