India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యాచారం మండలం మాల్ గ్రామపంచాయతీ కార్యదర్శి YV రాజుకు అరుదైన గౌరవం లభించింది. 2025 సంవత్సరంలో “ఆత్మ నిర్భర్ పంచాయతీ” విభాగంలో జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు ఏప్రిల్ 23న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని YV రాజుకు ఆహ్వానం అందగా, ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా 24/7 తమ సిబ్బందిని అందుబాటులో ఉంచుతోంది. నగర వ్యాప్తంగా 436 ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందాలు 51 రంగంలో ఉండగా.. మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌లు 150 పని చేస్తున్నాయి. 3,565 మంది సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 9 బోట్లను సిద్ధం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
రానున్న 2 రోజులు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. కలెక్టరేట్ నుంచి MPDOలు, మున్సిపల్ కమిషనర్లు ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ప్రమాదకరంగా ఉండే నాలాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని, జిల్లాలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు.
భారీ వర్షాలకు మైత్రివనం, స్వర్ణజయంతి కాంప్లెక్స్ సెల్లార్లలోకి వరద నీరు, వ్యర్థాలు వచ్చి చేరాయి. నీటిని తొలగించి చేతులు దులుపుకున్న అధికారులు వ్యర్థాల గురించి పట్టించుకోవడం లేదు. సెల్లార్లలో ఎక్కడా చూసినా అపరిశుభ్రతనే. దుర్వాసనతో స్థానిక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. CM ఇన్‌స్పెక్షన్ చేసిన ఏరియాలోనూ నిర్లక్ష్యం ఏంటని నిలదీస్తున్నారు. ఇకనైనా వ్యర్థాలను తొలగించాలని వ్యాపారులు కోరుతున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కలక్టరేట్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, వేడుకలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ కొంగరకలాన్‌లోని కలక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి 61 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. అర్జీల ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
నగరంలో సాధారణ వర్షపాతాన్ని మించి సగటున 22% అత్యధికంగా నమోదైందని అధికారులు వెల్లడించారు. సిటీవ్యాప్తంగా సాధారణంగా 343 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. గరిష్ఠంగా 439.4 మి.మీ వర్షం నమోదు కావడం గమనార్హం. రంగారెడ్డిలో 292.2 మి.మీటర్ల వర్షపాతానికి 401.7 మిల్లీ మీటర్లు రికార్డు అయ్యింది. మేడ్చల్‌లో 331.0 మి.మీ నమోదు కావాల్సి ఉండగా.. 342.2 మి.మీ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
నగరంలో ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్, GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ.కర్ణన్ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. సిటీలో భారీగా వర్షాలు కురిస్తే అత్యవసర పరిస్థితుల్లో అధికారులు విధుల్లో ఉండాలని, సెలవులు రద్దు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. వానాకాలం పూర్తయ్యే వరకు 24 గంటల పాటు విధుల్లో ఉండాలని సూచించారు.
SHARE IT
హుస్సేన్‌సాగర్‌కు వరద కొనసాగుతోంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.50 మీటర్లుగా ఉంది. నగరంలో కురిసిన వర్షాలతో సాగర్‌కి వచ్చే నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సాగర్‌కి ఇన్ ఫ్లో 1027 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1130 క్యూసెక్కులుగా ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ప్రజలు ఎవరు ఉండవద్దని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. కుండపోతగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని, దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.