India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రైవేటు, కార్పొరేటు హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేయాలని NZB జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం నిర్వహించిన వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీక్షలో ఆమె మాట్లాడారు. నిరుపేదలకు సేవలందించే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. DMHO రాజశ్రీ పాల్గొన్నారు.

ప్రైవేటు, కార్పొరేటు హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేయాలని NZB జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం నిర్వహించిన వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీక్షలో ఆమె మాట్లాడారు. నిరుపేదలకు సేవలందించే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. DMHO రాజశ్రీ పాల్గొన్నారు.

పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్న వారు నిర్ణీత గడువు లోపు బీ-ఫారం సమర్పించాలని, లేకుంటే వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తామని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. అభ్యర్థులు, అన్ని పార్టీల వారు ఎన్నికల నియమావళిని తు.చా తప్పకుండా పాటించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అభ్యర్థులు లేదా ఓటర్లు తమ సమస్యలపై 08462-220183 నంబర్‌కు కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలన్నారు. వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు జరిగితే ఈ నంబర్‌కు తెలపాలన్నారు.

తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. రెండు రోజులుగా మేడారం జాతరలో నిజమాబాద్ సీపీ సాయి చైతన్య పోలీసు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఆయన వెంట పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్ మునిసిపాలిటీలలో ప్రధాన పార్టీల మధ్యే పోటీ ఉండే అవకాశాలు ఉండగా అన్ని పార్టీల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం నేతలకు సవాలుగా మారింది. ఇప్పటికి ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. అన్ని పార్టీల్లోనూ అభ్యర్థుల ఖరారు విషయంలో అనిశ్చితి నెలకొంది. ఆశావహులు మాత్రం తమకే పార్టీ టిక్కెట్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్‌లో ఎక్కువ కార్పొరేటర్లను గెలిపించుకునేందుకు AIMIM ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 16 స్థానాలు సాధించిన MIM.. 28 స్థానాలు సాధించిన BJPకి చెక్ పెడుతూ 13 స్థానాలు సాధించిన BRSతో పొత్తు పెట్టుకుంది. దీంతో మొహమ్మద్ ఇద్రీస్ ఖాన్ (AIMIM) డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవగా ఈ సారి కూడా తమ సత్తా చాటాలని క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ (B.Ed) మూడవ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రీ పోన్ చేసినట్లు సీఓఈ (COE) ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. మొదటి ఫేజ్ పరీక్షలు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 4 వరకు, రెండో ఫేజ్ ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరగనున్నాయి. కళాశాలల ప్రిన్సిపాల్స్ సంబంధిత ప్రతులను ఈనెల 29లోగా సమర్పించాలని ఆయన ఆదేశించారు.

కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి తొలిరోజైన బుధవారం జిల్లాలో 21 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. NZB కార్పొరేషన్‌లో 12, ARMR మున్సిపాలిటీలో 5, భీంగల్‌లో 4 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. ఇందులో BJP తరఫున 6, కాంగ్రెస్ నుంచి 9, BRS తరఫున 4, BSP, స్వతంత్ర అభ్యర్థిగా ఒక్కో నామినేషన్లు వేసినట్లు వివరించారు.

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు నియమితులైన జనరల్ అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి కీలక సూచన చేశారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు లేదా సూచనలు ఉన్నవారు 95533 95000 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. అలాగే mngdirector-tgts@telangana.gov.in మెయిల్ ఐడీ ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. పారదర్శక ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.