Nizamabad

News January 25, 2026

NZB: మున్సిపల్ ఎన్నికల BRS ఇన్‌ఛార్జీలు వీరే..

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లాలోని కీలక ప్రాంతాలకు ఇన్‌ఛార్జీలను నియమించింది. నిజామాబాద్ కార్పొరేషన్ బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డికి అప్పగించారు. బోధన్ మున్సిపాలిటీకి దాదన్నగారి విఠల్ రావు, ఆర్మూర్‌కు చెరుమల్ల రాకేష్, బాల్కొండకు సుమనా రెడ్డిలను ఇన్‌ఛార్జీలుగా అధిష్ఠానం ఖరారు చేసింది. పార్టీ కేడర్‌ను సమన్వయం చేస్తూ గెలుపే లక్ష్యంగా వీరు పనిచేయనున్నారు.

News January 24, 2026

కమ్మర్‌పల్లి: ఫొటోగ్రఫీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగాధర్

image

కమ్మర్‌పల్లికి చెందిన లుక్క గంగాధర్ ఫొటో అండ్ వీడియోగ్రఫీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫొటోగ్రాఫర్ల సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని గంగాధర్ పేర్కొన్నారు. ఆయన నియామకంపై స్థానిక ఫొటోగ్రాఫర్లు హర్షం వ్యక్తం చేశారు.

News January 24, 2026

NZB: రేపు అండర్-16 వాలీబాల్ ఎంపికలు

image

నిజామాబాద్ నగరంలోని డీఎస్‌ఏ మైదానంలో ఆదివారం అండర్-16 జిల్లా స్థాయి వాలీబాల్ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్ గౌడ్ తెలిపారు. ఆసక్తి గల బాలబాలికలు తమ ఆధార్ కార్డు, 10వ తరగతి సర్టిఫికెట్‌తో రేపు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు.

News January 24, 2026

NZB: మున్సిపల్ ఎన్నికలు.. కలెక్టర్ కీలక ఆదేశాలు

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు పూర్తి బాధ్యతతో, సమర్థవంతంగా విధులు నిర్వహించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, కేటాయించిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అన్ని ఏర్పాట్లతో ముందస్తుగానే సిద్ధంగా ఉండాలని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించారు.

News January 24, 2026

దివ్యాంగులకు త్వరగా ‘ఆసరా’ పెన్షన్లు: కలెక్టర్

image

అర్హులైన దివ్యాంగులకు త్వరితగతిన ఆసరా పెన్షన్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హామీ ఇచ్చారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. పిల్లల తల్లిదండ్రులు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘భవిత’ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

News January 24, 2026

దివ్యాంగ పిల్లలకు పథకాలు అందేలా చూడాలి: జిల్లా జడ్జి

image

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ జిల్లా జడ్జి భరతలక్ష్మి సూచించారు. శనివారం జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ‘సదరం’ శిబిరాన్ని ఆమె కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పరిశీలించారు. న్యాయ సేవాధికార సంస్థ, డీఆర్డీఏ, విద్యాశాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరం ద్వారా అర్హులకు లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశించారు.

News January 24, 2026

NZB: ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన కలెక్టర్

image

నిజామాబాద్ శివారులో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి.సౌమ్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌమ్య కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.

News January 24, 2026

NZB: 158 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 158 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 158 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.14,50,000 జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 13 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని CP వివరించారు.

News January 24, 2026

NZB: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కమిషనర్

image

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ శనివారం పరిశీలించారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయో గమనించి సంబంధిత సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా నగరంలో 3 డివిజన్‌లకు ఒకటి చొప్పున 20 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

News January 24, 2026

NZB: ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్ విధానం అమలు

image

ఇసుక అక్రమ రవాణాకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్ విధానాన్ని అమలులోకి తెస్తోందని రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భవేశ్ మిశ్రా వెల్లడించారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మైనింగ్, హౌసింగ్ తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.