India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లా కలెక్టరేటో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు
సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి ఉండదని, ఎన్నికల తర్వాత యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని చెప్పారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని మెదక్, సిద్దిపేట అధికారులు కోరారు.
HYD చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో దారుణ హత్య జరిగింది. శనివారం అర్ధరాత్రి ప్రధాన రహదారి ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న 67 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఎంపిక విషయంలో పీటముడి వీడటం లేదు. టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆశిస్తున్నారు. మల్కాజ్‌గిరి టికెట్‌పై సైతం ఆశలు పెట్టుకున్నారు. అక్కడ ఇవ్వకుంటే మెదక్ టికెట్ అయినా ఖరారు చేయాలని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. పటాన్‌చెరుకు చెందిన నీలం మధు, మైనంపల్లి టికెట్ పోటీలో ఉండగా అధిష్ఠానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందో చూడాలి.
HYD చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో దారుణ హత్య జరిగింది. శనివారం అర్ధరాత్రి ప్రధాన రహదారి ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న 67 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల నోడల్ అధికారులుగా నియామకమైన వారికి శిక్షణ ఇస్తున్నట్టు కలెక్టర్ ఎన్నికల అధికారి మను చౌదరి తెలిపారు. విలేకరులతో మాట్లాడారు. మెదక్ లోక్ సభ పరిధిలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయని, కరీంనగర్ లోక్సభ పరిధిలో హుస్నాబాద్ నియోజకవర్గం భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో జనగామ శాసనసభ పరిధికి సంబంధించి జిల్లాలోని నాలుగు మండలాలు ఉన్నాయన్నారు.
37 కార్పొరేషన్‌లకు చైర్మన్‌లను నియమిస్తూ ప్రభుత్వం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. పరకాల – ఇనగాల వెంకట్రామి రెడ్డికి (కుడా చైర్మన్), వరంగల్ పశ్చిమ – జంగా రాఘవ రెడ్డి (ఆయిల్ ఫెడ్ చైర్మన్), మహబూబాబాద్ -బెల్లయ్య నాయక్ (గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్), భూపాలపల్లి – ప్రకాష్ రెడ్డి (ట్రేడింగ్&ప్రమోషన్ చైర్మన్)గా నియమించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతుండటం వల్ల రాగల 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 34.4, కనిష్ఠం 23.0 డిగ్రీలు, గాలిలో తేమ 50 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

మెదక్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఎంపిక విషయంలో పీటముడి వీడటం లేదు. టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆశిస్తున్నారు. మల్కాజ్‌గిరి టికెట్‌పై సైతం ఆశలు పెట్టుకున్నారు. అక్కడ ఇవ్వకుంటే మెదక్ టికెట్ అయినా ఖరారు చేయాలని ఆయన అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. పటాన్‌చెరుకు చెందిన నీలం మధు , సంగారెడ్డి DCC అధ్యక్షురాలు, జగ్గారెడ్డి సతీమణి నిర్మల పేర్లు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో అనేక ఆలయాల్లో ధర్మకర్తల మండళ్లు పనిచేయటం లేదు. పదవీ కాలం పూర్తయి నెలలు గడుస్తున్న కొత్త కమిటీల ఏర్పాటు రూపుదాల్చడం లేదు. జనవరిలో ట్రస్ట్ బోర్డుల నియామకానికి దేవాదాయ శాఖ ప్రకటన జారీ చేయగా ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల నియామక ప్రక్రియ ఆగిపోయింది. దీంతో పాలకమండలి సభ్యుల పదవీ కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు నిరాశలో పడ్డారు. ఉమ్మడి జిల్లాలో దేవాదాయశాఖలో మొత్తం 1340 ఆలయాలు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.