India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అతి నుంచి అత్యంత భారీ వర్షం కురిసింది. సిరికొండ మండలం తూంపల్లిలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 233.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. వాగులు వంకలు పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు దూకుతున్నాయి.
జాతీయ స్థాయి బేస్ బాల్ ఛాంపియన్షిప్‌కు గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.బాలమణి తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన మహిళల జట్టులో జి.శృతి, పురుషుల జట్టులో కే.సాయికుమార్ ఎంపికయ్యారన్నారు. వీరు ఈనెల 29 నుంచి మహారాష్ట్రలోని అమరావతిలో జరిగే 38వ సీనియర్ నేషనల్ బేస్ బాల్ పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తొలి అడుగుగా నిజామాబాద్ జిల్లా ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని NZB, BDN, ARMR డివిజన్లలోని 31 మండలాల్లో ఉన్న 545 GPలు, 5,022 వార్డులు, 5,053 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 4,54,621 మంది, పురుషులు 3,96,778 మంది, ఇతరులు 18 మంది ఉన్నారు.
క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన వివిధ క్రీడా పోటీలను రద్దు చేస్తున్నట్లు DYSO (FAC) పవన్ కుమార్ తెలిపారు. ఈ నెల 23 నుంచి 31 వరకు వెల్లడించిన షెడ్యూల్డ్‌లో భాగంగా 28, 29 తేదీల్లో నిర్వహించాల్సిన హాకీ, బాస్కెట్ బాల్ టోర్నమెంటును వర్షం కారణంగా రద్దు చేస్తున్నామన్నారు. క్రీడల నిర్వహణకు మైదానం అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని కొన్ని మండలాల్లో విద్యా సంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తున్నట్లు DEO అశోక్ తెలిపారు. ఈ మేరకు సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, భీమ్‌గల్ మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని సంబంధిత యాజమాన్యాలు గమనించాలని ఆయన సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం చందూర్, ధర్పల్లి, డిచ్‌పల్లి, NZB రూరల్, జక్రాన్‌పల్లి మండలాల్లో 7 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డ తెలిపారు. అవసరమైన సదుపాయాలు కల్పించామన్నారు. 164 కుటుంబాలకు చెందిన 358 మంది ఈ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగలేదన్నారు. వరద నీటిలో చిక్కుకుపోయిన 17 మందిని సురక్షితంగా కాపాడినట్లు వెల్లడించారు.
జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి, భీమ్‌గల్, ఇందల్వాయి మండలాల్లోని కొండాపూర్, తూంపల్లి, గడ్కోల్, ముషీర్ నగర్, హోన్నాజీపేట్, వాడి, నడిమితండా, బెజ్జోరా, సిర్నాపల్లి గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. పై ప్రాంతాల్లో మూడు చెరువులు తెగిపోగా, సుమారు 12,413 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు చెప్పారు. నీట మునగడం వల్ల పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.
NZB జిల్లాలో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 13 చోట్ల పంచాయతీ రాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని, 29 చోట్ల ఆర్‌అండ్‌బీ రోడ్లకు నష్టం జరిగిందని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. వర్షానికి ఓ నివాస గృహం పూర్తిగా కూలిపోయిందన్నారు. మరో ఆరు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. 60 కరెంటు స్తంభాలు, మరో 60 కండక్టర్లు పడిపోయాయని చెప్పారు. కొన్ని చోట్ల వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునిగాయని వెల్లడించారు.
జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి భరోసా కల్పించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి తలెత్తినా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేశామని పేర్కొన్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమతమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు.
ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన గ్రామాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు. వరద నీటి ఉద్ధృతి వల్ల ముత్యాల చెరువు తెగిపోవడంతో ధర్పల్లి మండలంలో వాడి, నడిమి తండా, బీరప్ప తండాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.