Nizamabad

News September 30, 2024

రేపు కామారెడ్డికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

image

కామారెడ్డి: స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 1వ తేదీ మంగళవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చెప్పారు. స్థానిక కొత్త బస్టాండ్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం పట్టణంలోని తిలక్ రోడ్డులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నా తర్వత రాజారెడ్డి గార్డెన్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారన్నారు.

News September 30, 2024

NZB: మంత్రి జూపల్లి రాక

image

మంత్రి జూపల్లి ఇవాళ జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటలకు మోర్తాడ్, 11 గంటలకు భీంగల్, ఆ తర్వాత ఆర్మూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ భవనాలను ప్రారంభిస్తారని అధికారులు, నాయకులు తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నిజామాబాద్‌లోని IDOC సమీక్షా సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.

News September 29, 2024

NZB: చెత్తకాగితాలు పోగు చేసుకునే వ్యక్తి హత్య

image

నిజామాబాద్‌ నగరంలోని మూడో టౌన్ రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో హత్య జరిగింది. 3వ టౌన్ ఎస్సై మహేశ్ వివరాల ప్రకారం.. నవీపేట్‌కు చెందిన గణేశ్ (30) హత్యకు గురైనట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు శనివారం రాత్రి ఘటనా స్థలానికి వెళ్లగా చెత్త సేకరించుకొని బ్రతికే వ్యక్తిగా గుర్తించారు. గుర్తుతెలియని వారు మెడకి తాడు బిగించి హత్య చేసినట్లు గుర్తించమన్నారు. కేసు నమోదైంది.

News September 29, 2024

శ్రీ నరేంద్రాచార్య మహరాజ్‌ను దర్శించుకున్న ప్రముఖులు

image

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దోస్త్ పల్లి, బంగారపల్లి శివారులో గల తెలంగాణ ఉపపీఠంలో జగద్గురు శ్రీ స్వామి నరేంద్రాచార్య మహరాజ్‌ను శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వ్యక్తిగత కార్యదర్శి శ్రీ బాలాజీ పాటిల్ ఖత్ గావ్ కర్ దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట నాందేడ్ జిల్లా బీజేపీ నాయకులు వెంకట్రావు, పాటిల్ గోజేగావ్కర్, శివరాజ్ పాటిల్ హోటల్కర్, మాధవ్ రావు ఉన్నారు.

News September 29, 2024

ఏపీలోని మైదుకూరులో రోడ్డు ప్రమాదం.. బాన్సువాడ వాసి మృతి

image

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన సయ్యద్ అహమదుల్లా శనివారం ఏపీలోని మైదుకూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మైదుకూరు పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని వీక్లీ మార్కెట్లో నివాసం ఉంటున్న సయ్యద్ అహ్మదుల్లా(39) బైకుపై వెళ్తున్న క్రమంలో టిప్పర్ ఢీకొట్టడంతో మృతి చెందినట్లు తెలిపారు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

News September 29, 2024

NZB: ఈనెల 30న జిల్లాకు రానున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

image

నిజామాబాద్ జిల్లాకు ఈనెల 30న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రానున్నారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఆర్మూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారని ఎక్సైజ్ SHO స్టీవెన్ సన్ తెలిపారు. అలాగే మోర్తాడ్ మండల కేంద్రంలోనూ ఎక్సైజ్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారని ఎక్సైజ్ సీఐ గుండప్ప తెలిపారు.

News September 28, 2024

NZB: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో నిద్రించిన కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం పోచంపాడ్ లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం రాత్రి నిద్రించారు. రాత్రి రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, రోజువారీ దినచర్య, మెనూ, స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపల్‌ను అడిగి తెలుసుకున్నారు.

News September 28, 2024

TU: బ్యాక్ లాగ్ పరీక్షల రీవాల్యుయేషన్ షెడ్యూల్ ప్రకటన

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ బ్యాక్ లాగ్ పరీక్షల రీవాల్యుయెషన్ షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారిణి ఆచార్య ఎం.అరుణ శనివారం వెల్లడించారు. బ్యాక్ లాగ్ పీజీ విభాగం,LLB I,III,IV,V సెమిస్టర్ బ్యాక్ లాగ్ మరియు VI రెగ్యులర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు హాజరైన వారు మాత్రమే అర్హులన్నారు. ఒక్కో పెపర్ రూ.500 చెల్లించవలసి ఉండగా, అక్టోబర్ 1లోపు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

News September 28, 2024

NZB: వచ్చే నెల 5న TGO అసోసియేషన్ ఎన్నికలు

image

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఎన్నికలు వచ్చే నెల (అక్టోబర్)5 నిర్వహించనున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారి, MVI కె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని టీఎన్జీవో కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 5న నామినేషన్లు, స్క్రూటినీ, విత్ డ్రాలతో పాటు ఎన్నిక పక్రియ ఉంటుందని ఆయన వివరించారు.

News September 28, 2024

NZB: ఎమ్మెల్సీ కవిత కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కనిపించడం లేదని నగరానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు ఆదే ప్రవీణ్ కుమార్, కోనేటి సాయికుమార్, ఈర్ల శేఖర్ శనివారం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు నెలలుగా కవిత కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. లిక్కర్ కేసులో బెయిల్ పై విడుదలైనా కూడా ఆమె జిల్లాలో కనిపించడం లేదన్నారు. ఆమెను వెతికి జిల్లా ప్రజల ముందు ఉంచాలని కోరారు.