Nizamabad

News January 22, 2026

విద్యార్థినులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

కేజీబీవీ, మోడల్ స్కూళ్లు బాలికల సర్వతోముఖాభివృద్ధికి వికాస కేంద్రాలుగా నిలవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకాంక్షించారు. గురువారం నిజామాబాద్‌లో స్పెషల్ ఆఫీసర్లు, వార్డెన్లకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా, అన్ని రంగాల్లో విద్యార్థినులను ప్రతిభావంతులుగా తయారు చేయాలని, విద్యార్థినుల మానసిక స్థితిని గమనిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపాలని దిశానిర్దేశం చేశారు.

News January 22, 2026

నాలుగో మేయర్ కోసం NZB నగరం ఎదురు చూపు

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఇప్పటివరకు ముగ్గురు మేయర్లు పనిచేశారు. ప్రస్తుతం నాలుగో మేయర్ కోసం నగరం ఎదురు చూస్తోంది. మొదటి మేయర్‌గా కాంగ్రెస్ నుంచి ధర్మపురి సంజయ్, రెండో మేయర్‌గా ఆకుల సుజాత (BRS), మూడో మేయర్‌గా దండు నీతూ కిరణ్ (BRS) పని చేయగా నాలుగో మేయర్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ నాలుగో వ్యక్తి ఎవరో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

News January 22, 2026

నిజామాబాద్: ఇంటి వద్దే కేసు నమోదు.. మొదట ఇక్కడే

image

TG డీజీపీ ఆదేశాల మేరకు ఫిర్యాదు ఇంటి వద్దకు వెళ్లి పిటిషన్‌ను స్వీకరిస్తున్నామని NZB రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. తిర్మన్ పల్లికి చెందిన అశ్వినీ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. అయితే దుండగులు తాళం పగల కొట్టి 17 గ్రాముల బంగారం, 15 తులాల వెండి, రూ.17 వేలు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితురాలు సమాచారం మేరకు ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించారు. మెుదటి సారి బాధితురాలి ఇంటికెళ్లి కేసు ఫైల్ చేశారు.

News January 22, 2026

NZB: గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు

image

త్వరలో జరగబోయే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీల అధినేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా 20 డివిజన్లలో MIM ప్రాధాన్యత ఉంది. మిగిలిన 40 డివిజన్లలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేలా ప్రభావితం చేసే అభ్యర్థుల కోసం ఇరు పార్టీలు స్క్రూటినీ చేస్తున్నాయి. అలాగే పలువురితో చర్చలు జరుపుతున్నారు.

News January 21, 2026

తెలంగాణ వర్సిటీ పీఆర్ఓగా డాక్టర్ కె.వి. రమణచారి

image

TU పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (PRO)గా ఇంగ్లీష్ విభాగానికి చెందిన డాక్టర్ కె.వి. రమణచారి బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరిరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. గతంలో పలు కీలక అడ్మినిస్ట్రేటివ్ పదవులు నిర్వహించిన రమణచారి.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు వీసీకి, రిజిస్ట్రార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వర్సిటీ అధికారులు ఆయనను అభినందించారు.

News January 21, 2026

NZB: మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

image

నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఓటరు జాబితా సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News January 21, 2026

NZB: ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లను కేటాయించండి

image

మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు పార్టీ పరంగా 50 శాతం సీట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం NZB జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ కోరారు. ఈ మేరకు TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు సరిపోవన్నారు. జనరల్ స్థానాల్లో 50 శాతం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

News January 21, 2026

NZB: డే కేర్ సెంటర్‌ను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

వృద్ధులకు మానసిక ఆనందం, సామాజిక అనుబంధం పంచుతూ అవసరమైన సేవలు అందించడం కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తూ నిజామాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఒంటరితనంతో బాధపడే వృద్ధులకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వృద్ధులకు నాణ్యతతో కూడిన బలవర్ధకమైన పౌష్ఠిక ఆహారం అందించాల్సిన అవసరం ఉందని సూచించారు.

News January 21, 2026

NZB: రెడ్ క్రాస్‌లో డే కేర్ సెంటర్ ప్రారంభం

image

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సమన్వయంతో నిజామాబాద్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ భవనంలో ఏర్పాటు చేసిన ‘ప్రణాం వృద్ధుల డే కేర్ సెంటర్’ను ప్రభుత్వ సలహాదారు, బోధన్ MLA సుదర్శన్ రెడ్డి, NZB కలెక్టర్, రెడ్ క్రాస్ అధ్యక్షురాలు ఇలా త్రిపాఠితో కలిసి బుధవారం ప్రారంభించారు. వృద్ధుల జీవన విధానం కల్పించడమే ఈ ప్రణాం డే కేర్ సెంటర్ ప్రధాన లక్ష్యమని సుదర్శన్ రెడ్డి అన్నారు.

News January 21, 2026

NZB: 1931లో మున్సిపాలిటీ.. 2005లో కార్పొరేషన్

image

NZB మున్సిపాలిటీ 1931 సంవత్సరంలో ఏర్పడింది. 1987లో దీన్ని ‘స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ’గా అప్‌గ్రేడ్ చేశారు. 2005 మార్చి 5న ప్రభుత్వం జారీ చేసిన GO No.109 ప్రకారం నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్‌గా మారింది. ప్రస్తుతం ఇది నిజామాబాద్ నగరపాలక సంస్థ పేరుతో 60 వార్డులతో పరిపాలన కొనసాగిస్తోంది.