Nizamabad

News January 28, 2026

నిజామాబాద్: జిల్లా కలెక్టర్‌తో ఎలక్షన్ అబ్జర్వర్ భేటీ

image

మున్సిపల్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సి.హెచ్. సత్యనారాయణ రెడ్డి బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠితో భేటీ అయ్యారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లపై కలెక్టర్ ఆయనకు వివరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.

News January 28, 2026

NZB: విధులకు డుమ్మా.. ఆర్మూర్ హెచ్‌ఎం సస్పెన్షన్!

image

మున్సిపల్ ఎన్నికల విధులకు గైర్హాజరైన ఆర్మూర్ గర్ల్స్ హైస్కూల్ హెచ్‌ఎం వనజారెడ్డిపై వేటు పడింది. 4, 5, 6 వార్డుల రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు ఉన్నప్పటికీ, ముందస్తు అనుమతి లేకుండా ఆమె విధులకు రాలేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) అశోక్ ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 28, 2026

NZB: అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం ఆమె బాన్సువాడలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

News January 28, 2026

NZB:మున్సిపోల్స్.. కౌన్సిలర్ టికెట్ల కోసం వెంపర్లాట

image

నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల టికెట్ల కోసం ఆశావాహులు వెంపర్లాడుతున్నారు. పోటీలో ఉండే అభ్యర్థుల ఎంపికపై అధికారికంగా జాబితా ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు మిగతా పార్టీల నుంచి పోటీచేసే ఆశావాహులు అభ్యర్థనలు పెట్టుకోగా బరిలో ఎవరు నిలుచుబోతున్నారనేది మీమాంసగా మారింది. ఆశావాహులు మాత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

News January 28, 2026

నిజామాబాద్: 108లో ఉద్యోగాలు

image

108 అంబులెన్స్‌లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(EMT)గా పనిచేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు 108 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ తెలిపారు. NZB జిల్లాలో 20 పోస్టులకు BSC(BZC), BSC నర్సింగ్, GNM, DMLT చేసిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో NZB జిల్లా ఆసుపత్రిలో బుధ, గురువారాలు సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 9100799106కు సంప్రదించాలన్నారు.

News January 28, 2026

NZB: కార్పొరేషన్ ఎన్నికల్లో CPI (ML) న్యూడెమోక్రసీ పోటీ

image

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో CPI (ML) న్యూడెమోక్రసీ పోటీ చేస్తున్నట్లు నగర కార్యదర్శి నీలం సాయిబాబా ప్రకటించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 7వ డివిజన్లో ఆకుల పాపన్న, 24వ డివిజన్లో ఆకుల అరుణ లు పోటీలో ఉంటారని తెలిపారు. డివిజన్ ప్రజలు మున్సిపాలిటీ పాలక వర్గంలో ప్రజల సమస్యలపై పోరాటం చేయడానికి అవకాశం కల్పించాలని కోరారు. శివకుమార్, రమేష్, మోహన్, జన్నారపు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

News January 27, 2026

NZB: 20 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ: కమిషనర్

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి 60 డివిజన్లో అభ్యర్థుల నామినేషన్ స్వీకారం కోసం 20 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. మూడు డివిజన్లకు కలిపి ఒక కేంద్రం చొప్పున నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోటీ చేసే అభ్యర్థులు తమ కేంద్రాలను గుర్తించాలని సూచించారు.

News January 27, 2026

NZB: ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా సిద్ధం: కలెక్టర్

image

ఎన్నికల సంఘం నియమ, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఎన్నికల షెడ్యూల్ ను అనుసరిస్తూ బుధవారం నుండి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా ఆయా మున్సిపాలిటీల పరిధిలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News January 27, 2026

నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి బదిలీ

image

నిజామాబాద్ నగర ఏసీపీ ఎల్. రాజా వెంకటరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సైబరాబాద్ ఎస్బీ ఏసీపీగా పనిచేస్తున్న బి. ప్రకాష్‌ను నియమిస్తూ డీజీపీ శశిధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన రాజా వెంకటరెడ్డి బదిలీ కావడం నగరంలో చర్చనీయాంశమైంది. బదిలీ అయిన ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని అధికారులు ఆదేశించారు.

News January 27, 2026

నిజామాబాద్: ఇందిరమ్మ ఇండ్లకు రూ.266.94 కోట్లు

image

నిజామాబాద్ జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇండ్లు లక్ష్యం కాగా 16,919 ఇండ్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అందులో 12,850 మార్కింగ్ పూర్తి అయ్యాయని, 9,865 ఇండ్లు బేస్మెంట్ పూర్తి అయ్యాయన్నారు. రూఫ్ లెవెల్‌కు 6,651 ఇండ్లు, స్లాబ్ లెవెల్‌కు 4,981 ఇండ్లు, 216 ఇండ్లు పూర్తి అయ్యాయన్నారు. ఇందుకోసం రూ.266.94 కోట్లు ఖర్చు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.