Nizamabad

News February 25, 2025

NZB: ‘అధునాతన సదుపాయాలతో రెసిడెన్షియల్ పాఠశాలలు’ 

image

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అధునాతన వసతి, సదుపాయాలతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను అందుబాటులోకి తేనున్నామని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణ వెల్లడించారు. సోమవారం ఆమె రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలు, వసతుల కల్పన కోసం చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు.

News February 25, 2025

నిజామాబాద్: వారోత్సవాలను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి 28 వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. వారోత్సవాలను పురస్కరించుకుని లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడప్రతులను కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సాయాగౌడ్, నాబార్డు డీడీఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

News February 25, 2025

NZB: ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాలి: కలెక్టర్

image

ఈ నెల 27న పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేట్ సంస్థలలో పని చేస్తున్న వారికి సంబంధిత యాజమాన్యాలు వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు.

News February 24, 2025

నిజామాబాద్: రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత KCRకు లేదు: TPCC చీఫ్ 

image

విజన్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత ఫామ్ హౌస్‌లో పడుకునే KCRకు లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తాను పరిగెత్తుతూ మంత్రులను పరిగెత్తిస్తున్నారని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ధైర్యం ముఖ్యమని, ఆ ధైర్యం రేవంత్ రెడ్డికి గుండె నిండా ఉందని పేర్కొన్నారు.

News February 24, 2025

NZB: BRSకు పోటీ చేసేందుకు అభ్యర్థి లేడు: CM

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్‌కు అభ్యర్థి దొరకలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం నిజామాబాద్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కనీసం ఎన్నికల్లో పోటీకి అభ్యర్థి లేని ఆ పార్టీ తమ ప్రభుత్వాన్ని ఏ విధంగా పడగొడుతుందో ఆలోచించుకోవాలన్నారు.

News February 24, 2025

NZB: వార్షిక పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు: అదనపు కలెక్టర్

image

పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయని వెల్లడించారు.

News February 24, 2025

NZB: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ యువకుడుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. మద్నూర్ చెందిన బాలిక శనివారం రాత్రి కామారెడ్డికి వెళ్లేందుకు NZBకు వచ్చింది. అయితే వర్ని మండలానికి చెందిన సంతోష్ అనే యువకుడు ఆమెకు మాయ మాటలు చెప్పి తన బైక్‌పై తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.

News February 24, 2025

NZB: కాంగ్రెస్‌కు షాక్

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కోసం డీఎస్పీ పదవికి రాజీనామా చేసి అభ్యర్థిగా నామినేషన్ వేసి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మధనం గంగాధర్ సీఎం పర్యటనకు ముందు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డిని ఓడించడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు.

News February 24, 2025

NZB: కాంగ్రెస్‌కు షాక్.. అభ్యర్థిని ఓడించడమే ధ్యేయమన్న గంగాధర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కోసం డీఎస్పీ పదవికి రాజీనామా చేసి అభ్యర్థిగా నామినేషన్ వేసి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మధనం గంగాధర్ సీఎం పర్యటనకు ముందు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేంధర్ రెడ్డిని ఓడించడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు.

News February 24, 2025

NZB: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు

image

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పర్యటన వివరాలు ఇలా ఉంది. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.45 గంటలకు నిజామాబాద్ లోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ కు చేరుకుంటారు. అక్కడ 1.30 వరకు మీటింగ్‌లో పాల్గొని మంచిర్యాల బయలుదేరి వెళ్తారు. అక్కడి నుంచి 4.20కి కరీంనగర్ చేరుకుని అక్కడ మీటింగ్‌లో పాల్గొని సాయంత్రం 6.45కు బేగంపేట చేరుతారు.