India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తిఅయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. వేడుకల్లో భాగంగా శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

విధి నిర్వహణలో గంజాయి ముఠా కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సౌమ్యకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆమె పేర్కొన్నారు.

జాతీయ శిక్షా రత్న అవార్డుల్లో NZB జిల్లా ఉపాధ్యాయులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 150 మంది ఎంపికవగా మన జిల్లా నుంచి డా. ఈ. పోచన్న (పెర్కిట్), పి. రాజేశ్వర్ (ముప్కాల్), పి. శ్రావణ్ కుమార్ (నవీపేట) ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. టీఎల్ఎం ద్వారా సులభంగా బోధిస్తూ విద్యావ్యవస్థలో వారు చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డులు ప్రకటించారు. ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు, అధికారులు వారికి అభినందనలు తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని టీజీఎండీసీ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మతపరమైన చిచ్చు పెట్టేవారి మాటలు నమ్మవద్దని, కేవలం అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని సూచించారు. “అబద్ధాలను ఓడిద్దాం – అభివృద్ధిని గెలిపిద్దాం” అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు.

బోధన్‌లో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. గత ప్రభుత్వ నిధులతోనే ఈ పనులు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నిధులు కేటాయించలేదని నిరసన చేపట్టారు. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు యాదవ్, మాజీ కౌన్సిలర్ గంగాధర్‌లను అరెస్ట్ చేశారు. దీంతో పట్టణంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

నిజామాబాద్ మాధవ్ నగర్‌లో స్మగ్లర్ల కారుతో ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాలు పాలైన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను హైదరాబాద్‌కు తరలించారు. సౌమ్యపై నుంచి కారు వెళ్లడంతో కడుపు భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వైద్యుల సూచనల మేరకు, మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు.

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అధికారులు వెల్లడించారు. సాలూరా 13.1°C, చిన్న మావంది 13.4, నిజామాబాద్ 14.1, గన్నారం, మంచిప్ప 14.2, జకోరా, బాల్కొండ 14.4, డిచ్‌పల్లి 14.5, వేంపల్లి, కల్దుర్కి, మెండోరా, మదన్ పల్లి 14.7, చీమన్‌పల్లి, కోరాట్ పల్లి, ఆలూర్, బెల్లాల్ 14.8°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నిజామాబాద్ శివారులోని మాధవ్ నగర్‌లో శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టిన నలుగురు స్మగ్లర్లపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. ప్రమాద ఘటనపై ఎక్సైజ్ సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారులోని నిర్మల్‌కు చెందిన సోఫియాన్, సోహెల్, రహిల్, మతిన్‌పై కేసు నమోదు చేశామన్నారు. ఇందులో ఇద్దరు పరారీలో ఉండగా, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.