India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇద్దరు వ్యక్తులు కలిసి మద్యం మత్తులో ఒకరిపై దాడి చేసిన ఘటన నస్రుల్లాబాద్, వర్ని మండల సరిహద్దులో గురువారం రాత్రి జరిగింది. బాన్సువాడ మండలం కొల్గూరుకు చెందిన ఆంజనేయులును ప్రవీణ్ పని నిమిత్తం వర్నికి తీసుకెళ్లారు. దారిలో ప్రవీణ్, ఆంజనేయులు, వర్నికి చెందిన మరో వ్యక్తి కలిసి మద్యం తాగారు. అనంతరం వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆంజనేయులుపై కర్ర, బ్లేడ్‌తో ప్రవీణ్ మరో వ్యక్తి కలిసి దాడి చేశారు.
రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తోందని జుక్కల్ MLA తోట లక్ష్మి కాంత్ రావు కితాబు ఇచ్చారు. ఆయన గురువారం ఓ మీడియా ఛానల్‌తో డిబేట్ పాల్గొన్నారు. ‘గత పదేళ్లుగా లంచాలు తీసుకొని BRS నేతలు అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహించారని అన్నారు. పదేళ్లలో చెరువులను పరిరక్షించే పనులు BRS ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆక్రమణలు చేసిన నేతలు ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ వారిని వదిలి పెట్టదని ఆయన స్పష్టం చేశారు.
భారత ప్రభుత్వం ఆధీనంలోని దీనదయాళ్ వికలాంగ పునరావాస పథకం, సమీకృత వృద్ధుల సంక్షేమ పథకం నుంచి జిల్లాలోని ఎన్జీవోలకు సహాయం మంజూరి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహిళాలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ కామారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. అర్హులైన వారు సెప్టెంబర్ 16లోగా తమ దరఖాస్తులు కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా సంక్షేమ శాఖ రూం నెంబర్ 31లో సమర్పించాలని కోరారు.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట తహశీల్దార్ లక్ష్మణ్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ 15 రోజులుగా రైతులు MRO ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందిస్తూ ఎల్లారెడ్డి RDO మన్నే ప్రభాకర్ విచారణ జరిపారు. అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో లక్ష్మణ్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని RDO తెలిపారు.
పెళ్లిలో మటన్ కోసం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తరఫు బంధువులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన నవీపేట్‌లో చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు తరఫు వారికి మటన్ తక్కువగా వేశారని గొడవ పడ్డారు. దీంతో కర్రలు, రాళ్లతో దాడి చేసుకొన్నారు. కాగా ఈ ఘటనలో 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
NZBలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. రూరల్ CI నరేశ్ వివరాల ప్రకారం.. కుమార్ గల్లీకి చెందిన రాజేశ్(19), మాక్లూర్‌కు చెందిన వంశీ(18), దుబ్బకు చెందిన ఆకాశ్(19) మంగళవారం ఓ కారు అద్దెకు తీసుకొని నగరానికి వెళ్లారు. బుధవారం వంశీని దించేందుకు మక్లూర్ వెళ్తుండగా కొండూరు సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. రాజేశ్, వంశీ అక్కడికక్కడే మృతిచెందగా, ఆకాశ్ తీవ్రంగా గాయపడ్డాడు.
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ సింధూశర్మ తదితరులు పాల్గొన్నారు.
*NZB రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి* నందిపేట్ లో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి* ఎల్లారెడీ విద్యుత్ షాక్ తో చిరుత మృతి.. పాతిపెట్టిన రైతు* పిట్లం డాక్టర్ ని నిర్బంధించిన రోగి* కౌలాస్ లో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి* NZB, GGH ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తి మృతి* కామారెడ్డి చికిత్స పొందుతూ వ్యాపారి మృతి* NZB రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి* కేటీఆర్ కు రాఖీ కట్టిన కవిత*
18 ఏళ్లు దాటని పిల్లలకు బైకులు ఇవ్వకూడదని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని కావున తప్పనిసరిగా ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కలెక్టర్ సూచించారు. పోలీసులు కూడా హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకొని ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విద్యార్థులకు ఉద్భోదించారు. బుధవారం కలెక్టర్ మండలంలోని గర్గుల్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. విద్యార్థుల పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి, వారి సమాధానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈవో రాజు తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.