Nizamabad

News February 9, 2026

కమ్మర్‌పల్లి: వాలీబాల్ ఛాంపియన్‌లకు బహుమతుల ప్రదానం

image

కమ్మర్‌పల్లిలో ఇండోర్ స్టేడియంలో సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ వాలీబాల్ ఛాంపియన్షిప్-2026 పోటీలు జరిగాయి. బాలికల విభాగంలో నిజామాబాద్-1, మహబూబ్ నగర్-2, కరీంనగర్-3, మెదక్-4 స్థానాల్లో నిలిచాయి. బాలురు విభాగంలో మొదటి బహుమతి వరంగల్, నిజామాబాద్-2, ఖమ్మం-3, రంగారెడ్డి-4 స్థానాలు గెలుచుకున్నాయి. రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, వీఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ హనుమంత్ రెడ్డి బహుమతులు ఇచ్చారు.

News February 9, 2026

NZB: అలా ఉంటే వారిపై చర్యలు తప్పవు: పోలీస్ కమీషనర్

image

ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని, తరువాత బయటి వ్యక్తులు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉండరాదని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య హెచ్చరించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రచార సిబ్బంది, ఇతరులు అందరూ తప్పనిసరిగా సాయంత్రం 5గంటల లోపు తమ తమ గమ్యస్థానాలకు వెళ్లిపోవాలన్నారు.

News February 8, 2026

కమ్మర్‌పల్లి: ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడలు

image

కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం 8వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ వాలీబాల్ ఛాంపియన్షిప్-2026 పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐ గడ్డం నగేశ్, సర్పంచ్ కొత్తపల్లి హారిక పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిలో పట్టుదల, కృషి ఉంటే దేనినైనా సాధించవచ్చని అన్నారు. క్రీడాలు ఆరోగ్యానికి మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయన్నారు. చదువుతోపాటు క్రీడల్లో కూడా ప్రతి విద్యార్థి పాల్గొనాలని కోరారు.

News February 8, 2026

NZB మేయర్ BJP గెలిస్తే ప్రధాని వస్తారు: రఘునందన్ రావు

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ మేయర్ స్థానాన్ని గెలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి వస్తారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం రాత్రి నిజామాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కేరళ తిరువనంతపురంలో మేయర్ అభ్యర్థి గెలిస్తే ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్లారని గుర్తు చేశారు. అలాగే ఇక్కడికి వస్తారని హామీ ఇచ్చారు.

News February 8, 2026

NZB: ప్రచార కార్యక్రమాలపై నిషేధం

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ జిల్లాలోని NZB, BDN, ఆర్మూర్, భీమ్‌గల్ పట్టణాల్లో ఈ నెల 9న సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్‌లో బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు.

News February 8, 2026

NZB: బందోబస్తుతో కౌంటింగ్ హాల్‌కు తరలించాలి: కలెక్టర్

image

ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌ను NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం పరిశీలించారు. ఎంత మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటిని కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్యన కౌంటింగ్ హాల్‌కు తరలించాలని ఆదేశించారు.

News February 8, 2026

NZB: ఫెసిలిటేషన్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్

image

ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం సందర్శించారు. ఎంత మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెంటర్‌లో ఏర్పాట్లను అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.