Nizamabad

News March 18, 2024

నస్రుల్లాబాద్: ఒకవైపు తండ్రి చావు.. మరోవైపు పరీక్షలు

image

తండ్రి మరణించిన బాధను దిగమింగుకొని ఓ విద్యార్థిని పరీక్షలకు హాజరైన ఘటన నస్రుల్లాబాద్‌లో జరిగింది. మండలానికి చెందిన దండు శ్రీను పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసేవాడు. ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. పదో తరగతి చదువుతున్న అతని కుమార్తె స్రవంతి సోమవారం గుండె నిండా దుఖంతో పరీక్షలకు హాజరైంది.

News March 18, 2024

బోధన్ మాజీ ఎమ్మెల్యేకి షాక్

image

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో మరో షాక్ తగిలింది. జూబ్లీహిల్స్‌లో హిట్ అండ్ రన్ కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు. 2022 మార్చి 17న జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 45లో యాక్సిడెంట్ జరగ్గా.. ఆ ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

News March 18, 2024

సోదరుడు అర్వింద్‌ను ఆశీర్వదించాలి: ప్రధాని మోదీ

image

నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి, సోదరుడు ధర్మపురి అర్వింద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జగిత్యాల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ మెుదలైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని అన్నారు. 400 సీట్లు దాటాలని తమకు ఓటేయాలని ఆయన కోరారు.

News March 18, 2024

మోదీతోనే భారత్ సురక్షితం: అర్వింద్

image

ప్రధాని నరేంద్ర మోదీతోనే భారత్ సురక్షితంగా ఉంటుందని, నరేంద్ర మోదీని మూడవసారి ప్రధానిగా గెలిపించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాలలో సోమవారం విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. సైనికుడు అభినందన్ ను పాకిస్థాన్ చెర నుండి విడిపించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ దన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

News March 18, 2024

జగిత్యాలలో తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టిన మోదీ

image

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత తెలంగాణలో తొలిసారి నిర్వహిస్తున్న జగిత్యాల సభ ద్వారా కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించారు. ‘నా తెలంగాణ కుటుంబసభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలిక్టాప్టర్​లో జగిత్యాల చేరుకున్న మోదీకి పార్టీనాయకుల నుంచి ఘనస్వాగతం లభించింది.

News March 18, 2024

కామారెడ్డి: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మహిళ మృతి

image

మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట గ్రామానికి చెందిన మరాఠీ లక్ష్మి (42) పని నిమిత్తం మాచారెడ్డికి వచ్చినట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో మాచారెడ్డి ఊర చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News March 18, 2024

నిజామాబాద్: కన్నతల్లి పై కొడుకు కర్కశత్వం

image

నిజామాబాద్‌లోని గౌతమ్ నగర్‌లో గొల్ల గంగామణి నివాసం ఉంటుంది. గంగామణి కి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని నెలల క్రితం పెద్ద కుమారుడు మరణించాడు. చిన్న కుమారుడు గొల్ల పవన్ కుమార్ మేస్త్రీ పని చేస్తూ దుబ్బ ప్రాంతంలో నివాసం ఉంటాడు. గంగామణి వద్దకు పవన్ కుమార్ వచ్చి కన్నతల్లి పై దుర్భాషలాడుతూ కాలితో తన్నుతూ విచక్షణ రహితంగా ముఖంపై పిడి గుద్దులు కురిపిస్తూ దాడి చేశాడు.

News March 18, 2024

NZB: జంట హత్యలు.. నిందితుడు సూసైడ్

image

ఆర్మూర్‌లోని విద్యానగర్ కాలనీలో చేపూర్ గ్రామానికి చెందిన బండి నడిపి గంగాధర్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గతంలో నగల కోసం ఇద్దరూ అక్కాచెల్లెళ్లను హతమార్చిన ఘటనలో నిందితుడు కావడం విశేషం. మృతుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అప్పటినుంచి మతిస్థిమితం లేదని మృతుడి బంధువులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

News March 17, 2024

బాన్సువాడ: పాఠశాల భవనం పైనుంచి దూకిన విద్యార్థిని

image

మండలంలోని బోర్లం క్యాంప్ గురుకుల పాఠశాలలో పదో తరగతికి చెందిన ఓ విద్యార్థిని పరీక్షల భయంతో ఆదివారం పాఠశాల భవనం పైనుంచి దూకింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆమె కుటుంబీకులు NZB జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 17, 2024

కామారెడ్డి జిల్లాలో 20,071 ఎకరాల్లో పంట నష్టం

image

గత రాత్రి కురిసిన వడగళ్ల వాన వల్ల కామారెడ్డి జిల్లాలో 20,071 ఎకరాల పంట నష్టం జరిగిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. 15 మండలాల్లోని 130 గ్రామాల్లో 14,553 రైతులకు చెందిన 20,071 ఎకరాల పంట నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు కొంతమేర గోధుమ, ఉల్లి, బొప్పాయి, మామిడి, కూరగాయ పంటలు దెబ్బతిన్నట్లు వెల్లడించారు.