India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
GHMCలో నేటి నుంచి ఈ నెల 25 వరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు GHMC కమిషనర్ కర్ణన్ తెలిపారు. వర్షాకాలంలో వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను నివారించడానికి పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. వాతావరణశాఖ సూచనల ప్రకారం రాబోయే రోజుల్లో వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉండడంతో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాల తొలగింపునకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.
కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జిల్లా కలెక్టర్, డీఈఓకు లేఖ రాశారు. తమ పాఠశాలలో పనిచేస్తున్న సుష్మ అనే టీచర్ గండిపేట పాఠశాలకు డిప్యూటేషన్‌పై వెళ్లారని, దీంతో తమ పాఠశాలలో శివారెడ్డి అనే టీచర్ ఒకరే ఉండడంతో చదువు బోధించడం ఇబ్బందిగా మారిందని, వెంటనే సుష్మ టీచర్‌ను తమ పాఠశాలకు పంపించాలని విద్యార్థులు కోరారు.
రంగారెడ్డి జిల్లాకు కొత్తగా వచ్చిన అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని భూమికి సంబంధించిన ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయంటూ బాధితులు వచ్చి కలుస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అడిషనల్ కలెక్టర్ ఆఫీస్ గోడపై బోర్డులు ఏర్పాటు చేశారు. ‘నా వద్ద 4,600 పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి.. వీటిని క్లియర్ చేయడానికి నాకు సమయం పడుతుంది.. దయచేసి సహకరించండి’ అంటూ ఇలా నోటీస్ అంటించి బాధితులని కోరుతున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో HYD- తిరుపతి అలియాన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. 67 మంది ప్రయాణికులు బోర్డింగ్ అయిన తర్వాత సాంకేతిక లోపాన్నీ పైలెట్ గుర్తించారు. తిరిగి ప్రయాణికులను దింపేసి సాంకేతిక లోపాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. కాగా.. తిరుపతి వెళ్లాల్సిన 67 మంది ప్రయాణికులు హోల్డింగ్‌లొనే ఉన్నారు.
జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అందులోనూ రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని బేస్ బాల్ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలు సోమవారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో HYD, RR జాయింట్ విన్నర్లుగా, NZB తృతీయ స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో HYD, NZB జాయింట్ విన్నర్లుగా నిలిచాయి.
తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో గంటల ప్రతిపాదికన విధులు నిర్వహిస్తున్న బోధన సిబ్బంది పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గత మూడు నెలలుగా వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నామని, కుటుంబ పోషణ భారంగా మరి అప్పుల పాలవుతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పొరుగు సేవల సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్, పీడీ, నైట్ వాచ్‌మెన్, ఆఫీస్ సబార్డినేట్‌లకు సైతం 5నెలలకు పైగానే వేతనాలు రాలేదు.
ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హతమార్చిన నిందితుడు కమర్‌ను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకొని శనివారం రిమాండ్‌కు తరలించారు. బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డ విషయం ఇంట్లో చెబుతాడన్న భయంతో కమర్ బాలుడిని హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
చందానగర్ ఖజానా దోపిడీ కేసులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు మాదాపూర్ DCP వినీత్ తెలిపారు. బిహార్‌కు చెందిన ఆశిష్, దీపక్‌ను అరెస్టు చేశామని, వీరిని పుణెలో పట్టుకున్నామన్నారు. చోరీ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించామని, నిందితులంతా బిహార్ వాసులుగా గుర్తించామన్నారు. నిందితుల నుంచి గోల్డ్ కోటెడ్ సిల్వర్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో పాటు పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమని జిల్లా ప్రధాన జడ్జి, DLSA ఛైర్మన్ జస్టిస్ కర్ణకుమార్ అన్నారు. దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ‘మధ్యవర్తిత్వం ఫర్ ద నేషన్’ వేళ మాట్లాడారు. కేసులు వేగంగా, తక్కువ ఖర్చు, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు ఉత్తమ మార్గమన్నారు. పెండింగ్ కేసులు తగ్గి, న్యాయవ్యవస్థ వేగవంతమవుతుందన్నారు. DLSA కార్యదర్శి శ్రీవాణి ఉన్నారు.
Sorry, no posts matched your criteria.