India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంతర్జాతీయ చెస్ బాక్సింగ్‌లో కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన తక్కడ్ పల్లి ప్రతిభ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ నెల 23 నుంచి 28 వరకు ఆర్మేనియా దేశం, ఎరెవాన్లో 6వ ప్రపంచ స్థాయి చెస్ బాక్సింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతిభ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. 3వ టౌన్ పోలీస్ పరిధిలోని శివాజీచౌక్ వద్ద ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. రక్తపుమడుగులో పడిఉన్న బాధితుడిని పోలీసులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా డబ్బుల వివాదమే కత్తిపోట్లకు దారితీసినట్లు సమాచారం. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు.
తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం రేపు నిజామాబాద్ కలెక్టరేట్ లో స్థానిక సంస్థల రిజర్వేషన్ల దామాషాపై రేపు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కామారెడ్డి జిల్లాకు చెందిన వారు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా కమిషన్ కు నివేదించవచ్చు.
వర్ని మండలం కూనిపూర్ శివాలయం పరిసరాల్లో చిరుత అడుగుల ఆనవాళ్లను పలువురు గ్రామస్థులు గుర్తించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు శబ్దాలు చేసుకుంటూ వెళ్లాలని గ్రామ పెద్దలు సూచించారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే అవి చిరుత పులి అడుగులా, లేదా మరేదైనా జంతువు గుర్తులా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిజామాబాద్ నగరానికి చెందిన స్నేహిత రాష్ట్రస్థాయిలో అండర్-17 విభాగంలో జూడో పోటీలకు ఎంపికైనట్లు పీఈటీలు ప్రకాష్, సురేందర్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు తమ విద్యార్థిని ఎంపికవ్వడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫాదర్ జోజి, ఉపాధ్యాయ బృందం, పలువురు అభినందనలు తెలిపారు. స్నేహిత వరంగల్ జిల్లా హనుమకొండలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో కారు బోల్తా పడి ఆర్మూర్‌కు చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి. పట్టణానికి చెందిన బాలు, సాయిలు ఆదిలాబాద్‌లో జరిగే శుభకార్యానికి బయలుదేరారు. కాగా ఇచ్చోడ సమీపంలోని అగ్నిమాపక కార్యాలయం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఇద్దరికి గాయాలు కాగా వారిని 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.
ముందుగా వెళ్తున్న బైకును మరో బైకు ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్రంగా గాయలైన ఘటన ఆదివారం NZB జిల్లా సారంగపూర్ వద్ద చోటుచేసుకొంది. జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఉప్పుసురేష్ అనే వ్యక్తి నిజామాబాద్ నుంచి జాన్కంపేట్ వైపు బైక్ పై వెళుతుండగా సారంగాపూర్ కేడియా రైస్ మిల్లు వద్ద మరో బైక్ ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో బైక్ పై నుంచి పడి సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
KTRను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర చేస్తున్నారని మాజీమంత్రి, MLA వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. KTR బావమరిది జన్వాడలోని ఫామ్‌హౌస్‌లో తనిఖీలు చేసిన ఎక్సైజ్ ఆఫీసర్లు బాటిళ్లు తప్ప డ్రగ్స్ ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారని అన్నారు. మెజిస్ట్రేట్ సమక్షంలో సెర్చ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ సోదాలు ఆపాలని డీజేపీని కోరారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి అదనపు నీరు వస్తుండడంతో అధికారులు ఆదివారం సాయంత్రం 2 గేట్ల ఎత్తారు. దీని ద్వారా 6,248 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 15,702 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల (80.5TMC)కు గాను తాజాగా 1091 అడుగుల (80.501TMC) నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై దౌర్జన్యంగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కారణం, వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ నేత ఇంటిపై పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం సరైనది కాదని అన్నారు. ప్రజలే కేటీఆర్ ను రక్షించుకుంటారని ఆయన అన్నారు.
Sorry, no posts matched your criteria.