Nizamabad

News August 28, 2024

NZB: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో మాక్లూర్‌కు చెందిన శ్రీకాంత్‌తో పాటు మరో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 28, 2024

NZB: సెప్టెంబర్ 29న దీన్ దయాళ్ స్పర్శ్ యోజన పోటీలు

image

నిజామాబాద్ జిల్లాలో తపాలా శాఖ ఆధ్వర్యంలో 6-9వ తరగతి విద్యార్థులకు దీన్ దయాళ్ స్పర్శ్ యోజన క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 29న జరిగే పోటీలో ఎంపికైనా వారు ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫలితాలను నవంబర్ 14న విడుదల చేయనున్నారు. గెలుపొందిన విద్యార్థుల ఖాతాల్లో ఏడాదికి రూ.6వేల ఉపకార వేతనం జమచేస్తారు. NZB, KMR, ఆర్మూర్ పోస్ట్ ఆఫీసుల్లో పోటీకి సంబంధించిన దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి.

News August 28, 2024

జైలుకు పంపి నన్ను జగమోండిని చేశారు: MLC కవిత

image

తీహర్ జైలు నుంచి విడుదలైన తర్వాత MLC కవిత కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మాట్లాడుతూ.. తనను అనవసరంగా జైలుకు పంపి జగమెుండిని చేశారన్నారు. ‘నేను కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు. మెుండిదాన్ని.. మంచిదాన్ని’ అని పేర్కొన్నారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో చెల్లిస్తానని అన్నారు.

News August 28, 2024

ALERT: బీ.ఎడ్ రెగ్యులర్ రెండవ సెమిస్టర్ పరీక్షల ఫీజు తేదీలు ఇవే

image

తెలంగాణ విశ్వ విద్యాలయ పరిధిలో బీ.ఎడ్. రెగ్యులర్ రెండవ సెమిస్టర్ పరీక్షల ఫీజు వివరాలను పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య. ఎం. అరుణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజును సెప్టెంబర్ 4వ తేది లోపు చెల్లించాలని, 100 రూపాయల అపరాధ రుసుముతో వరకు చెల్లించ వచ్చునని చెప్పారు. పూర్తి వివరాలు విశ్వ విద్యాలయ వెబ్ సైట్ ను చూడాలని ఆమె కోరారు.

News August 27, 2024

SRSP అప్డేట్.. 58.709 TMCలకు చేరిన నీటిమట్టం

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు (80.5TMC)గాను మంగళవారం రాత్రి 7 గంటలకు 1084.6 అడుగులకు (58.709 TMC) నీటిమట్టం చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాగా 24,014 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా వస్తోందని ఔట్ ఫ్లోగా 4,459 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని చెప్పారు.

News August 27, 2024

బాన్సువాడ: ‘సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడు’

image

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, డ్యూటీ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు శంకర్, కృష్ణవేణి ఆరోపించారు. సోమవారం జ్వరంతో ఉన్న తమ కుమారుడు హేమంత్ (3)ను ఆసుపత్రికి తీసుకొచ్చామన్నారు. రాత్రి హేమంత్ ఏడుస్తున్నాడని సిబ్బందికి చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీంతో మంగళవారం ఉదయం తమ కుమారుడు మృతి చెందాడని వారు తెలిపారు.

News August 27, 2024

సదాశివ‌నగర్‌లో డెంగ్యూతో ఎవరూ మృతి చెందలేదు: వైద్యాధికారి

image

సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డెంగ్యూతో ఎవరూ చనిపోలేదని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఇటీవల రన్విత్ (9), మాన్విశ్రీ (12)లకు తీవ్ర జ్వరం రావడంతో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. కాగా వారికి మోతాదుకు మించి యాంటీబయోటిక్ మందులు ఇవ్వడంతోనే చనిపోయారని ఆయన స్పష్టం చేశారు. సదాశివనగర్‌కు చెందిన నరేశ్ షుగర్ సమస్యతో మృతి చెందాడని ఆయన పేర్కొన్నారు.

News August 27, 2024

NZB: 11 మంది నేషనల్ అథ్లెటిక్స్ మెడల్ విజేతలకు క్యాష్ అవార్డు

image

జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్స్ సాధించిన జిల్లాకు చెందిన 11 మంది విజేతలకు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శీను నాయక్ క్యాష్ అవార్డులు అందజేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన నేషనల్ అథ్లెటిక్స్‌లో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన 11 మంది కలిసి మొత్తం 17 మెడల్స్ సాధించారు. రాష్ట్ర సంఘం ప్రకటించిన విధంగా నగదును జిల్లా విజేతలకు అందజేశారు.

News August 26, 2024

ఉమ్మడి NZB జిల్లాలో నేటి HIGHLIGHTS

image

* జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
* జిల్లాలోని పలు దేవాలయాలకు భక్తుల తాకిడి
* చందూర్: ఘన్పూర్ అటవీ ప్రాంతంలో చిరుత సంచారం ?
* ఎల్లారెడ్డి: చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
* NZB: రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి: CPM జిల్లా కార్యదర్శి రమేష్
* వేల్పూర్: కూలిన పాఠశాల ప్రహరీ
* ఆర్మూర్ RTC బస్టాండ్ పరిసరాలను పరిశీలించిన MLA రాకేష్ రెడ్డి
* SRSP కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో

News August 26, 2024

NZB: సర్పంచ్ ఎన్నికలు.. వారొస్తున్నారు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

error: Content is protected !!