India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాన్సువాడ మైనార్టీ గురుకుల పాఠశాలలో టీజీటీ తెలుగు పోస్టు ఖాళీగా ఉందని హెచ్ఎం ధనలక్ష్మి తెలిపారు. ఈ నెల 6లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బాల్కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 5 లోపు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 304 ఇళ్లు కూలిపోయాయి. 45 విద్యుత్ స్తంభాలు ధ్వంసం కాగా 3 నియంత్రికలు దెబ్బతిన్నాయి. కాగా జిల్లాలో ఏర్పాటు చేసిన 11 పునరావాస కేంద్రాలకు ఇప్పటి వరకు 188 మంది బాధితులను తరలించారు. మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు పూర్తి నివేదిక అందిన వెంటనే నష్టం విలువ అంచనా వేస్తామన్నారు.
ఈ నెల 7న వినాయక చవితి పురస్కరించుకొని అన్ని గణేష్ మండపాలకు భద్రత ఇవ్వడానికి పాయింట్ బుక్ ఏర్పాటు కోసం సమాచారం ఇవ్వాలని నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ పేర్కొన్నారు. నిజామాబాద్,ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునే వారు https://policeportal.tspolice.gov.in లింక్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సహకరించాలని కోరారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బొందెం చెరువు ఆక్రమణల కేసులో 10వ డివిజన్ కార్పొరేటర్ కోమలి భర్త నరేశ్‌తో పాటు కోటగల్లి జావిద్, మహిళా లీడర్ కమలమ్మ, BRS నాయకుడి ప్రధాన అనుచరుడైన మక్కల గోపాల్, మస్తాన్ ను మంగళవారం 5వ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బీఆర్ఎస్ నాయకులు, దళారులు, నకిలీ పట్టాలు తయారు చేసేవారు కుమ్మక్కై తమకు చెరువు శిఖం భూమిలో ప్లాట్లు విక్రయించారని బాధితులు ఆరోపించారు.
ఇంతటి విపత్తులోనూ KCR ఎక్కడా కనిపించడం లేదని MLC, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. BRS బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఇది అని, KCR ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చిన్న వర్షం పడినా గందరగోళ పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలా ఏం లేదని చెప్పారు. వర్షాలపై CM రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆరా తీస్తున్నారన్నారు. KCRకు అధికారముంటేనే తెలంగాణ కనిపిస్తుందా అని ప్రశ్నించారు.
నిజామాబాద్ నగరంలోని ఐదో పోలీస్ స్టేషన్ పరిధిలో గల బ్యాంక్ కాలనీలో భారీ చోరీ జరిగింది. కాలనీకి చెందిన శ్రీనివాస్ కుటుంబంతో హైదరాబాద్ వెళ్లాడు. సోమవారం రాత్రి దొంగలు వారి ఇంట్లో చోరీకి పాల్పడి పది తులాల బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లినట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఘటన స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.
ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని నవీపేటలో సోమవారం వెలుగుచూసింది. బాలిక(6)పై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆదివారం అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ మీటర్లు లేని BPL కుటుంబాలకు NPDCL రూ.825కే విద్యుత్ కనెక్షన్ ఇవ్వనుంది. ఈ నెల 15 వరకు నేరుగా విద్యుత్ అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 500 వాట్ల విద్యుత్ వాడే వారు విద్యుత్ కార్యాలయాలు, ఉపకేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు. దరఖాస్తు ఫీజు – రూ.25, డెవలప్‌మెంట్ ఛార్జీ – రూ.600, సెక్యూరిటీ డిపాజిట్ – రూ.200 కలిపి మొత్తంగా రూ.825వసూలు చేయనున్నారు.
కామారెడ్డి జిల్లాలో అధిక వర్షప్రభావం కొనసాగుతున్నందున విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు. ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలు అన్ని ఈ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
*ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులకు భారీగా పొట్టేతిన వరద* ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలో కూలిన ఇండ్లు, నీట మునిగిన పంట పొలాలు* శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 40 గేట్లు ఎత్తివేత* పోచారం ప్రాజెక్ట్ వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ* ఉమ్మడి జిల్లాలో ఘనంగా ఏడ్ల పోలాల అమావాస్య* కామారెడ్డి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు*
Sorry, no posts matched your criteria.