India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. బుధవారం ఉదయం 11 గంటలకు 1,090.90 అడుగులకు(80.053TMC) నీటి మట్టం చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి 45 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 55,527 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు వివరించారు.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(GGH) భవనం మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.2.76 కోట్లు మంజూరు చేసినట్లు GGH సూపరింటెండెంట్ డాక్టర్ పీ.శ్రీనివాస్ తెలిపారు. ఈ నిధులతో మరుగుదొడ్లు, డ్రెయినేజీలు, తలుపులు, కిటికీలు, భవనం ముందు భాగంలో మరమ్మతులు చేపట్టడంతోపాటు పాలియేటివ్ కేర్ సెంటర్ అభివృద్ధి, ల్యాబ్ మరమ్మతులు, టీహబ్ విస్తరణ పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు.
2024-25లో ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు HCL టెక్ బీ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 29 శుక్రవారం ఉద్యోగమేళ నిర్వహిస్తున్నట్లు DIEO తిరుమలపుడి రవికుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగమేళలో MPC, BiPC, MEC, CEC, వొకేషనల్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు అర్హులన్నారు. సోమవారం ఉ.10గం.కు వెంకటేశ్వర కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, కోటగల్లిలో ఈ డ్రైవ్ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 8074065803 నంబర్‌ను సంప్రదించొచ్చు.
నిజామాబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల్లో గన్నారంలో 15.8 మిల్లీమీటర్లు, ధర్పల్లిలో 14.8, తూంపల్లి 21.5, కోరాట్పల్లి 14.5, నిజామాబాద్ 8.3, జక్రాన్‌పల్లి 7.8, మోస్రా 7.5, జకోరా 7.3, చందూర్ 9.3, మదనపల్లి 6.5, డిచ్‌పల్లి 6.5, యేర్గట్ల 4.8, మెండోరా 4.8, బెల్లాల 4.0, రుద్రూర్ 4.0, ఎడపల్లిలో 4.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.
జాతీయస్థాయి బేస్ బాల్ ఛాంపియన్షిప్‌కు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు అసోసియేషన్ కార్యదర్శి వినోద్ తెలిపారు. ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో మహిళ జట్టు ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన సౌమ్యారాణి, శృతి, అనూష, శరణ్య, పురుషుల విభాగంలో సాయి కుమార్ ఎంపికయ్యారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మహారాష్ట్రలోని అమరావతిలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.
గణేశ్ ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్‌లో భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం రాత్రి పరిశీలించారు. ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ ముఖ్యమైన గణేశ్ మండపాలు, ప్రధాన రహదారులు, చౌరస్తాల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు.
మహిళా, శిశు సంక్షేమం కోసం నిర్దేశించిన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ, సంపూర్ణ లక్ష్య సాధనకు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపారు. నూతనంగా మంజూరైన అంగన్వాడి భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.
గణేశ్ విగ్రహాల నిమజ్జనం, మిలాద్-ఉల్-నబి, దుర్గామాత ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఎదుట 28 మందిని బైండోవర్ చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదైన DJ ఆపరేటర్లు, DJ యజమానులు, ట్రబుల్ మాంగర్స్‌ను బైండోవర్ చేశారు. వచ్చే 6 నెలల పాటు సత్ప్రవర్తనను కొనసాగించాలని సీపీ ఆదేశించారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన గణేశ్ చతుర్థి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అభిలాషించారు.
వినాయక చవితి పండగకు ముందే నిజామాబాద్‌లో పూల ధరలు కొండెక్కాయి. గులాబీలు, వివిధ రకాల చామంతుల ధరలు సోమవారం హోల్‌సెల్ మార్కెట్లో కిలో రూ.400 పలికాయి. బంతిపూలు రూ.200 కిలో చొప్పున విక్రయిస్తున్నారు. పూలదండల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. మరి పండుగ రోజు ధరలు ఎలా ఉంటాయో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
Sorry, no posts matched your criteria.