Telangana

News March 18, 2024

HYD: శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు

image

మాదాపూర్‌లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం విశాఖపట్నం కళారాధన మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గురువు డా.తాళ్లపాక సందీప్ కుమార్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనతో అలరించారు. పుష్పాంజలి, మూషిక వాహన, ముద్దుగారే యశోద, శివతాండవం, మహాగణపతి, కాలభైరవాష్టకం, జయము జయం,అన్నమాచార్య కీర్తనలు, కళాపూజ, జగన్మోహన, దుర్గ స్తుతి, అభంగ్ మొదలైన అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

News March 18, 2024

భువనగిరి శివారులో వ్యక్తి మృతదేహం లభ్యం

image

భువనగిరి పట్టణ శివారులోని హుస్నాబాద్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు పట్టణ ఎస్సై సురేష్ తెలిపారు. కాలిపోయి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారని మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉంటాయన్నారు. కాలిపోయి ఉండటంతో ఎవరైనా హత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 18, 2024

KMM: అడుగంటుతున్న పాలేరు జలాశయం!

image

పాలేరు జలాశయం వేసవి ప్రారంభంలోనే అడుగంటుతోంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఉన్న ఈ జలాశయం.. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాలకు తాగునీటి ఆదరువు. ఎండలు తీవ్రమైతే దీనిపై ఆధారపడిన ఈ జిల్లాల ప్రజలకు తాగునీటి కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం నిల్వ ఉన్న నీళ్లు కూడా మార్చి నెలలో పూర్తిస్థాయిలో అందించలేని పరిస్థితులున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

News March 18, 2024

మోదీ జగిత్యాల పర్యటన షెడ్యూల్ ఇదే

image

ఉదయం 10 గంటలకు మోదీ రాజ్‌భవన్ నుంచి బయలుదేరుతారు. 10:15కు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11:15కు జగిత్యాలకు వెళ్తారు. 11:30 వరకు జగిత్యాల బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు జగిత్యాల నుంచి బయలుదేరుతారు. 1:30 గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

News March 18, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు..!

image

✔అంతా సిద్ధం..నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం
✔ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్.. తనిఖీలు షురూ
✔NRPT:నేటి నుంచి యోగ శిబిరం ప్రారంభం
✔ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు ఒంటి పూట ప్రారంభం
✔కొనసాగుతున్న కుష్టి వ్యాధుల సర్వే
✔MLC ఉప ఎన్నికలు..నేతలు బిజీ..బిజీ..
✔ప్రత్యేక చెక్ పోస్టులపై అధికారుల నిఘా
✔రంజాన్ వేళలు:
ఇఫ్తార్(సోమ):6:34,సహార్(మంగళ):5:02
✔త్రాగునీటి సమస్యలపై సమీక్ష

News March 18, 2024

కామారెడ్డి: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మహిళ మృతి

image

మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట గ్రామానికి చెందిన మరాఠీ లక్ష్మి (42) పని నిమిత్తం మాచారెడ్డికి వచ్చినట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో మాచారెడ్డి ఊర చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News March 18, 2024

హనుమకొండ: దాడి చేసిన 9మందిపై కేసు

image

హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన నాగరాజు, గణపురం గ్రామానికి చెందిన శ్రావణి ప్రేమించి ఈ నెల 12న పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు 14న శాయంపేటకు పోలీసులను సంప్రదించగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈక్రమంలో 16న బంధువులు నాగరాజు ఇంటికి వెళ్లి దాడి చేశారు. దీంతో శ్రావణి ఫిర్యాదు చేయగా దాడి చేసిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News March 18, 2024

బెల్లంపల్లి: పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య

image

పెళ్లి కావడం లేదనే మనోవ్యధతో ఓ యువతి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని టేకుల బస్తీకి చెందిన కొత్తూరు సుమలత ఆదివారం కన్నాల రైల్వేగేట్ వద్ద గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లీడు దాటి పోతున్నా వివాహం కావడం లేదనే బాధతో ఆత్మహత్య చేసుకుందని జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 18, 2024

భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బిక్షమయ్య గౌడ్..?

image

భువనగిరి పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఖరారైనట్లు తెలుస్తోంది. BNG, NLG స్థానాలను బీసీ, ఓసీలకు కేటాయించాలని బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో గౌడ సామాజికవర్గం ఓట్లు ఉన్నందున BNG సీటును అదే సామాజికవర్గానికి చెందిన బిక్షమయ్య గౌడ్‌కు కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

News March 18, 2024

మెదక్: 10th విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: రఘునందన్ రావు 

image

నేటి నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు సోషల్ మీడియా ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఏకాగ్రతతో పరీక్షలు రాసి అద్భుతమైన ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు. చదువును కష్టపడి కాకుండా ఇష్టంతో చదివితే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు.