Nizamabad

News February 16, 2025

బాల్కొండ: చేపల వేటకు వెళ్లి జాలరి మృతి

image

బాల్కొండకు చెందిన జాలరి బట్టు నారాయణ(55) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నారాయణ రోజూలాగే ఉదయం 4 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్ద చేపల వేటకు నీటిలో దిగాడు. చేపల కోసం పెట్టిన కండ్రిగలో వలలో చిక్కుకుని నీట మునిగి చనిపోయాడు. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని బయటికి తీసి పోలీసులు పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆర్మూర్‌కు తరలించారు.

News February 16, 2025

NZB: నిబంధనలు తప్పకుండా పాటించాలి: ఇన్‌ఛార్జ్ సీపీ

image

ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించకూడదని నిజామాబాద్ ఇన్‌ఛార్జి CP సింధుశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అనుమతులు తప్పనిసరిగా పొందాలన్నారు. మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజలు పోలీస్ అధికారులకు సహకరించాలన్నారు.

News February 15, 2025

నిజాంసాగర్: అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి మృతి

image

అప్పుల బాధతో ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన శనివారం నిజాంసాగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. లక్ష్మీ, జీవన్‌లకు 27 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లి చేయగా అప్పులు అయ్యాయి. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. శనివారం జీవన్ మనస్తాపానికి గురై ఉరేసుకొని మృతి చెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 15, 2025

నిజామాబాద్: 18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

image

నిజామాబాద్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్‌తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.

News February 15, 2025

NZB: ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు

image

గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. వినాయకనగర్‌లోని సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల బాధ్యులు, జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

News February 15, 2025

NZB: రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది ఇతడే

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ జాతీయ రహదారి కారు అదుపుతప్పిన ఘటనలో గంగాధర్ (46) అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అతని కూతురు లహరి(20)కి తీవ్రగాయాలయ్యాయి. వీరి స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుక్కునూర్ గ్రామంగా గుర్తించారు. గంగాధర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News February 15, 2025

నిజామాబాద్: ఎక్కడ చూసినా అదే చర్చ

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ వేడెక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

News February 15, 2025

నిజామాబాద్ జడ్పీటీసీ స్థానాలు ఇవే

image

నిజామాబాద్ జిల్లాలోని 31 జడ్పీటీసీ స్థానాలు, 31 మండలాల పరిధిలో 307 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 8,51,770 మంది ఓటర్లు ఉండగా అధికారులు 1564 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 400 లోపు ఓటర్లు కలిగిన పోలింగ్ కేంద్రాలు 122, 500 లోపు ఓటర్లతో 362, 750 వరకు ఓటర్లు కలిగినవి 1080 ఉన్నాయని అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు.

News February 14, 2025

కోటగిరి పంచాయతీ కార్యదర్శికి కఠిన కారాగార శిక్ష

image

లంచం తీసుకున్న కేసులో కోటగిరి పంచాయతీ కార్యదర్శి సుదర్శన్‌కు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ. 40,000 జరిమానా విధిస్తూ ఏసీబీ నాంపల్లి కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మహమ్మద్ ఆఫ్రొజ్ అక్తర్ తీర్పు నిచ్చారు. 2014లో వడ్డే నర్సింహులు తండ్రి పేరు మీద ఉన్న ఇళ్లను అయన, అతని సోదరుడి పేరు మీద బదిలీ చేయడం కోసం కార్యదర్శి రూ.8,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కోర్టు విచారించి, తీర్పునిచ్చింది.

News February 14, 2025

NZB: కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి

image

కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. జైపూర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లోని S5 కోచ్‌లో తోటి భక్తులతో ప్రయాణిస్తున్న అనిత (59) అనారోగ్యంతో మృతి చెందిందన్నారు. మృతురాలిది కర్ణాటకలోని బీదర్ జిల్లా మిర్జాపూర్ గ్రామమని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని NZB GGH మార్చురీకి తరలించామని చెప్పారు.