Nizamabad

News February 2, 2026

జక్రాన్ పల్లి ఎయిర్‌పోర్టు కలేనా?

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసుల ఎయిర్‌పోర్టు కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జక్రాన్‌పల్లి విమానాశ్రయ ప్రస్తావనే లేకపోవడం ప్రజలను నిరాశకు గురిచేసింది. నిజామాబాద్ రూరల్ పరిధిలో 1,663 ఎకరాలకు అదనంగా మరో 68 ఎకరాల భూమి అవసరమని అంచనా వేసినా, నిధుల కేటాయింపు లేకపోవడంతో ఈ ప్రాజెక్టు మళ్లీ మూలన పడినట్లయింది.

News February 2, 2026

NZB: నలుగురు మైనారిటీలకు బీజేపీ టికెట్లు

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నలుగురు మైనార్టీలకు పార్టీ టికెట్లు కేటాయించింది. ఈ మేరకు 12వ డివిజన్ నుంచి అక్తరీ బీ, 32వ డివిజన్ నుంచి తహసీన్ సుల్తానా, 33వ డివిజన్ నుంచి నాజీయ తబస్సుమ్, 55వ డివిజన్ నుంచి మహ్మద్ ఇమ్రాన్ ఖాన్‌కు కార్పొరేటర్ టికెట్లు కేటాయించినట్లు పార్టీ నాయకులు ప్రకటన విడుదల చేశారు.

News February 2, 2026

NZB: గత ఏడాదితో పోలిస్తే పెరుగుతున్న పసుపు ధర

image

నిజామాబాద్ మార్కెట్‌లో కొత్త పసుపు ధరలు గత ఏడాదితో పోలిస్తే పెరిగాయి. క్వింటాల్‌కు సగటున రూ.12 నుండి 14 వేల ధర పలుకుతోంది. రకాన్ని బట్టి ధరలు కనిష్ట ధర రూ. 8,000 నుంచి గరిష్టంగా రూ.14,800 వరకు ఉండే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. కాగా సోమవారం మార్కెట్‌కు కొత్త పసుపు 8వేల బ్యాగులు వచ్చాయని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. శనివారం మార్కెట్‌లో బీట్ మేరకు రూ.14 వేల ధర పలికిందన్నారు.

News February 2, 2026

TU: B.Tech విద్యార్థులకు అలర్ట్

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని B.Tech మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపుకు నేడే చివరి తేదీ అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈరోజు సాయంత్రం 5 గం.లోపు చెల్లించాలని ఆయన వెల్లడించారు. అపరాధ రుసుము రూ.100 తో రేపటికి చివరి తేదీయని పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.

News February 2, 2026

NZB: కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద..!

image

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద తలనొప్పిగా మారింది. ప్రతీ డివిజన్లో సగటున ఇద్దరు తరపున ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ ఉపసంహరణకు మూడో తేదీ వరకూ సమయం ఉండటంతో రెబెల్స్ డ్రాప్ అయ్యేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మేయర్ ఆశావహులు తక్కువగానే ఉన్నా.. కార్పొరేటర్ రేస్‌లో ఎక్కువ మంది ఉన్నారు. అయితే బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ ఇప్పటికీ ప్రకటించలేదు.

News February 2, 2026

నిజామాబాద్: ఫిబ్రవరి 5లోపు దరఖాస్తు చేసుకోవాలి

image

నిజామాబాద్ నాగారంలోని తెలంగాణ మైనారిటీ బాలుర జూనియర్ కళాశాలలో ఐఐటీ, నీట్, క్లాట్, సీఏ ఉచిత కోచింగ్‌తో పాటు ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో అడ్మిషన్ల కోసం ఫిబ్రవరి 14న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ హైదర్ తెలిపారు. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఫిబ్రవరి 5లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాలను సంప్రదించాలన్నారు.

News February 2, 2026

నవీపేట్ చెక్‌పోస్ట్ వద్ద బైక్ స్కిడ్‌.. వ్యక్తి మృతి

image

నవీపేట్ మండలంలో ఆదివారం రాత్రి చెక్‌పోస్ట్ వద్ద అబ్బాపూర్‌కు చెందిన కదం రమేశ్(35) తన బైక్‌పై నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. నవీపేట్ నుంచి అబ్బాపూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో రమేశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News February 2, 2026

NZB: నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో ముగ్గురికి మెడల్స్

image

నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో NZB జిల్లాకు చెందిన ముగ్గురు అథ్లెట్లు ఆయా విభాగాల్లో మెడల్స్ సాధించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో భాగంగా గోపి(35+) 400 మీటర్ల హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్, ట్రిపుల్ జంప్, 110 మీటర్ల హార్డిల్స్‌లో సిల్వర్ మెడల్స్, దినేశ్(40+) ట్రిపుల్ జంప్‌లో గోల్డ్ మెడల్, ఉత్తమ్ సింగ్(40+) 400 మీటర్ల హర్డిల్స్‌లో సిల్వర్ మెడల్ గెలుపొందారు.