Nizamabad

News July 12, 2024

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రులకు ఎంతో నమ్మకంతో వచ్చే నిరు పేదలు, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి, సర్కారు దవాఖానాల పనితీరుపై మరింత నమ్మకాన్ని పెంపొందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆయన వర్నిలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేసి మాట్లాడారు. ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.

News July 12, 2024

పిట్లం: మొబైల్ హ్యాక్ చేసి..రూ. 3.92 లక్షలు కాజేశారు..!

image

సైబర్ నేరగాడు ఓ వ్యక్తి మొబైల్ హ్యాక్ చేసి అకౌంట్ నుంచి డబ్బులు కాజేసిన ఘటన ఈనెల 2 వ తేదీన పిట్లంలో జరిగింది. కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిట్లంకు చెందిన గాండ్ల నాగ్‌నాథ్ మొబైల్ ఫోన్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.3.92 లక్షలు కాజేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News July 12, 2024

బోధన్: విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి

image

సాలంపాడ్ క్యాంపు చెందిన రాంబాబు(36)అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంబాబు గురువారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి బోరుబావి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌గురై మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 12, 2024

NZB: ఆందోళన కలిగిస్తోన్న కుక్కల బెడద

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల దాడిలో గాయపడ్డ వారి సంఖ్య ఆందోళన గలిగిస్తోంది. 2023 డిసెంబరులో నిజామాబాద్ జిల్లాలో382 కుక్క కాటు కేసులు నమోదు కాగా కామారెడ్డి జిల్లలో 56 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో NZBలో 376, KMRలో 32, ఫిబ్రవరిలో NZBలో 326, KMRలో 44, మార్చిలో NZBలో 326, KMRలో 38, ఏప్రిల్ లో NZBలో 335, KMRలో 40, మే నెలలో NZBలో 243, KMRలో 28 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి.

News July 12, 2024

నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి: కామారెడ్డి కలెక్టర్

image

జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిని నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్, పంచాయతీరాజ్, R&B, నేషనల్ హైవే, RWS, EWIDC, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. 

News July 11, 2024

నిజామాబాద్‌లో ఆయన కట్టడాలు ప్రత్యేకం!

image

నవాబ్ అలీ నవాజ్ జంగ్ జయంతిని రాష్ట్ర ఇంజినీర్స్ డేగా జులై 11న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కాగా ఆయన నిజామాబాద్ జిల్లాలో నిర్మించిన కట్టడాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు, ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం ‘బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ’ని ఆయన నిర్మించారు. వాటితో పాటు అలీ సాగర్ జలాశయానికి ఆయనే నామకరణం చేశారు.

News July 11, 2024

పొతంగల్‌లో పేకాటాడుతున్న 9 మంది అరెస్ట్

image

పోతంగల్ మండలం జల్లాపల్లి గ్రామంలో పోలీసులు పేకాటాడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. వారికి అందిన సమాచారం మేరకు పేకాట స్థావరం పై దాడి చేసినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. 9 మందిని అదుపులోకి తీసుకొని రూ.70,350 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. గ్రామాల్లో ఎవరైనా పేకాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News July 11, 2024

కామారెడ్డి జిల్లాలో హెచ్ఎంతో పాటు మరో 9 మందిపై పోక్సో కేసు

image

కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాన్సువాడ మండలంలోని దేశాయ్ పేట మంచి చెడులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయుడే పాఠశాల విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో 9 మందిపై పోక్సో కేసు నమోదు చేశారు. మరిన్ని వివారాలు తెలియాల్సి ఉంది.

News July 11, 2024

పంచాయతీల్లో బదిలీలకు అధికారుల సన్నాహాలు..!

image

పంచాయతీల్లో బదిలీలు చేసేందుకు అధికారులు సన్నాహలు చేస్తున్నారు. ఒకేచోట నాలుగేళ్ల నిండిన వారందిరికి ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పుడున్న మండలం కాకుండా వేరేచోటుకు మార్చాలని ఆదేశాలు రావటంతో అధికారులు జాబితా తయారు చేస్తున్నారు. జిల్లాలో 530 పంచాయతీలు ఉన్నాయి. 464 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుండగా అందులో 150 మందికి, ఎంపీవోలు 18, సిబ్బంది 25 మంది బదిలీలకు అవకాశం ఉంది.

News July 11, 2024

బీర్కూర్: అప్పులు తీర్చలేక యువకుడి సూసైడ్

image

బీర్కూరు మండలం బరంగేడ్గి గ్రామంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన వడ్ల కృష్ణమూర్తి(36) వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల నూతన గృహాన్ని అప్పులు చేసి నిర్మించారు. అప్పులు ఇచ్చినవారు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.