India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు నిషేధం అన్నారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేల వాడకం పూర్తిగా నిషేధమని చెప్పారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.

ఇసుక అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా ప్రవేశపెట్టిన మన ఇసుక వాహనం ఆన్‌లైన్ బుకింగ్ యాప్ విధానాన్ని NZB జిల్లాలో అందుబాటులోకి తెచ్చామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మ్యానువల్ విధానానికి స్వస్తి పలుకుతూ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఇసుక బుకింగ్ చేసుకునేలా ప్రయోగత్మకంగా జిల్లాలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ఆన్‌లైన్‌లోనే UPI పేమెంట్ చేయాలని సూచించారు.

తెలంగాణ విశ్వ విద్యాలయ పరిధిలో B.Ed, B.Ped (1వ, 3వ సెమిస్టర్) పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంట చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన బీఎడ్, బీపీఎడ్ పరీక్షలకు 1,339 మంది విద్యార్థులకు 1,302 మంది హాజరయ్యారన్నారు. 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

నిజమాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 84 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో చేపట్టిన వాహన తనిఖీల్లో 84 కేసులు నమోదు కాగా వారిని సంబంధిత కోర్టుల్లో హాజరుపరిచారు.ఇందులో మొత్తం రూ. 7,90,000 జరిమానా విధించగా ఐదుగురికి వారం రోజుల జైలు శిక్షను కోర్టు విధించినట్లు వివరించారు.

జిల్లాలోని NZB కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పర్వం ముగియడంతో 146 వార్డులకు సంబంధించి 1,242 మంది బరిలో ఉన్నారు. ఇందులో BJP నుంచి 149, కాంగ్రెస్ నుంచి 584, BRS 302, MIM 148, BSP 267, AAP 9, CPM 8, TDP 2, ఇతర రిజిస్టర్డ్ పార్టీలు 88, స్వతంత్ర అభ్యర్ధుల నుంచి172 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. మూడు రోజుల్లో 1729 నామినేషన్లు వచ్చాయని అధికారులు నివేదిక రూపొందించారు.

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఆఖరి ఘట్టమైన వనప్రవేశం నేడు జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య బృందం గద్దెల వద్ద రహస్య పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో భక్తుల దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తంతు ముగించి, తల్లి రూపమైన కుంకుమ భరిణెను తీసుకుని పూజారులు చిలుకలగుట్టకు బయలుదేరుతారు. దీంతో నాలుగు రోజుల పాటు వైభవంగా సాగిన గిరిజన కుంభమేళాకు తెరపడనుంది.

నిజామాబాద్ నగరపాలక సంస్థకు కాసుల వర్షం కురిసింది. ఎన్నికల నేపథ్యంలో పాత బకాయిలన్నీ వసూలవుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నో డ్యూ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో పోటీ చేసే అభ్యర్థులు పాత బకాయిలు కడుతున్నారు. ఇందులో భాగంగా నిన్న 19వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శమంత నరేందర్ తమ వంశీ హోటల్‌కు సంబంధించి ఆస్తి పన్ను రూ. 7.50 కోట్లు చెల్లించారు.

నగర పాలక సంస్థ, మున్సిపాలిటీ ఎన్నికల సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) కార్యక్రమం శనివారం నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి 60 వార్డులకు 3 రోజుల్లో 1,231 నామినేషన్లు రాగ భీంగల్ 12 వార్డుల్లో 113, బోధన్ 38 వార్డుల్లో 342, ఆర్మూర్ 36 వార్డుల్లో 298 నామినేషన్లు వచ్చాయి.

జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో నిజామాబాద్ జిల్లా అథ్లెట్లు మెడల్స్ సాధించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరుగుతున్న 7వ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా పురుషుల విభాగంలో దినేష్ 40 ఏళ్ల కేటగిరిలో లాంగ్ జంప్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. 45 ఏళ్ల కేటగిరిలో రఘువీర్ షాట్ పుట్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు.

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ శుక్రవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 14 మందికి రూ.1.40 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.