Nizamabad

News July 23, 2024

నిజామాబాద్: నేటి వార్తల్లోని ముఖ్యంశాలు

image

*NZB: వేతన జీవులను నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్: రామ్మోహన్ రావు
*తెలంగాణ వర్సిటీలో ఏబీవీపీ ధర్నా (వీడియో)
*కేంద్ర బడ్జెట్.. NZB జిల్లాకు మొండి చేయి
*గ్యారంటీలు, హామీలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం: ఎమ్మెల్యే ధన్పాల్
*NZB: ఆ చెరువు 14 ఊర్లకు ఆదేరువు
*నిజామాబాద్: మార్ట్ లో అగ్నిప్రమాదం
*ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద
*నిజామాబాద్: మత్స్యకారుడి వలకు చిక్కిన 30 కిలోల చేప

News July 23, 2024

NZB: వేతన జీవులను నిరాశపరిచిన కేంద్రబడ్జెట్: రామ్మోహన్ రావు

image

కేంద్రబడ్జెట్ వేతన జీవులను నిరాశ పరిచిందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆదాయ పన్ను చెల్లించే మధ్యతరగతి వేతన జీవులకు ఈ బడ్జెట్‌లోనైనా కొంత ఊరట దక్కుతుందని ఆశించామన్నారు. ఐటీ స్లాబులను సవరించాలని, స్టాండర్డ్ డిడక్షన్ కనీసం లక్షకు పెంచాలనేది తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు.

News July 23, 2024

పారిస్ ఒలింపిక్స్‌కు నిఖత్.. ప్రత్యేక శిక్షణకు రూ. 91.71 లక్షలు

image

ఈనెల 26 నుంచి ఒలింపిక్స్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి. వందేళ్ల తర్వాత ఒలింపిక్స్‌కు పారిస్ అతిథ్యం ఇస్తోంది. విశ్వక్రీడల్లో భారత్ తరఫున సత్తాచాటి పతకాలు తెచ్చెందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం’ పేరుతో క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ఇందుకు రూ.470 కోట్లకు పైగా వెచ్చించింది. అయితే NZBకు చెందిన నిఖత్‌జరీన్ (బాక్సింగ్) శిక్షణకు రూ.91.71 లక్షలు ఖర్చు చేసింది.

News July 23, 2024

కేంద్ర బడ్జెట్..NZB జిల్లాకు మొండి చేయి

image

కేంద్ర బడ్జెట్ పై ఉమ్మడి నిజామాబాద్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రైల్వే లైన్ డబ్లింగ్ తో పాటు బోధన్ నుంచి బాన్సువాడ మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ వరకు కొత్త రైల్వే లైన్ మంజూరు, తదితర అంశాలపై జిల్లా వాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ తో జిల్లా వాసుల ఆశ నిరాశగానే మిగిలిపోయింది.

News July 23, 2024

NZB: ఆ చెరువు 14 ఊర్లకు ఆదెరువు

image

ఇటీవల కురుస్తున్న వర్షాలకు మోపాల్‌లోని మంచిప్ప పెద్దచెరువు నిండింది. ఈ చెరువుపై 14 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. ఏటా పెద్ద చెరువు నిండి అలుగులు పారితే ముదక్‌పల్లి, కులాస్‌పూర్ చెరువుల్లోకి అక్కణ్నుంచి వడ్డెర కాలనీ, నర్సింగ్‌పల్లి, మోపాల్, సిర్పూర్, న్యాలకల్, ధర్మారం, మల్లారం, తదితర ప్రాంతాలకు వెళుతుంది. పెద్దచెరువు నీరు నర్సింగ్‌పల్లి ఫిల్టర్ బెడ్ శుద్ధి అయిన తర్వాత గాజుల్‌పేట్ ట్యాంకులోకి వెళ్తుంది.

News July 23, 2024

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద

image

నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 22 వేల ఇన్‌ఫ్లో క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1069 అడుగల నీటిమట్టం ఉంది.

News July 23, 2024

NZB: జాగ్రత్త.. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి!

image

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రికార్డుస్థాయిలో ఓపీ నమోదువుతోంది. వారంరోజుల్లో 14,576 OP నమోదైంది. IP కింద 846 మంది చేరారు. వీరిలో జ్వరం, వాంతులు, విరేచనాలతో 3,093 మంది బాధితులు వైద్యం తీసుకున్నారు. కేవలం జ్వరంతోనే 138 మంది ఆసుపత్రిలో చేరారు. ఇప్పటివరకు 5009 మంది రోగుల నుంచి రక్తనమునాలు సేకరించారు. నిత్యం 700 నుంచి 800 మంది రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు.

News July 23, 2024

నిజామాబాద్: మత్స్యకారుడి వలకు చిక్కిన 30 కిలోల చేప

image

నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని సిర్పూర్‌కు చెందిన ఓ మత్స్యకారుడి వలకు భారీ చేప చిక్కింది. రోజులాగానే అభి సోమవారం గ్రామశివారులోని గోదావరిలోకి చేపల వేటకు వెళ్లారు. ఆ సమయంలో అతని వలలో 30 కిలోల చేప చిక్కింది. దీనిని వ్యాపారికి విక్రయించారు. తనకు ఇంత భారీ చేప దొరకడం ఇదే మొదటిసారి అన్నారు.

News July 23, 2024

NZB: బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వ న్యాయవాదులు

image

నిజామాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ కోర్టు తాత్కాలిక గవర్నమెంట్ ప్లీడర్‌గా నియమితులైన న్యాయవాది వెంకటరమణ గౌడ్, నిజామాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తాత్కాలిక అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా నియమితులైన పి. రాజులు సోమవారం జిల్లా కోర్టులోని తమ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించారు. వారికి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అభినందించారు.

News July 22, 2024

ముప్కాల్ ఇందిరమ్మ కాలనీలో భారీ చోరీ

image

ముప్కాల్ ఇందిరమ్మ కాలనీలో సోమవారం భారీ చోరీ జరిగింది. లింబాద్రి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి సుమారు 30 తులాల బంగారు నగలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న ముప్కాల్ ఎస్సై భాస్కర చారి సంఘటన స్థలానికి చేరుకొని ఆర్మూర్ సీఐకు సమాచారం అందించారు. ఆర్మూర్ నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.