India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎంఆర్ బియ్యాన్ని త్వరగా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రాజంపేటలోని శంకధార రైస్ మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైసుమిల్లుకు కేటాయించిన వరి ధాన్యాన్ని తొందరగా సరఫరా చేయాలని అన్నారు. రైస్ మిల్లులో వరి ధాన్యం బస్తాలను లెక్కించే విధంగా పెట్టాలని అన్నారు.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరుగుతోంది. తాజాగా మంగళవారం ఉ.9 గంటలకు 40 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఔట్ ఫ్లోగా 29,666 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల (80.5TMC)కు గాను ప్రస్తుతం 1091 అడుగుల (80.501TMC) నీరు నిల్వ ఉందని తెలిపారు.
నిజాంసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు తేదీని అక్టోబర్ 7 తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ సత్యవతి తెలిపారు. సెప్టెంబర్ 23తో గడువు ముగియనుండగా దాన్ని అక్టోబర్ 7 వరకు పెంచారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. https://navodaya.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్‌ను ఢిల్లీలోని ఆయన నివాసంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న అర్వింద్ సోమవారం ఆయన్ను కలిసి పలు అంశాలపై చర్చించారు.
నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్‌లో గల సీఎం రోడ్ గల్లీ మదర్సా ప్రాంతంలోని వాజిద్ ఖాన్ ఇంట్లో నసీర్ అనే యువకుడు సోమవారం పట్టపగలు చోరీకి యత్నించాడు. అదే సమయంలో యజమాని పిల్లలతో సహా తిరిగి వచ్చారు. వారిని చూసిన దొంగ కత్తితో బెదిరించి పారిపోయేందుకు యత్నించాడు. కాగా అప్రమత్తమైన స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ప్రజావాణికి 97 ఫిర్యాదులు అందాయి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 97 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్‌లకు సమర్పించారు.
నిజామాబాద్‌లో BRS పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు MIM గూటికి చేరారు. నగర పాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్ అలీఖాన్, వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ ఫయాజ్, 57వ డివిజన్ ఇన్ ఛార్జ్ అమర్ తదితరులు సోమవారం MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. నగరంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడిమృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం రెంజల్ మండలం మౌలాలి తండాకు చెందిన జాదవ్ సంతోష్ (38)ఆదివారం చేపలవేటకు అలీసాగర్ మెయిన్ కెనాల్‌కి వెళ్లాడు. అతడు తిరిగిరాక పోయేసరికి కుటుంబీకులు కెనాల్ వద్ద గాలించగా కాలువ వద్ద సంతోష్ దుస్తులు కనిపించాయి. ఇరిగేషన్ సిబ్బందికి సమాచారం అందించి నీటివిడుదలను నిలిపివేయగా కాలువలో సంతోష్ మృతదేహం లభ్యమైంది.
నగరంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు వన్ టౌన్ పరిధిలోని నాగేంద్రుడి గుడి వెనకాల గల ప్రదేశంలో పేకాట ఆడుతుండగా వన్ టౌన్ SHO విజయబాబు, తన సిబ్బందితో ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పదిమంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9200 నగదు, రెండు బైక్లు, 9 స్మార్ట్ ఫోన్ లను స్వాధీన పరుచుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఇండియన్ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించారు. తెలంగాణ ప్రభుత్వం తనను డీఎస్పీగా నియమించడం పట్లం హర్షం వ్యక్తం చేస్తూ షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.