India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ సమీపంలో తాళ్లతండాలో కరెంట్ షాక్‌తో బాలుడు మృతి చెందాడు. తండాలోని వినాయక మండపం వద్ద సంజీవ్(16) మైక్ సరిచేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన బాలుడిని కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
ఎడపల్లి మండలంలోని అలీ సాగర్ ప్రాజెక్టు వరద గేట్లను ఏ క్షణమైన ఎత్తే అవకాశాలు ఉన్నాయని ఇరిగేషన్ ఏఈ రాజ్యలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు ఎగువ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు ఉన్నందున ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నారు. దిగువ ప్రాంత ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఈ విషయమై గ్రామాల్లో దండోరా వేయించాలని ఏఈ రాజ్యలక్ష్మి తెలిపారు.
మద్యం మత్తులో బురద నీటిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ నగర శివారులోని గుండారం కమాన్ వద్ద జరిగింది. నాందేవ్ వాడకు చెందిన సంతలే జ్యోతిరాం(54) మద్యం మత్తులో గుండారం కమాన్ వద్ద పేరుకుపోయిన బురద నీటిలో పడి మృతి చెందాడు. ఆదివారం స్థానికులు గమనించి రూరల్ పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై ఆరిఫ్ తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టు నిండటంతో శనివారం రాత్రి 9 గేట్లను ఓపెన్ చేశారు. 52,013 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకి ఇన్ ఫ్లోగా అంతే మొత్తంలో క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగుల (80.5TMC)కు గాను, తాజాగా 1,088.9 అడుగుల (80.053TMC) నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శ్రీ రామ మందిరంలో వినాయక చవితి సందర్భంగా తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాల్ రాజ్ విగ్నేశ్వరుడికి శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరి విజ్ఞాలు తొలగి వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రెడ్డి, ప్రదీప్, రమాకాంత్ పాల్గొన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన నీటిని వదిలారు. ప్రకృతి అందాలను వీక్షించేందుకు సందర్శకులు ఇక్కడికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సెల్ఫీ, ఫోటోలు తీసుకునే క్రమంలో ప్రమాదాన్ని గ్రహించడం లేదు. ఏదైనా నష్టం జరిగితే ఊహించని నష్టం వాటిల్లుతుంది. ఎలాంటి ప్రమాదం జరగక ముందే పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆయా విభాగాలకు అసోసియేట్, సహాయ ఆచార్యుల ఖాళీల భర్తీకి ప్రిన్సిపల్ శివకుమార్ తెలిపారు. అనాటమీ అసోసియేట్ 1, అసిస్టెంట్ 1, ఫిజియోలాజీ అసిస్టెంట్ 1, బయో కెమిస్ట్రీ అసోసియేట్ 1, జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ 1, సైక్రియాట్రి అసోసియేట్ 1, జనరల్ సోషల్ సర్జరీ 1, తదితర పోస్టులకు ఈ నెల 12న వైద్య కళాశాలలో మౌఖిక పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అమెరికా దేశ పర్యటనలో భాగంగా శనివారం అమెరికాలోని డల్లాస్ ఎయిర్ పోర్టులో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్, ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు.
బిక్కనూర్లో వదినను మరిది <<14035950>>హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. భగీరథిపల్లికి చెందిన పోచయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు రాములు, రెండో భార్యకు మల్లేశం, సురేశ్ ముగ్గురు కుమారులు ఉన్నారు. భూమి విషయంలో సురేశ్‌కు రాములు భార్య లావణ్యతో తరచూ గొడవ జరుగుతుండేది. ఈక్రమంలో శుక్రవారం మళ్లీ గొడవ జరగడంతో సురేశ్ ఆమెను కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు SI సాయికుమార్ వెల్లడించారు.
వినాయక చవితి నేపథ్యంలో ఉమ్మజి నిజామాబాద్ యువత నైట్ అవుట్ చేసింది. అర్ధరాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు ఏ వీధిలో చూసినా యువకులు మండపాలు వేయడం, డెకరేషన్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇక విగ్రహాల కొనుగోలు చేసేందుకు కామారెడ్డి, నిజామాబాద్‌కు పోటెత్తారు. మరోవైపు పలు చోట్ల పండుగ సామగ్రి విక్రయ షాపులు అర్ధరాత్రి వరకు తెరిచే ఉండటంతో సందడి నెలకొంది. వినాయక చవితి తమకు స్పెషల్ ఫెస్టివల్ అని యువకులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.