Telangana

News March 18, 2024

వరంగల్: ఓటరు నమోదుకు అవకాశం

image

లోకసభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 15 వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని 18 ఏళ్లు నిండిన అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక BLOలను సంప్రదించాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో http:///ceotelangana.nic.in లేదా http:///voters.eci.gov.in అనే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

News March 18, 2024

HYD: ‘KCR, KTR వల్లనే రాష్ట్రం అభివృద్ధి’ 

image

మల్కాజిగిరి పార్లమెంట్ BRS MP అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి కోరారు. MLA అధ్యక్షతన HYD కర్మాన్‌ఘాట్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ CM KCR, KTR వల్లనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, BRSకు ఓటేసి గెలిపించాలని లక్ష్మారెడ్డి కోరారు. ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, రాజిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తదితరులున్నారు.

News March 18, 2024

HYD: ‘KCR, KTR వల్లనే రాష్ట్రం అభివృద్ధి’

image

మల్కాజిగిరి పార్లమెంట్ BRS MP అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి కోరారు. MLA అధ్యక్షతన HYD కర్మాన్‌ఘాట్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ CM KCR, KTR వల్లనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, BRSకు ఓటేసి గెలిపించాలని లక్ష్మారెడ్డి కోరారు. ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, రాజిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తదితరులున్నారు.

News March 18, 2024

ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు

image

ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం వేలాది మంది తరలిరాగా సోమవారం కూడా భక్తులు భారీగా సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారికి అభిషేకం చేసి సుందరంగా అలంకరించారు. సహస్రనామార్చన కుంకుమార్చన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. పలువురు బోనాలు, ఒడిబియ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కిక్కిరిసిపోయారు.

News March 18, 2024

MLG: ఎండిన వరి పొలానికి నిప్పు పెట్టిన రైతు

image

మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన రైతు మల్లెబోయిన సైదులు ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో ములకలకాల్వ మేజర్‌ కాల్వ కింద బోరు నీటి ఆధారంతో సాగు చేయగా పంట పొట్ట దశకు వచ్చే వరకు నీరు పారింది. తాజాగా బోర్లలో నీరు లేకపోవడంతో పొలం పూర్తిగా ఎండిపోయింది. దీంతో ఎండిన పంటకు నిప్పు పెట్టాడు. ఐదెకరాల్లో సాగుకు రూ.1.25 లక్షల పెట్టుబడి పెట్టినట్టు వాపోయాడు.

News March 18, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల వివరాలు ఇలా..!

image

మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. MBNR-245, NRPT-205, కొడంగల్-56,WNPT-218, GDWL-225, NGKL-101, కొల్లాపూర్-67, అచ్చంపేట-79, కల్వకుర్తి-72, షాద్ నగర్-171 ఓటర్లు ఉన్నారు. 83 ZPTCలు, 888 MPTCలు, 449 వార్డు కౌన్సిలర్లతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, 19 ఎక్స్అఫీషియో హోదాలో ఓటు వేయనున్నారు.

News March 18, 2024

కోదాడ: క్యాన్సర్ బాధిత చిన్నారికి.. సాయం కోసం ఎదురుచూపులు

image

కోదాడ పట్టణంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బాలుడు మహమ్మద్ అమన్ క్యాన్సర్ వ్యాధి బారినపడి ఇబ్బంది పడుతున్నాడు. HYDలోని ఓ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అమర్ వైద్యానికి రూ.20 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో అంత స్థోమత లేని తండ్రి రియాజ్ దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకును కాపాడాలని వేడుకుంటున్నాడు.

News March 18, 2024

సోదరుడు అర్వింద్‌ను ఆశీర్వదించాలి: ప్రధాని మోదీ

image

నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి, సోదరుడు ధర్మపురి అర్వింద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జగిత్యాల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ మెుదలైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని అన్నారు. 400 సీట్లు దాటాలని తమకు ఓటేయాలని ఆయన కోరారు.

News March 18, 2024

ఆ ఇద్దరిని భారీ మెజార్టీతో గెలిపించాలి: జగిత్యాలలో మోదీ

image

కరీంనగర్, పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండిసంజయ్, గోమాస శ్రీనివాస్‌ను భారీ మోజార్టీతో గెలిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జగిత్యాల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ మెుదలైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించిబోతున్నారని అన్నారు. 400 సీట్లు దాటాలి- బీజేపీకి ఓటేయాలని కోరారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

News March 18, 2024

ఖమ్మం: రూ.800 కోట్లతో భారీ సాగునీటి పథకం

image

మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, మధిర మండలాల రైతుల సాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సాగర్ రెండో జోన్ నుంచి సాగర్ జలాలు అందించేందుకు అధికారులతో రూపకల్పన చేయించారు. ఇందుకు రూ.800 కోట్లతో భారీ సాగునీటి పథకాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల రెండు మండలాల్లోని 33,025 ఎకరాల్లో రెండు పంటలకు సాగునీరు అందించనున్నారు.