India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కారుకు ప్రమాదం జరిగింది. ఆయన హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఆదిలాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సదాశివనగర్ మండలం పద్మాజీవాడ ఫ్లై ఓవర్ వద్ద ఆయన ఫార్చూనర్ కారును వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారుకు స్వల్పంగా డ్యామేజ్ అయింది. కాగా ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం ఆయన ఆదిలాబాద్ ప్రయాణమయ్యారు.
మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమందించే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)లలో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజయ్ కుమార్ సూచించారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఏటీసీ భవనాల నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు.
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డిజిటల్ రేడియోగ్రఫీ ప్రారంభమైంది. రూ.28.30 లక్షలతో ఏర్పాటు చేసిన యంత్రాన్ని రోటరీ జిల్లా గవర్నర్ శరత్ చౌదరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, రోటరీ క్లబ్ జిల్లా అధ్యక్షుడు బీరెల్లి విజయరావు, కార్యదర్శి గంగారెడ్డి, ట్రస్ట్ ఛైర్మన్ వేద్ ప్రకాశ్ మిట్టల్, జుగల్ కిషోర్, కమల్ ఇనాని, శ్రీరాం సోని, భరత్ పటేల్ పాల్గొన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో నూతన వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన టీ. యాదగిరిరావును శుక్రవారం DCEB సెక్రటరీ B. సీతయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా V.C యాదగిరిరావును శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేయాలని సీతయ్య కోరారు. యూనివర్సిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా V.C యాదగిరిరావు తెలిపారు.
విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం యాచారం తండాలో గురువారం రాత్రి జరిగింది. తండాకు చెందిన మాలోత్ అనిల్ (23) మంచంలో నిద్రపోతుండగా విద్యుత్ వైరు కాలు తగలడంతో విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల పైన సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకు వచ్చినట్టు తెలంగాణ పంచాయతీ కార్యదర్శిల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి మధుసూదన్ రెడ్డి తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. వీరి ప్రొహిబిషన్ కాలాన్ని 2 సం. తగ్గించి సర్వీస్‌లోకి తీసుకోవాలని తెలిపారు. ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని కోరామన్నారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్‌లో గురువారం రాత్రి ఓ ఆవు గ్రామస్థులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఆవు గ్రామంలోని ప్రధాన వీధులలో తిరుగుతూ కనబడిన వారందరినీ గాయపరుస్తూ పరుగులు తీసింది. ప్రధాన రహదారిపై పరుగులు పెడుతూ ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడి ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి గ్రామస్థులతో కలిసి ఆవును అదుపులోకి తీసుకున్నారు.
కామారెడ్డి పట్టణంలో గుర్తు తెలియని రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటన తెల్లవారుజామున ఆర్.బీ నగర్ రైల్వే బ్రిడ్జి వద్ద జరిగిందని చెప్పారు. అతని వద్ద ఎస్బీఐ ఏటీఎంపై బాలరాజు అని, చేతిపై ఆర్ఆర్ పటేల్ అని రాసి ఉందన్నారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే పోలీసులకు లేదా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలని కోరారు.
వరి ధాన్యం సేకరణకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో వానాకాలం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ గ్రేడ్ క్వింటాలుకు రూ.2,320, సాధారణ రకానికి రూ.2300, సన్నరకం వడ్లకు అదనంగా రూ.500/- చెల్లిస్తుందని తెలిపారు. సన్నరకం ధాన్యం ఉంచడానికి ఎర్ర దారంతో బస్తాలు కుట్టాలన్నారు.
రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి వివరాల ప్రకారం.. NZBకి చెందిన ముజీబ్ బెగ్ (26) భార్య మూడు ఏళ్ల క్రితం మృతి చెందింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ముజీబ్ జాన్కంపేట రైల్వే స్టేషన్ వద్ద రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించామన్నారు.
Sorry, no posts matched your criteria.