Nizamabad

News July 17, 2024

నిజమాబాద్‌లో దారుణ హత్య

image

నిజామాబాద్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున వెలుగు చూసింది. వినాయక నగర్లోని ఓ టీ హోటల్ ముందు యువకుడు రక్తపు మడుగులో చనిపోయి ఉండటాన్ని హోటల్ యజమాని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. 4వ టౌన్ పోలీసులు, నగర సీఐ నరహరి అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. అతడిని మంగళవారం రాత్రి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 17, 2024

NZB: మద్యం మత్తులో యాసిడ్ తాగి యువకుడి మృతి

image

మద్యం మత్తులో యాసిడ్ తాగి ఓ యువకుడు మృతిచెందిన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. ఆటోనగర్‌కు చెందిన షేక్ మాజిద్(31) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. సోమవారం మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన మాజిద్ బాత్‌రూమ్‌లో ఉన్న యాసిడ్ తాగాడు. తీవ్రంగా కడుపునొప్పి రావడంతో గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై SI మొగులయ్య కేసు నమోదు చేశారు.

News July 17, 2024

నిజామాబాద్: రూ.45 లక్షలు కాజేసిన మహిళ

image

ఓ బ్యాంకు CSP నిర్వహకురాలు మహిళా సంఘాల వద్ద రూ.45లక్షలు కాజేసిన ఘటన పొతంగల్ మం. కల్లూర్‌లో వెలుగుచూసింది. CSPగా పనిచేస్తున్న సంధ్య 40 మహిళా సంఘాలకు చెందిన నగదును బ్యాంకులో జమచేసేది. కాగా 9 నెలలుగా ఆ నగదును ఆమె అక్కలు, తన బావ ఖాతాల్లో జమచేసింది. అనుమానం వచ్చిన IKP CC రమ బ్యాంకు లావాదేవీలు పరిశీలించగా విషయం బయటపడింది. దీనిపై విచారణ చేపట్టిన కోటగిరి SI సందీప్ సదరు మహిళను విచారించగా నేరం ఒప్పుకుంది.

News July 17, 2024

NZB: మాధవ నగర్ రైల్వే బ్రిడ్జిని పరిశీలించిన: MLA భూపతి రెడ్డి

image

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మాధవ నగర్ రైల్వే బ్రిడ్జిని మంగళవారం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే కాంట్రాటర్‌తో మాట్లాడుతూ.. రైల్వే బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని, వాహనా దారులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నీరడి దేవరాజ్, వాసు, కోట్ల భాస్కర్, వెంకట్ రెడ్డి, సాయిలు పాల్గొన్నారు.

News July 16, 2024

కామారెడ్డి: సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే క్రైస్తవ, మైనార్టీల విద్యార్థులు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి టి.దయానంద్ ఒక ప్రకటనలో కోరారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో 2024 గాను PG, PHD చేయాలనుకునేవారు స్కాలర్షిప్ మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. వివరాలకు కలెక్టరేట్‌లోని రూమ్ నం.222లో సంప్రదించాలన్నారు.

News July 16, 2024

KCRను కలిసిన ఆర్మూర్ BRS పార్టీ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం, BRS పార్టీ అధినేత KCRను ఆర్మూర్ నియోజకవర్గం BRS పార్టీ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి పలు అంశాలపై చర్చించామని రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

News July 16, 2024

సీఎం సమీక్ష సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

image

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొని జిల్లా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. రూరల్ వైద్యులను ప్రోత్సాహించేలా ఎక్కువ పారితోషికం ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్‌కు సీరియల్ నంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలి ఆదేశించారు.

News July 16, 2024

NZB: బీజేపీ, బీఆర్ఎస్‌ కుమ్మక్కయ్యాయి: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

image

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆరోపించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. ఆ రెండు పార్టీలు కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ కొన్ని రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ఎవరితో సంప్రదింపులు చేస్తున్నారో తమకు తెలుసన్నారు.

News July 16, 2024

నిజామాబాద్: పంచాయతీ కార్మికులకు తీపి కబురు 

image

ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. జిల్లాలోని 1,056 పంచాయతీల్లో పనిచేస్తున్న 2,909 మంది మల్టీపర్పస్ కార్మికులకు రూ.5.79కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికుల ఖాతాలో నగదును వెంటనే జమ చేయాలని పేర్కొంది. కార్మికులు వేతనాల కోసం నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

News July 16, 2024

నిజామాబాద్: పంచాయతీ కార్మికులకు తీపి కబురు 

image

ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. జిల్లాలోని 1,056 పంచాయతీల్లో పనిచేస్తున్న 2,909 మంది మల్టీపర్పస్ కార్మికులకు రూ.5.79కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికుల ఖాతాలో నగదును వెంటనే జమ చేయాలని పేర్కొంది. కార్మికులు వేతనాల కోసం నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.