India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉపాధ్యాయ, ఉద్యోగులు, విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగుల అన్ని రకాల పెండింగ్ బిల్లుల విడుదల చేయాలని, PRC అమలు కోసం ఎమ్మెల్సీల నిరవధిక సమ్మెకు ఇందూరు తపస్ పూర్తి మద్దతు ప్రకటించింది. టీచర్ ఎమ్మెల్సీలు AVN రెడ్డి, మల్క కొమరయ్య, గ్రాడ్యుయేట్ MLC అంజిరెడ్డి మంగళవారం 24 గంటల నిరవధిక ధర్నాను హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో నిర్వహిస్తున్నారు. ఇందూరు తపస్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగానికి సంబంధించి NZB జిల్లాలో ఇప్పటి వరకూ 2,89,727 కుటుంబాలకు ప్రతి నెలా జీరో బిల్లులు జారీ చేస్తున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.219.96 కోట్ల సబ్సిడీని అందజేసిందన్నారు. అలాగే నాయీ బ్రాహ్మణ, రజక వృత్తుల్లో ఉన్న 3,023 మంది లబ్ధిదారులకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నారన్నారు.

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 4,41,023 ఆహార భద్రత కార్డుల ద్వారా 15,63,113 మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రస్తుతం 2026 జనవరి నెలలో 9024.451 మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యాన్ని కేటాయించగా అందులో 8573.227 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగిందని పౌర సరఫరాల శాఖ ప్రగతిని కలెక్టర్ వివరించారు.

రైతు భరోసా పథకంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములను ఎకరాకు సీజనకు రూ.6 వేల చొప్పున సంవత్సరానికి రూ.12 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. ఇప్పటి వరకు ఈ పథకంలో భాగంగా NZB జిల్లాలో 2,72,589 మంది రైతుల బ్యాంక్ ఖాతాలలో రూ.316.63 కోట్ల జమ చేయడం జరిగిందని వివరించారు.

గత 15 నెలలుగా పెండింగ్‌లో ఉన్న మాధవ్ నగర్ ఆర్ఓబీ 193ను సవరించిన అదనంగా రూ.8.68 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి కోరారు. R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. తక్షణమే మంజూరు ఉత్తర్వులను జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

బోధన్ రూరల్ PS పరిధిలో గుర్తుతెలియని అడ్డా కూలీ మృతి చెందాడు. సాలంపాడ్ గ్రామానికి చెందిన వ్యక్తి నాని అనే కూలీని పనికి తీసుకెళ్లగా, పని అనంతరం అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సదరు కూలీ మరణించాడు. మృతుడు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాడని తెలుస్తోంది. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే బోధన్ రూరల్ ఎస్సై 87126 59872 నంబరుకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

ప్రజలు అందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశసేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపేందుకు అందరు సహకారం అందించాలన్నారు.

భూమిలేని నిరుపేద కూలీలకు ఏటా రూ.12,000 ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో గతేడాది ఇదే రోజు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ను ప్రారంభించింది. నిజామాబాద్ జిల్లాలో 38,787 మందిని లబ్ధిదారులుగా గుర్తించగా కేవలం 1,675 మందికే తొలి విడత సాయం అందింది. ఇంకా 37,112 మంది ఎదురుచూస్తున్నారు. ఏడాది గడిచినా నిధులు విడుదల కాకపోవడంతో అర్హులైన కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తిఅయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. వేడుకల్లో భాగంగా శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తిఅయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. వేడుకల్లో భాగంగా శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.