Nizamabad

News January 31, 2026

NZB: ముగ్గురికి జైలు.. 14 మందికి జరిమానా

image

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ శుక్రవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 14 మందికి రూ.1.40 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

News January 30, 2026

NZB: నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించం: కలెక్టర్

image

విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. శుక్రవారం ఆమె ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, హాస్టళ్ల ఆర్‌సీఓలు, నిర్వాహకులతో మాట్లాడారు. విద్యార్థులతో ఆప్యాయంగా వ్యవహరిస్తూ, తమ సొంత బిడ్డలుగా వారి సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంక్షేమం కోసం పలు సూచనలు చేశారు.

News January 30, 2026

NZB: నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్

image

మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని 13, 14, 15 డివిజన్ల నామినేషన్ల స్వీకరణ కేంద్రంతో పాటు అర్సపల్లి వాటర్ ట్యాంక్ జోన్ ఆఫీసు‌లో ఉన్న కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ తీరును క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. నిబంధనలకు అనుగుణంగా స్వీకరణ ప్రక్రియ జరుగుతోందా లేదా అని ఆరా తీశారు.

News January 30, 2026

బోధన్: బీజేపీ అభ్యర్థిగా ఆసియా బేగం నామినేషన్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల్లో మూడో రోజు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం పట్టణంలోని గోశాల 27వ వార్డు నుంచి మైనారిటీ మహిళ ఆసియా బేగం బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

News January 30, 2026

NZB: గాంధీ పేరును రూపుమాపాలని BJP కుట్ర: DCC

image

భారత జాతిపిత మహాత్మా గాంధీ పేరును రూపుమాపాలని BJP కుట్ర చేస్తున్నదని NZB జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆరోపించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా DCC కార్యాలయంలో గాంధీ చిత్ర పటానికి, నగరంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. గాంధీ పేరును మార్చాలనే కుట్రతో ఉపాధి హామీ పని పేరును మారుస్తూ జీ రామ్ జీ అని పెట్టారన్నారు. ప్రజలు BJP కుట్రలను గమనిస్తున్నారన్నారు.

News January 30, 2026

NZB: స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తులు ఇవే..!

image

రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల కోసం అనేక ఉచిత గుర్తులను కేటాయించింది. వాటిలో ఏసీ, యాపిల్, గాజులు, పండ్ల బుట్ట, బ్యాట్, బ్రెడ్, గ్యాస్ సిలిండర్, కుక్కర్, రిఫ్రిజిరేటర్, జామకాయ, ద్రాక్ష, పుచ్చకాయ, కెమెరా, టెలిఫోన్, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్, బ్యాట్, ఫుట్బాల్, క్యారమ్ బోర్డు, విజిల్, కుర్చీ, టేబుల్, సోఫా, మంచం లాంటి 75 గుర్తులను కేటాయించారు.

News January 30, 2026

NZB: ధీమాతో నామినేషన్.. టికెట్ కోసం టెన్షన్ !

image

NZB జిల్లాలో రెండు రోజుల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటితో ముగియనుండటంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. నేతలు గెలుపు గుర్రాల వేటలో ఉండగా.. టికెట్ వస్తుందన్న ధీమాతో కొందరు, నేతల హామీతో మరికొందరు నామినేషన్లు సమర్పిస్తున్నారు. కాగా టికెట్ దక్కుతుందో లేదోనని పలువురు ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. టికెట్ దక్కని వారు పక్క పార్టీ నేతలలో సంప్రదింపులు జరుపుతున్నారు.

News January 30, 2026

NZB: నామినేషన్ల దాఖలుకు నేడే ఆఖరు

image

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తొలి ఘట్టమైన నామినేషన్ల దాఖలు పర్వం శుక్రవారం ముగియనుంది. దీంతో చివరి రోజు జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ నగరపాలక సంస్థలతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో భారీగా నామినేషన్లు దాఖలు కానున్నాయి. కాగా నిన్న, మొన్న 2 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 400 నామినేషన్లు దాఖలు అయిన సంగతి తెలిసిందే. ఇందులో NZBలో 242, ఆర్మూర్‌లో 66, బోధన్లో 72, భీంగల్‌లో 37 నామినేషన్లు వచ్చాయి.

News January 30, 2026

NZB: కార్పొరేషన్ ‘హస్త’గతం కోసం యత్నాలు

image

గత కార్పొరేషన్ ఎన్నికల్లో 2 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠం హస్తగతం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు గెలుపు గుర్రాల కోసం ఇప్పటికే సర్వేలు పూర్తి చేసింది. అవసరమైతే AIMIM పొత్తు పెట్టుకుని తమ అభ్యర్థిని మేయర్ చేయాలని ఎత్తుగడలు వేస్తున్నారు.

News January 30, 2026

NZB: మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రైవేటు, కార్పొరేటు హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేయాలని NZB జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం నిర్వహించిన వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీక్షలో ఆమె మాట్లాడారు. నిరుపేదలకు సేవలందించే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. DMHO రాజశ్రీ పాల్గొన్నారు.