Nizamabad

News September 6, 2024

నిజామాబాద్: ఈరోజు ముఖ్యమైన వార్తలు

image

KMR:భిక్నూర్ లో మహిళా దారుణ హత్య* బాన్సువాడ పాముతో సెల్ఫీ దిగుతుండగా పాము కాటు వేయడంతో మృతి చెందిన యువకుడు* NZB, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి* వర్నిలో చిరుత దాడి లేగా దూడ మృతి* కామారెడ్డి సిసి కెమెరా కమాండ్ రూమ్ ను ప్రారంభించిన ఎస్పీ* బోధన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జేలు * నిజాంసాగర్ ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత*

News September 6, 2024

నిజామాబాద్: 100కు డయల్.. వ్యక్తికి జైలు

image

డయల్ 100కు తరచూ ఫోన్ చేస్తూ న్యూసెన్స్ చేసిన ఓ వ్యక్తికి మెజిస్ట్రేట్ 3 రోజుల జైలుశిక్ష విధించారు. నగరంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చెందిన మహమ్మద్ అప్రోజ్ అనే వ్యక్తి మద్యం సేవిస్తూ తరచూ డయల్ 100కు ఫోన్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్నారు. దీంతో ఎస్ఐ శ్రీకాంత్ అప్రోజ్‌ను అదుపులోకి తీసుకొని, ఈరోజు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా మూడురోజుల జైలు శిక్ష విధించినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

News September 6, 2024

బిక్కనూర్‌లో మహిళ దారుణ హత్య

image

మహిళ దారుణ హత్యకు గురైన ఘటన బిక్కనూర్‌లో చోటుచేసుకుంది. భగీరథపల్లికి చెందిన యేసుమణిని ఆమె మరిది సురేశ్ కత్తులతో పొడిచి దారుణంగా హత్యచేసినట్లు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా ఈ హత్య జరిగినట్లు విచారణలో తెలిసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

News September 6, 2024

ఎల్లారెడ్డి హాస్టల్‌లో రాళ్లతో దాడి చేసుకున్న విద్యార్థులు

image

ఎల్లారెడ్డి గురుకుల హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొంతకాలంగా విద్యార్థుల మధ్య జరుగుతున్న గొడవ గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 6, 2024

బిచ్కుంద: డెంగ్యూతో 9వ తరగతి విద్యార్థిని మృతి

image

డెంగ్యూతో 9వ తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన బిచ్కుందలో చోటుచేసుకుంది. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సిద్దేశ్వరి ఐదు రోజుల క్రితం డెంగ్యూ జ్వరం వచ్చింది. దీంతో ఆమెను కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్పించారు. జ్వర తీవ్రత పెరగడంతో సిద్దేశ్వరి గురువారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. 

News September 6, 2024

9 నెలలుగా తెలంగాణలో స్వాతంత్రం లేదు: జీవన్ రెడ్డి

image

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్ట్‌ను నిజామాబాద్ BRS జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్ర‌జా పాల‌న అంటే ప్ర‌శ్నించే వాళ్ల గొంతు నొక్క‌డ‌మేనా..? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఆయన సూటిగా ప్ర‌శ్నించారు. 9 నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదన్నారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న దిలీప్‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

News September 5, 2024

దోమకొండ: కారు ఢీకొని పాదచారుడు మృతి

image

కారు ఢీకొని పాదచారుడు మృతి చెందాడు. ఈఘటన దోమకొండ మండలంలో గురువారం జరిగింది. SI ఆంజనేయులు వివరాలిలా.. దోమకొండ వాసి గజం సత్యం (55) కూలీ పని నిమిత్తం అంచనూరు గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదే సమయంలో వేగంగా వెళ్తున్న కారు అతనిని ఢీ కొట్టింది. తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ..మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.

News September 5, 2024

NZB: మీ ఫేవరెట్ టీచర్ ఎవరు..? కామెంట్ చేయండి!

image

విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతూ, వారు ఉన్నత స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేసే వారే గురువులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకు పాఠాలు బోధిస్తూ సందడి చేస్తున్నారు. మరి.. మీ ఫేవరేట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి. SHARE IT

News September 5, 2024

పోచారం ప్రాజెక్టును సందర్శించిన జిల్లా అడిషనల్ కలెక్టర్

image

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టును బుధవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున దిగువ ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు వద్దకు పర్యాటకులను అనుమతించొద్దని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ప్రభాకర్ చారి, ఇరిగేషన్ ఏఈ ఉన్నారు.

News September 4, 2024

నిజామాబాద్: షబ్బీర్ అలీకి తప్పిన ప్రమాదం

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ప్రమాదం తప్పింది. బుధవారం ఆయన నిజామబాద్ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. నగరంలోని ఆనంద్ నగర్‌లో ఇటీవల డ్రైనేజీలో పడి మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా అటవీ శాఖ రేంజ్ ఆఫీస్ ముందు కాన్వాయ్‌లోని 3 కార్లు ఢీకొన్నాయి. దీంతో కార్లు స్వలంగా దెబ్బతిన్నాయి. కాగా ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 

error: Content is protected !!