India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి మ. 2.30 గంటల వరకు రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాధికారి జయశ్రీ తెలిపారు. విద్యార్హత 10th, ఇంటర్, డిగ్రీ, PG, ITI డిప్లమా. వయస్సు: 18-30 మధ్య ఉండాలి. మరిన్ని వివరాలకు 9063099306, 8977175394 నంబర్లను సంప్రదించాలన్నారు.
రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మానవత్వం చాటుకున్నారు. బాలాపూర్ గణేశ్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లను సీపీ పర్యవేక్షిస్తున్నారు. అయితే మార్గమధ్యలో ప్రమాదానికి గురైన ఓ జంటను గమనించి, తన వాహనాన్ని నిలిపివేశారు. వారికి వెంటనే ప్రథమ చికిత్స చేయించి, సురక్షితంగా పంపించారు. నిమజ్జనంలో బిజీగా ఉన్నప్పటికీ సీపీ తీసుకున్న ఈ ప్రత్యేక చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
GHMC భవన నిర్మాణాలకు భారీగా అనుమతులు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో 4,389 నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, రూ.759.98 కోట్ల ఆదాయం గడించింది. గతేడాది ఇదే సమయంలో వచ్చింది రూ.399.61 కోట్లు కాగా.. ఈసారి రూ.360.37 కోట్లు అదనంగా వచ్చింది. ఈ ఏడాది మొత్తం రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని GHMC అంచనా వేస్తోంది.
HYDలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రధాన రూట్‌ను పోలీసులు ప్రకటించారు. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాసెషన్ కట్ట మైసమ్మ ఆలయం, కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి, అలియాబాద్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మార్గాలుగా సాగి అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, పీవీ ఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వద్దకు చేరుకోనుందని అధికారులు తెలిపారు.
ఖైరతాబాద్ బడా గణేశ్‌ను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడి ఆశీర్వాదం పొందారు. అనంతరం ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి నాయకులు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ఆయనను సత్కరించి విఘ్నేశ్వరుడి ప్రతిమను బహుకరించారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఐఆర్‌ఎఫ్- 2025 ర్యాంకింగ్స్‌లో దేశంలోనే 24వ స్థానంలో నిలిచింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ నివేదికలో వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల పనితీరును పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్దాస్ జానయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ ర్యాంక్ సాధించడం తమ కృషికి నిదర్శనమని తెలిపారు.
జూబ్లీహిల్స్ ఓటరు ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ విడుదల చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉండగా వారిలో.. పురుషులు 2,04,228, మహిళలు 1,88,356, ఇతరులు 25 ఉన్నారన్నారు. సెప్టెంబర్ 17 వరకు అభ్యంతరాల స్వీకరణ, మార్పులు చేర్పులు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందని, సెప్టెంబర్ 30న జాబితా విడుదల చేస్తామని స్పష్టంచేశారు.
లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.
ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మధురానగర్ PSలో గణేశ్ నిమజ్జన బందోబస్తుపై పోలీసులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులు, పిక్ పాకెటింగ్, ఈవ్ టీజింగ్, గొలుసు దొంగతనం తదితర నేరాలు నివారించడానికి పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలన్నారు.
గణేశ్ నిమజ్జనానికి GHMC ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం కమిషనర్ కర్ణన్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, లేక్ వ్యూ పార్క్, బతుకమ్మ కుంట తదితర ప్రాంతాలను పరిశీలించారు. బారీకేడింగ్, లైటింగ్, క్రేన్లు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగరంలోని 20 ప్రధాన చెరువులతో పాటు చిన్న విగ్రహాల కోసం 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.