India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళా, శిశు సంక్షేమం కోసం నిర్దేశించిన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ, సంపూర్ణ లక్ష్య సాధనకు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపారు. నూతనంగా మంజూరైన అంగన్వాడి భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.
గణేశ్ విగ్రహాల నిమజ్జనం, మిలాద్-ఉల్-నబి, దుర్గామాత ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఎదుట 28 మందిని బైండోవర్ చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదైన DJ ఆపరేటర్లు, DJ యజమానులు, ట్రబుల్ మాంగర్స్‌ను బైండోవర్ చేశారు. వచ్చే 6 నెలల పాటు సత్ప్రవర్తనను కొనసాగించాలని సీపీ ఆదేశించారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన గణేశ్ చతుర్థి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అభిలాషించారు.
వినాయక చవితి పండగకు ముందే నిజామాబాద్‌లో పూల ధరలు కొండెక్కాయి. గులాబీలు, వివిధ రకాల చామంతుల ధరలు సోమవారం హోల్‌సెల్ మార్కెట్లో కిలో రూ.400 పలికాయి. బంతిపూలు రూ.200 కిలో చొప్పున విక్రయిస్తున్నారు. పూలదండల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. మరి పండుగ రోజు ధరలు ఎలా ఉంటాయో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్ ప్రభుత్వ ITIలో ప్రవేశాల కోసం ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపల్ ఎం.కోటిరెడ్డి తెలిపారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్, బేసిక్ డిజైన్ వర్చువల్ వెరిఫైర్, అడ్వాన్స్ CNC మెషినింగ్ టెక్నీషియన్, మెకానిక్, ఎలక్ట్రిక్ వెహికల్ ట్రేడ్స్‌లలో అడ్మిషన్లు జరుగుతాయన్నారు.
భీమ్‌గల్‌కి చెందిన అంకం జ్యోతి ఫౌండేషన్‌కు వరల్డ్ రికార్డ్ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాక్టర్ జ్యోష్ణ, రవి చేతుల మీదుగా ఫౌండేషన్ డైరెక్టర్ జ్యోతి అవార్డ్ అందుకున్నారు. 15 ఏళ్ల నుంచి పేద ప్రజలకు, వృద్ధులకు సహాయం చేస్తూ 3 సార్లు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు తీసుకున్నారు. అవార్డు రావడం సంతోషంగా ఉందని జ్యోతి తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 102 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులకు అర్జీలు అందజేశారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో తగ్గడంతో సోమవారం మధ్యాహ్నం వరద గేట్లను మూసివేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు 29,907 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోందని, దిగువకు అంతే మొత్తంలో వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇందిరమ్మ కాలువకు 20 వేలు, కాకతీయ కాల్వకు 3,500, సరస్వతి కాల్వకు 500, లక్ష్మీ కెనాల్‌కు 150, అలీ సాగర్ లిఫ్ట్‌కు 360 క్యూసెక్కుల నీరు వదులుతున్నామన్నారు.
గణేశ్ మండలి నిర్వహకులు విగ్రహాలను తరలించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిజామాబాద్ CP సాయి చైతన్య సూచించారు. కొన్ని రోజులుగా 4 విద్యుత్ ప్రమాదాలు జరిగాయని, వాటిలో 9 మంది యువకులు మరణించారని పేర్కొన్నారు. గణేశ్ విగ్రహాల రవాణా, స్థాపించే మండపాల వద్ద ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ పోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. సోమవారం నిజామాబాదులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు.
Sorry, no posts matched your criteria.