India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వారికి PSO శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్‌లో సీపీ సాయి చైతన్య శుక్రవారం ప్రారంభించారు. సీపీ మాట్లాడుతూ.. VIPల భద్రతలో సేవలు అందించే PSOల పాత్ర అత్యంత ముఖ్యమైందన్నారు. నైపుణ్యాలను మెరుగుపరచడానికి, అత్యాధునిక విధానాలపై అవగాహన కల్పించడానికి, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చామన్నారు.
గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి వెల్లడించారు. శుక్రవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పాల్ద గ్రామంలో పనుల జాతరలో రూ.12 లక్షల వ్యయంతో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు జారీ చేసే ట్రాన్స్‌ఫార్మర్ సర్టిఫికెట్‌కి డబ్బులు వసూలు చేసినట్టు వచ్చిన సమాచారం మేరకు ఆ పాఠశాలకు నోటీసులు జారీ చేశామని మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారం ఈరోజు తెలిపారు. ఫీజుల పెండింగ్, టీసీ విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఆర్మూర్ పట్టణానికి చెందిన పోల్కం వేణును భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పార్టీ అధిష్ఠానం నియమించింది. పోల్కం వేణు మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని, రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డ్ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు నిజామాబాద్ జిల్లా సీనియర్ మహిళా, పురుషుల జట్లు ఖరారయ్యాయి. ఇటీవల మహిళా, పురుషుల ప్రాబబుల్స్ జట్లకు సన్నద్ధ శిబిరం నిర్వహించారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన జిల్లా జట్లు నేటి నుంచి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటిలో జరిగే 71వ రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో ప్రాతినిధ్యం వహించనున్నారు.
నిజామాబాద్ చంద్ర శేఖర్ కాలనీలో ఈనెల 18న అర్ధరాత్రి ఏటీఎంలో చోరీకి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అయితే గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేయగా అందులో ఉన్న నగదు కాలిపోయింది. దుండగులు ఏటీఎంలోని సీసీ కెమెరాలపై స్ప్రే చేసి ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బీజేపీ జిల్లా నూతన కమిటీని గురువారం జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ప్రకటించారు. ఈ మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పోతన్ కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా రాజేశ్వర్, బంటు రాము, రాంచందర్, సురేందర్, ప్రమోద్, పాలేపు రాజు, జిల్లా కార్యదర్శులుగా అనిల్, నర్సారెడ్డి, వేణు, జ్యోతి, రాధ, సవితను నియమించారు.
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరుగుతున్న పీజీ పరీక్షలను TU రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం 5వ రోజు పరీక్షల్లో భాగంగా ఉదయం పరీక్షకు 80 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 32 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు.
జిల్లాలో ఇప్పటి వరకు 4,348 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు రూ.50.95 కోట్ల రుణాలు మంజూరు చేశామని NZB కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 3,916 మంది లబ్ధిదారులకు రూ.46.59 కోట్లు, మెప్మా ద్వారా 432 మందికి రూ.4.36 కోట్లు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం మంజూరు చేశామన్నారు. లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణ పనులను చేపట్టాలని కలెక్టర్ కోరారు.
జిల్లాలోని అన్ని శాఖలను సమన్వయం చేయడం కోసం సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. గురువారం కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో సీపీ మాట్లాడారు. ఈ కౌన్సిల్ భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలపై తక్షణ పర్యవేక్షణ చేసి వాటి నివారణ కోసం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.