Nizamabad

News February 10, 2026

NZB: మృతికి కారణమైన వ్యక్తికి మూడేళ్ల జైలు, జరిమానా

image

నందిపేట్ మండలం దత్తాపూర్ గ్రామానికి చెందిన సుంకరి విజయ్ మృతికి కారణమైన నడిపి గంగారాంకు 3 సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ NZB జిల్లా సెషన్స్ జడ్జి జీవీఎన్ భారత లక్ష్మి సోమవారం తీర్పు చెప్పారు. 2022లో విజయ్ పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన గంగారాం అకారణంగా విజయ్ వాగ్వాదానికి దిగి తోయడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News February 10, 2026

NZB: మృతికి కారణమైన వ్యక్తికి మూడేళ్ల జైలు, జరిమానా

image

నందిపేట్ మండలం దత్తాపూర్ గ్రామానికి చెందిన సుంకరి విజయ్ మృతికి కారణమైన నడిపి గంగారాంకు 3 సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ NZB జిల్లా సెషన్స్ జడ్జి జీవీఎన్ భారత లక్ష్మి సోమవారం తీర్పు చెప్పారు. 2022లో విజయ్ పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన గంగారాం అకారణంగా విజయ్ వాగ్వాదానికి దిగి తోయడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News February 9, 2026

NZB: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే నాన్ బెయిలబుల్ కేసులు

image

నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 5 మందికిపైగా గుమిగూడితే 163 BNSS చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు. సాయంత్రం 5 గంటల తర్వాత బయట ప్రాంతాల వారు ఉండరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే నాన్ బెయిలబుల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

News February 9, 2026

NZB: ఎలక్షన్ ఎఫెక్ట్.. 162 మంది బైండోవర్

image

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ పరిధిలో 162 మందిని సంబంధిత తహశీల్దార్ల ఎదుట హాజరు పరిచి బైండోవర్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. అలాగే ఎన్నికల ప్రవర్తన నియమా నియమావళిని ఉల్లంఘించిన వారిపై టౌన్-1, టౌన్-3, బోధన్, భీమ్‌గల్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

News February 9, 2026

NZB: 1,500 మంది సిబ్బందితో బందోబస్తు: సీపీ

image

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ పరిధిలో ఎన్నికల నేపథ్యంలో 1,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 3 ప్లాటున్ల TSSP సిబ్బంది , స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.

News February 9, 2026

NZB: మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి హాజరైన సెక్యూర్ సెల్ ఆఫీసర్ మంద మకరంద్‌తో కలిసి కలెక్టర్ సోమవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

News February 9, 2026

NZB: రేపు వీటికి సెలవు: కలెక్టర్

image

ఎన్నికల పోలింగ్ నిర్వహణకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లుగా వినియోగించే అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలకు 10న(మంగళవారం) సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అలాగే ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ హాల్స్‌గా వినియోగించే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలకు 12న (గురువారం), కౌంటింగ్ నిర్వహించబడే ఫిబ్రవరి 13న (శుక్రవారం) రెండు రోజుల పాటు లోకల్ హాలిడే వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు.

News February 9, 2026

NZB: సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి: సీపీ

image

మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కును వినియోగించుకునేలా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీపీ సాయి చైతన్య సూచించారు. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో సీపీ సోమవారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పటిష్ట బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. అదనపు డీసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి, ఏసీపీ ప్రకాశ్ పాల్గొన్నారు.

News February 9, 2026

NZB: ప్రచార ముగింపుతో పోల్ మేనేజ్మెంట్ వ్యూహాలు

image

నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్ వరకు గడిచే రెండు రోజులు కీలకంగా మారనున్నాయి. చివరి నిమిషం వరకు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్‌పై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు పంపిణీపై చర్చ సాగుతోంది.

News February 9, 2026

NZB: 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపవచ్చు: కలెక్టర్

image

ఈ నెల 11న జరగనున్న NZB, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దాన్ని తమ వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి సూచించారు. ఓటర్ కార్డు, ఆధార్, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫోటోతో కూడిన పోస్ట్ ఆఫీస్‌ అకౌంట్ ఇలా మొత్తం 18 రకాల గుర్తింపు కార్డులు తమ వెంట తీసుకెళ్లవచ్చన్నారు.