Nizamabad

News January 27, 2026

నిజామాబాద్ జిల్లాలో 8 భారీ, మధ్య తరహా పరిశ్రమలు

image

నిజామాబాద్ జిల్లాలో 8 భారీ, మధ్య తరహా పరిశ్రమలు రూ.368.45 కోట్ల పెట్టుబడితో స్థాపించబడ్డాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. వీటి ద్వారా 7,324 మందికి ఉపాధి కల్పించబడిందన్నారు. అలాగే జిల్లాలో 900 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను రూ.516.60 కోట్ల పెట్టుబడితో స్థాపించి 6,983 మందికి ఉపాధి కల్పిస్తున్నారని వివరించారు.

News January 27, 2026

NZB: రూ.782.31 కోట్ల రుణ మాఫీ: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం పంట రుణ మాఫీ పథకం ద్వారా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.782.31 కోట్లు రుణ మాఫీ చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నాలుగు విడతల్లో మొత్తం 1,00,612 మంది రైతుల పంట రుణాలు మాఫీ చేశారన్నారు. అలాగే రైతు భీమాకు అర్హత కలిగి వివిధ కారణాలతో చనిపోయిన 308 రైతులకు సంబంధించిన వారి నామిని బ్యాంకు ఖాతాలలో రూ.15.40 కోట్ల నేరుగా జమ చేసినట్లు వివరించారు.

News January 27, 2026

NZB: 93 మంది పోలీసులకు ప్రశంసా పత్రాలు

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 93 మందికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంసా పత్రాలను అందజేశారు. ట్రాఫిక్ ACP మస్తాన్ అలీ, CI శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ, భిక్షపతి తదితరులతో పాటు వివిధ డివిజన్లకు చెందిన SIలు, HCలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, సిబ్బంది అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు.

News January 27, 2026

NZB: యాసంగిలో 5.33 లక్షల ఎకరాల సాగు అంచనా: కలెక్టర్

image

2025-26 యాసంగి సీజనులో 5.33 లక్షల ఎకరాల సాగు అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఇప్పటి వరకు వరి 3.36 లక్షల ఎకరాలు, శనగ 14 వేల ఎకరాలు, మొక్క జొన్న 32 వేల ఎకరాలు, ఎర్ర జొన్న 21 వేల ఎకరాల్లో మొత్తం 4.10 లక్షల ఎకరాలలో వివిధ పంటలు రైతులు సాగు చేసినట్లు చెప్పారు. వీటి కోసం 1,03,650 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయడం జరిగిందని ఆమె వివరించారు.

News January 27, 2026

NZB: 115 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ అవార్డులు

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 115 మందికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా అధికారులు సాయ గౌడ్(DRDA), శ్రీనివాసరావు(DPO), అరవింద్ రెడ్డి (డిస్ట్రిక్ట్ సివిల్ సప్లయ్ అధికారి) అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

News January 26, 2026

NZB: శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతర కృషి: కలెక్టర్

image

శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంసించారు. అలాగే పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు పరుస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లడానికి కృషి చేస్తోందన్నారు. జిల్లాలో మహిళల రక్షణకు షీ టీం సమర్థవంతంగా పని చేస్తున్నాయని కొనియాడారు.

News January 26, 2026

NZB: 8,912 అభివృద్ధి పనులకు రూ.560.88 కోట్లు

image

జిల్లా పంచాయితీరాజ్ ఇంజినీరింగ్ శాఖ పరిధిలో నిజామాబాద్ జిల్లాలో వివిధ రకాల పథకాల కింద 8,912 అభివృద్ధి పనులకు రూ.560.88 కోట్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. ఇందులో 6,097 పనులకు రూ.453.97 కోట్లు వెచ్చించి పనులు పూర్తి చేశారన్నారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు.

News January 26, 2026

NZB: కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద ఎంత ఇచ్చారంటే

image

నిజామాబాద్ జిల్లాలో కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3,529 మంది లబ్ధిదారులకు రూ.35.33 కోట్లు పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అలాగే షాదీ ముబారక్ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 2,223 మంది లబ్ధిదారులకు సుమారు రూ.22.25 కోట్లు ఇచ్చామన్నారు.

News January 26, 2026

NZB: 5,678 సంఘాలకు రూ.182 కోట్లు స్త్రీ నిధి రుణాలు

image

2025-26 సంవత్సరంలో 5,678 సంఘాలకు రూ.182 కోట్లు స్త్రీ నిధి, బ్యాంకు ద్వారా ఋణాలు మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. అలాగే 19,969 సంఘాలకు రూ.1,228 కోట్లు లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 12,700 సంఘాలకు రూ.1,109 కోట్లు ఋణాలు బ్యాంక్ లింకేజ్ ద్వారా అందించారన్నారు. వడ్డీ రాయితీ కింద 2024-25లో ఏప్రిల్-24 నుంచి జనవరి 25 వరకు 40,199 సంఘాలకు రూ.44.95 కోట్లు విడుదల చేశారన్నారు.

News January 26, 2026

NZB: ఉపాధి హామీ పథకం కింద 16.08 లక్షల పని దినాలు

image

2025-26వ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 85,034 కుటుంబాల్లోని 1,17,886 కూలీలకు 16.08 లక్షల పని దినాలు కల్పించి రూ.40.52 కోట్లు కూలీల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. సరాసరి వేతనం రోజుకు రూ.251.93 చెల్లించి ప్రతి కుటుంబానికి 22 రోజుల పని కల్పించారన్నారు. కూలీలకు రూ.40.52 కోట్లు, మెటీరీయల్ కాంపొనెంట్ కింద రూ.21.13 కోట్లు మొత్తం రూ.61.65 కోట్లు జమ చేశారన్నారు.