India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD శివారు ఆదిభట్ల PS పరిధిలో దారుణం జరిగింది. RGK కుర్మల్‌గూడలో మైనర్ బాలికపై యువకుడు లైంగిక దాడి చేశాడు. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరైన యువకుడు ఇంటికి తీసుకెళ్లి బలవంతం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆదిభట్ల పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
నగరంలో అభివృద్ధి పనులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఆర్‌డీపీ, ఎస్‌ఎన్‌డీపీ, హెచ్-సిటీ ప్రాజెక్టులు, చెరువుల అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఎస్‌ఎన్‌డీపీ, సరస్సుల పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని జోనల్ కమిషనర్లకు ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలపై పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో రోడ్లపై గుంతల పూడ్చివేత కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. నగరంలో మొత్తం 14,631 గుంతలను గుర్తించగా.. వాటిలో 12,181 గుంతలు పూడ్చివేశామన్నారు. గుంతల పూడ్చివేత నిరంతర ప్రక్రియ అని, నాలా పూడికతీత పనులు, చెత్త కుప్పలను సిబ్బందితో కాకుండా యంత్రాలతో శుభ్రం చేయించాలని అధికారులకు ఆదేశించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి MBA కోర్సులో చేరడానికి 24 వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సేవలు విభాగం డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు 2025-26 తెలంగాణ ఐసెట్ లేదా విశ్వవిద్యాలయం నిర్వహించిన MBA హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఎంట్రెన్స్ టెస్టులో అర్హత సాధించాలన్నారు.
నాగోల్ PS పరిధిలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. మహిళా పోలీసులు సైకిళ్లపై తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వీధుల్లోకెళ్లి తెలుసుకున్నారు. గృహహింస, వేధింపులు, అవాంఛనీయ ప్రవర్తన, మద్యం మత్తులో అల్లర్ల సమస్యలపై అవగాహన కల్పించారు. ఏ ఇబ్బంది వచ్చినా అండగా నిలిచి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. డయల్ 100, 112, షీ టీమ్స్ సేవలను ఉపయోగించుకోవాలని స్థానికులకు సూచించారు.
తెల్లవారుజామునుంచే HYDలోని ప్రముఖ గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తోంది. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకల నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
మత్తు పదార్థాలను తరలించే ముఠాలపై తెలంగాణ ఈగల్ టీమ్ ఉక్కుపాదం మోపింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో కలిసి గతనెల 22 నుంచి ఈ నెల 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్లు నిర్వహించింది. ఇందులో 12 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.1.09 కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ కబడ్డీ బాల, బాలికల జట్ల ఎంపిక ఈ నెల 15న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ.. ఎంపికైన క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాలో జరిగే అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. 55 కిలోల బరువు లోపు ఉన్న క్రీడాకారులు మాత్రమే ఈ ఎంపికకు అర్హులని పేర్కొన్నారు.
గాంధీ ఆసుపత్రిని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని నూతన సూపరింటెండెంట్ డాక్టర్ వాణి అన్నారు. శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ఆసుపత్రిలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని పూర్తిగా పరిశీలించి, పరిస్థితులను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
టీజీఎస్ఆర్టీసీ ‘యాత్రాదానం’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిందని హైదరాబాద్-2 డిపో మేనేజర్ కృష్ణమూర్తి తెలిపారు. అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులకు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు ఉచిత యాత్రలు కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి దాతలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజాప్రతినిధులు విరాళాలు అందించి భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.