India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రజాస్వామ్య పండుగలో ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధుడికి జిల్లా పోలీస్ బాస్ అండగా నిలిచారు. బుధవారం నిజామాబాద్‌లో పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్న క్రమంలో సీపీ పి.సాయి చైతన్య తనలోని మానవీయ కోణాన్ని చాటుకున్నారు. చంద్రశేఖర్ కాలనీలోని పోలింగ్ కేంద్రం వద్ద నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని చూసిన ఆయన స్వయంగా వీల్ ఛైర్‌ను నెట్టుకుంటూ వెళ్లి సదరు వృద్ధుడు ఓటు వేయడానికి సహకరించారు.

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం 1 గంట వరకు ఓవరాల్‌గా 39.68 శాతం పోలింగ్ నమోదైంది. NZB కార్పొరేషన్ లో 35.49 శాతం, ఆర్మూర్ మున్సిపాలిటిలో 47.93 శాతం, బోధన్‌లో 50.69 శాతం, భీంగల్ మున్సిపాలిటీలో 51.53 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో 4,95,485 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 1,96,606 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం సీపీ సాయి చైతన్య పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పర్యవేక్షించారు. నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్, చంద్రశేఖర్ కాలనీ, కోటగల్లి తదితర ప్రాంతాల్లోని బూత్‌లను సందర్శించి భద్రతను సమీక్షించారు. సీపీ స్వయంగా ఓ వృద్ధుడిని వీల్ చైర్‌లో పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లి మానవత్వం చాటుకున్నారు. ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 11 గంటల వరకు ఓవరాల్‌గా 22.54 శాతం పోలింగ్ నమోదైంది. NZB కార్పొరేషన్ లో 18.94శాతం, BDNలో 32.35%, ARMRలో 29.60%, BMGL మున్సిపాలిటీలో 31.09% పోలింగ్ నమోదైంది. జిల్లాలో 729 పోలింగ్ స్టేషన్లలో 4,95,485 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 1,11, 681మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) ఓవరాల్ గా 8.25 శాతం పోలింగ్ నమోదైంది. NZB కార్పొరేషన్‌తో పాటు BDN, ARMR, BMGL మున్సిపాలిటీల పరిధిలోని 146 వార్డులకు సంబంధించి 729 పోలింగ్ స్టేషన్లలో 4,95,485 మంది ఓటర్లకు గాను 40,857 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పట్టణ ఓటర్లు ఓటు కోసం తరలివెళ్తారా అనేది అభ్యర్థులను కలవర పెడుతున్న అంశం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనిపించిన ఉత్సాహం మున్సిపల్ ఎన్నికల్లో కనిపించడం లేదు. 2020లో NZB కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో 4,34,701 మంది ఓటర్లకు గాను 2,79,840 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగా డివిజన్లు, వార్డుల్లో 80 శాతం పోలింగ్ దాటలేదు.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో పోలింగ్ శాతం 15% కూడా దాటలేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై 9 గంటల వరకు నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి 6.49 శాతం, బోధన్ మున్సిపాలిటీలో 14.24 శాతం, ఆర్మూర్ మున్సిపాలిటీలో 11.05శాతం, భీంగల్ మున్సిపాలిటీలో 9.38 శాతం పోలింగ్ నమోదైంది.

బోధన్ పట్టణంలోని రాకాసిపేట్, గోశాలలో దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు SHO వెంకట నారాయణ తెలిపారు. రాకాసిపేట్ బూత్ నం 24, గోశాల బూత్ నం 78లోని పోలింగ్ కేంద్రాల్లో ఇద్దరు నిందితులు తప్పుడు గుర్తింపు పత్రాలతో ఓటు వేయడానికి ప్రయత్నించారన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను సదరు వ్యక్తులపై ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్, మున్సిపాలిటీలలో కాసేపట్లో పొలింగ్ ప్రారంభం కానుంది. నిజామాబాద్‌లోని 60 డివిజన్లకు 488 పొలింగ్ కేంద్రాలు, బోధన్‌లో 38 వార్డులకు 111 కేంద్రాలు, ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 106 పోలింగ్ కేంద్రాలు, భీంగల్ లో 12 వార్డులకు 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొలింగ్ జరగనుంది.

నవీపేట్ సమీపంలో విధుల్లో ఉన్న ఏఎస్ఐ గంగాధర్‌పై ఆటోతో దాడికి పాల్పడిన కేసులో నిందితుడు కాంబ్లె గంగాధర్‌కు ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. నిజామాబాద్ మూడవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇంచార్జీ జడ్జి దుర్గా ప్రసాద్ ఈ తీర్పునిచ్చారు. 2025 జూలైలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరుకుతాననే భయంతో నిందితుడు పోలీసులపైకి ఆటోను దూసుకెళ్లాడు. శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
Sorry, no posts matched your criteria.