India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో ప్రజల తరపున బీజేపీ పోరాటం చేస్తే అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, MBNR లోక్ సభ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. విజయ సంకల్ప సభలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో 60 ఏళ్లలో చేయనివి బీజేపీ పదేళ్లలోనే చేసి చూపెట్టిందని, ప్రధాని మోదీ భారత్ కీర్తిని పెంచుతుంటే కాంగ్రెస్ మాత్రం విషం చిమ్ముతోందని, ప్రతి ఒక్కరి నోటి వెంట మోదీ మాటే వినిపిస్తోందని అన్నారు.
ఓదెలకు చెందిన వెంకటసాయి(28) బీటెక్ పూర్తి చేసుకుని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా తన సోదరుడు, సోదరి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. తనకు తక్కువ వేతనం ఉండి, చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని కొద్ది రోజులుగా మనస్తాపానికి గురవుతున్నాడు. దీంతో శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. HYDలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పొత్కపల్లి పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో 15నెలల చిన్నారి మృతి చెందిన ఘటన దిలావర్‌పూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అబ్దుల్‌సాదిక్, అనయాకు 15నెలల కూతురు ఉంది. శనివారం గ్యాస్ ఏజెన్సీ వాహనం సిలిండర్ల పంపిణీకి వెళ్తుంది. ఈక్రమంలో చిన్నారి ఇంట్లో నుంచి బయటకి రావడంతో వేగంగా వస్తున్న వాహనం తల పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నట్లు SI తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుంచి ఎన్నికల నియామవళి అమలు వచ్చింది. వెంటనే అప్రమత్తమయిన జిల్లా యంత్రాంగం సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వ కార్యక్రమాల గోడ పత్రికలు, ఫ్లెక్సీలను తొలగింపజేశారు. సంగారెడ్డి పట్టణ పరిధి పోతిరెడ్డిపల్లి కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఇలా ముసుగు వేశారు. బహిరంగ ప్రదేశాల్లో వివిధ పార్టీలకు చెందిన బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, హార్డింగ్, కటౌట్లు కూడా తొలగిస్తున్నారు.
వరంగల్ పార్లమెంట్‌కు సంబంధించి బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ ఈ స్థానాన్ని ఎంతో కీలకంగా భావించి అభ్యర్థుల ప్రకటన కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. రేపోమాపో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. కాగా ఆరూరి రమేశ్‌కు బీజేపీ నుంచి ఇక్కడ టికెట్ దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డిని కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వరించింది. సూర్యాపేట అసెంబ్లీ టికెట్ ఆశించి బంగపడ్డ ఆయనకు, నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి రఘువీర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయనను తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్న మువ్వా విజయ్‌బాబును కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలను విజయ్‌బాబు నిర్వర్తించి కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆయనకు ప్రభుత్వం గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది.
విధుల్లో ఉన్న ఎంపీవోను ఎంపీపీ ఆగ్రహంతో చెప్పుతో కొట్టిన ఘటన కోడేరులో జరిగింది. బాధితుడి వివరాలు.. పెండింగ్ బిల్లుల విషయంలో ఎంపీడీవో కార్యాలయంలో ఇరువురు మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఎంపీపీ వెంకటరాధ దుర్భాషలాడుతూ.. నా మాట ఎందుకు వినడంలేదంటూ ఎంపీ చెప్పుతో కొట్టి ఆగ్రహంతో వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఎంపీవో శ్రావణ్‌కుమార్ ఫిర్యాదుతో ఎస్సై కురుమూర్తి కేసు నమోదు చేశారు.
ఉమ్మడి జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వాన అన్నదాతలను ఆగమాగం చేసింది. ప్రధానంగా ఇంధల్వాయి, డిచ్‌పల్లి, సిరికొండ, ధర్పల్లి, జుక్కల్ నియోజకవర్గంలో పడిన ఈ రాళ్లతో కోతకు వచ్చిన వరి నేలరాలింది. పూతకు వచ్చిన నువ్వుల పంట విరిగిపోగా.. మామిడి పిందెలు రాలిపోయాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అకాల వర్షానికి దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్ డిగ్రీకి సంబంధించిన 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీ విడుదల చేసినట్లు KU అధికారులు తెలిపారు. మార్చి 30 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అలాగే ఏప్రిల్ 10 వరకు ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు మేలో ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు గమనించాలని కోరారు. SHARE IT
Sorry, no posts matched your criteria.