India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు వివిధ కారణాలతో వాయిదా పడుతున్న మంత్రి వర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుందని తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
చందూర్ గ్రామ శివారులో నిజాంసాగర్ ప్రధాన కాలువలో (28 ) గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సోమవారం కాలువలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి శరీరంపై బ్లాక్ కలర్ ప్యాంటు, ఎల్లో కలర్ షర్ట్ ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహన్ని మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు.
నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన ఆకాశ్, మనీష్, ప్రమోద్ రెండు రోజుల క్రితం తెల్లవారుజామున బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ హోటల్‌కు వెళ్లి బజ్జీలు తింటూ మరో 2 కావాలన్నారు. అయితే బజ్జీలు అయిపోయాయని హోటల్ యజమాని సచిన్ చెప్పగా గొడవ జరిగింది. అనంతరం నిందితులు సచిన్ ఇంటిపై పెట్రోల్ బాటిళ్లతో దాడి చేసి నిప్పంటించగా ఘటనపై 3వ టౌన్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలను దసరా పండగకు ముందే నిర్వహించుకుంటారు. అందుకు భిన్నంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో దసరా పండుగ తరువాత సద్దుల బతుకమ్మను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 15న పండగ నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఏటా దసరా అనంతరం పౌర్ణమికి ముందు మంచిరోజు చూసి సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహిస్తామని మండల ప్రజలు చెబుతున్నారు.
వేల్పూర్, భీంగల్ మండలంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన పలువురు ఆత్మీయులను మాజీ మంత్రి, బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డి ఇవాళ పరామర్శించారు. మెండోరా గ్రామ మాజి సర్పంచ్ బెల్దారి పోషన్న ఇటీవల అనారోగ్యానికి గురై మరణించడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక మోతె గ్రామానికి చెందిన గంగా గౌడ్ మరణించడంతో కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధైర్య పడొద్దు మీకు నేనున్నానంటూ భరోసా కల్పించారు.
భీంగల్ మండల కేంద్రంలో హనుమాన్ యువజన సంఘం నందిగల్లి భీంగల్ ఆధ్వర్యంలో దుర్గమాత లడ్డు వేలంపాట నిర్వహించారు. కాగా అదే గ్రామానికి చెందిన పిల్లోళ్ల.రాములు అనే వ్యక్తి రూ. 1,00,000/- లడ్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డును పిల్లోల్ల రాములు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ సంప్రదాయాల స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడం అభినందనీయమని TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన “అలయ్ బలయ్” కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ కుమార్ మాట్లాడుతూ దత్తాత్రేయ 19 ఏళ్లుగా జెండాలు, ఎజెండాలకు అతీతంగా దసరా మరుసటి రోజు నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం స్పూర్తి అని కొనియాడారు.
పిట్లం మండలం బొల్లక్పల్లి గ్రామ శివారు మంజీరా నది బ్రిడ్జి సమీపంలో బాన్సువాడ వెళ్లే రహదారిపై ఇవాళ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అయితే వాహనదారులు పోలీసులను చూసి హెల్మెట్ లేక తమకు అపరాధ రుసుము (ఫైన్) వేస్తారని కూత వేటు దూరాన ఆగిపోయారు. ఏ ఒక్కరికి కూడా హెల్మెట్ లేక గంటల తరబడి వేచి ఉన్నారు. హెల్మెట్ భారం కాదు భరోసా అని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు హెల్మెట్ వాడకాన్ని విస్మరిస్తున్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు <<14345490>>తనికెళ్ల భరణి<<>> కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం బాసర వేదభారతి పీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీ అమ్మవారి సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందని దిల్ రాజు అన్నారు.
తాడ్వాయి మండలం నందివాడలోని ఓ బావిలో చిన్నారులు విఘ్నేశ్ (7), అనిరుధ్(5 ) <<14345635>>మృతదేహాలు లభ్యమైన<<>> సంగతి తెలిసిందే. పోలీసులు, అధికారులు గాలింపు చేపట్టగా తండ్రి శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది. తండ్రితో పాటు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.