India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. MBBS నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిపై సీనియర్లు (హౌస్ సర్జన్స్) ర్యాగింగ్‌కు పాల్పడి దాడి చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కాగా ర్యాగింగ్, దాడి ఘటనపై ఫిర్యాదు అందిందని విచారణ జరుపుతున్నామని NZB వన్‌టౌన్ SHO రఘుపతి తెలిపారు.
నిన్న NZB జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టుబడిన వాటి వివరాలను CP వెల్లడించారు. NZB డివిజన్లో రూ. 1,21,92,750 నగదు, రూ.10.14 కోట్ల విలువైన 137 చెక్కులు, రూ.7.10 కోట్ల విలువైన 170 ప్రామిసరీ నోట్లు, ఆర్మూరులో 324 ప్రామిసరీ నోట్లు, వాటి విలువ రూ.4.97 కోట్లు, రూ.1.85 కోట్ల బాండ్లు, రూ.30.36 లక్షల 62 చెక్కులు స్వాధీనపర్చుకున్నారు.
దివ్యాంగులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు ఉన్నాయని జిల్లా విద్యాధికారి అశోక్ సూచించారు. శనివారం ఆర్మూర్‌లో దివ్యాంగ విద్యార్థులకు సహాయ పరికరాల కోసం లబ్ధిదారుల గుర్తింపు శిబిరాన్ని నిర్వహించారు. దివ్యాంగుల అవసరాన్ని గుర్తించి సహాయ ఉపకరణాలు అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులను శిబిరానికి రప్పించడంలో కృషి చేసిన IERPలను అభినందించారు.
సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసాలకు తెరలేపారు. వాట్సాప్‌లో మీ ద్విచక్ర వాహనానికి ఈ-చలాన్ పడిందని మెసేజ్‌లు పంపి Apk లింక్ పంపుతున్నారు. గాభరా పడిన ప్రజలు ఆ లింక్ ఓపెన్ చేయగా వారి ఫోన్ హ్యాక్ అయి వారి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతున్నాయి. ప్రజలెవరూ అలాంటి Apk లింక్‌లు ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైం వింగ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల దందాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజాము నుంచి సోదాలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు 10 బృందాలు వడ్డీ వ్యాపారుల ఇండ్లలో, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. వడ్డీ వ్యాపారులు ఆస్తులు తనఖా, రిజిస్ట్రేషన్లు చేసుకుని, అధిక వడ్డీలు వసూలు, లైసెన్స్ లేకుండా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహణపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సోదాలు జరుగుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 4,47,788 ఆహార భద్రతా కార్డులుండగా అందులో 15,21,062మంది సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతనెల నుంచి కొత్త ఆహార భద్రత కార్డులను పంపిణీ చేస్తుండగా జిల్లా వ్యాప్తంగా 44,278 నూతన కార్డులు మంజూరయ్యాయి. ఇందులో 1,26,559మంది కొత్త సభ్యులు చేరగా జిల్లాలోని 759 రేషన్ దుకాణాల ద్వారా 7,639 మెట్రిక్ టన్నుల సన్నబియ్యంను SEPT 1 నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు ASIలకు SIలుగా ప్రమోషన్ లభించింది. మాక్లూర్ పోలీస్ స్టేషన్లో ASIగా పనిచేస్తూ SIగా పదోన్నతి పొందిన గంగాధర్‌ను జగిత్యాలకు, 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ASI రమేష్‌ను SIగా నిర్మల్‌కు బదిలీ చేశారు. ప్రమోషన్ పొందిన SIలను పోలీస్ కమీషనర్ సాయి చైతన్య అభినందించి బ్యాడ్జీలు అందజేశారు.
బోధన్ పట్టణ కేంద్రంలోని ఆయేషా గార్డెన్స్‌లో నిర్వహించే VHPS, MRPS సన్నాహక సభకు MRPS వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఎన్నికల సమయంలో పెన్షన్లు పెంచుతామని చెప్పి ఇప్పటివరకు పెంచకపోవడంతో భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేసే దిశగా ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వికలాంగులు, పెన్షన్‌దారులు పెద్దఎత్తున ఈ సభకు తరలిరావాలని నిర్వాహకులు కోరారు.
నూతన జిల్లా కమిటీ విస్తరణలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా ప్రధానకార్యదర్శిగా నాగోల్ల లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 28 ఏళ్లుగా పార్టీలో బూత్ అధ్యక్షుడి స్థాయి నుంచి నిబద్ధతతో, చురుకుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన అధిష్ఠానం మరోసారి జిల్లా కమిటీలో క్రియాశీలక బాధ్యతను అప్పగించింది. 1997లో బూత్ అధ్యక్షుడిగా పార్టీలో లక్ష్మీనారాయణ ప్రస్థానం ప్రారంభమైంది.
రుద్రూర్ గ్రామానికి చెందిన బాలుడు జ్యోతే కేదార్ (14) గురువారం రాత్రి నుంచి కనిపించడం లేదని తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ సాయన్న ఈరోజు తెలిపారు. స్కూల్ వెళ్లకుండా బోధన్ టౌన్‌కు వెళ్లినందుకు తల్లిదండ్రులు మందలించారన్నారు. రాత్రి కేదార్ ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడని. బంధువుల వద్ద గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదని తల్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.