India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న సందర్భంగా డిసెంబర్ 7లోపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవీ దక్కుతుందో ఉత్కంఠ నెలకొంది. కాగా మంత్రి పదవీ రేసులో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం.
జుక్కల్‌కి కొత్తగా పరిచయమై, హ్యాట్రిక్ వీరుడు మాజీ MLA హన్మంత్ షిండేను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచిన తోటలక్ష్మీకాంత్ రావు జుక్కల్ రాజకీయాల్లో చరిత్రను తిరగ రాశారు. రాష్ట్ర రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా AMC ఛైర్మన్ల నియామకాల్లో ఇంటర్వ్యూ నిర్వహించి కొత్త ఒరవడిని సృష్టించి మరోసారి చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నారు. మంత్రులు, ప్రముఖులు సీఎం సైతం శభాష్ అనిపించుకునే స్థాయికి ఎదిగారు.
నవీపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో గురువారం రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్-17 విభాగంలో ఉమ్మడి జిల్లాలకు చెందిన 38 మంది బాలికలు, 28 మంది బాలురు పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో నుంచి ఐదుగురు బాలికలు, 8మంది బాలురు ఈ నెల 23 నుంచి 25వ తేది వరకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడానికి ఎంపిక అయ్యారు.
కులగణన సర్వేను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసి, డేటా ఎంట్రీ ప్రారంభించారని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. గురువారం MPDOలు, MROలు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే పనులు ఎన్యుమరేషన్ బ్లాక్ వారిగా పూర్తిచేసి డేటా నమోదు చేయాలన్నారు. ఇప్పటివరకు 11 మండలాల్లో 100%, జిల్లావ్యాప్తంగా 96.3% ఎన్యుమరేషన్ పూర్తయిందన్నారు.
నిజామాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో సుమారు 250 మంది పోలీసులు తమ శిక్షణను పూర్తి చేసుకున్నారు. జిల్లాలోని ఎడపల్లి మండలంలో గల జానకంపేట పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో గురువారం పాసింగ్ అవుట్ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ ఇన్‌ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మద్నూర్ AMC ఛైర్ పర్సన్‌గా సౌజన్య ఎంపిక కావడంపై CM రేవంత్ రెడ్డి ‘X’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘ఇంటర్వ్యూ పద్ధతిలో ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ మహిళల చదువుకు ఆత్మస్థైర్యానికి ప్రోత్సహమిచ్చేలా జరిగిన ఈ ఎంపిక రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టించిందని’ సీఎం పేర్కొన్నారు. ఈ విషయంలో కీలక పాత్ర పోషించిన MLA తోట లక్ష్మీకాంత్ రావు, సహచర మంత్రి వెంకటరెడ్డి, TPCC చీఫ్ మహేశ్ గౌడ్‌లకు అభినందనలు తెలిపారు.
మహిళను వేధిస్తున్న ఒకరిని షీ టీం సభ్యులు పట్టుకున్నారు. ఓ మహిళ ఫోన్‌కి ఒక వ్యక్తి అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ, అసభ్యకర సందేశాలను పంపుతూ ఆమెను వేధిస్తున్నాడు. దీంతో సదరు మహిళ షీటీంకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వెంటనే ఆర్మూర్ షీటీం సభ్యులు అతడిని పట్టుకున్నారు. తదుపరి చర్యలకై అతడిని ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జడ్జి సునీత కుంచాల పిలుపునిచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. పిల్లల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా లైంగిక వేధింపులకు గురికాకుండా చూడాలని తెలిపారు.
మూత్ర విసర్జన కోసం వెళ్ళిన ఓ వ్యక్తి కాలువలో పడి మృతి చెందినట్లు నిజామాబాదు పట్టణంలోని 5వ టౌన్ ఎస్ఐ గంగాధర్ బుధవారం తెలిపారు. మహారాష్ట్రకు చెందిన కపిల్ అనే యువకుడు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిన్న రాత్రి మద్యం మత్తులో న్యాల్కల్ రోడ్డు ప్రాంతంలో మూత్ర విసర్జన కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మద్యం మత్తులో మూత్ర విసర్జనకు వెళ్లి కింద పడి ఒకరు మృతి చెందారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన శ్రీనివాస్(40) ఓ పెట్రోల్ బంకులో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి మద్యం తాగి న్యాల్ కల్‌కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన మూత్ర విసర్జనకు వెళ్లాడు. మద్యం మత్తులో కింద పడిపోవడంతో మృతి చెందాడు. 5వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగాధర్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Sorry, no posts matched your criteria.