Warangal

News September 10, 2024

వరంగల్ భద్రకాళి అమ్మవారి చీరలు పక్క దారి!

image

వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో అర్చకులు, ఉద్యోగుల తీరు విమర్శలకు తావిస్తోంది. అమ్మవారికి భక్తులు కానుకలుగా ఇచ్చిన పలు వస్తువులను కొందరు అర్చకులు, అధికారులు ఫలహారంగా పంచుతున్నట్లు సమాచారం. అమ్మవారికి భక్తులు చీర, సారె, పూజా వస్తువులు, పూలు, పండ్లు ఇతరత్రా వస్తువులు భక్తితో సమర్పిస్తారు. ఇవి పక్కదారి పట్టడం ఆందోళన కలిగిస్తోంది.

News September 9, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> WGL: ఏడుగురు పేకాటరాయుళ్ళ అరెస్ట్.. > HNK: గుండెపోటుతో జర్నలిస్టు మృతి.. > BHPL: బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి.. > MLG: విష జ్వరం.. అనాధలుగా మారిన పిల్లలు.. > HNK: నలుగురు నకిలీ రిపోర్టర్లు అరెస్ట్.. > MHBD: కేసముద్రం మండలాల్లో గుప్పుమంటున్న గుడుంబా! > MLG: దొంగను పట్టించిన సీసీ కెమెరాలు..

News September 9, 2024

నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని: ఏసీపీ

image

గణేష్ నవరాత్రులను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు. నర్సంపేట పట్టణంలోని సిద్ధార్థ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఏసిపి కిరణ్ కుమార్ సోమవారం పూజలు నిర్వహించారు. డిప్యూటీ తహసిల్దార్ రవి, పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహ రాములు తదితరులు ఉన్నారు.

News September 9, 2024

సదస్సులో పాల్గొన్న మంత్రి సీతక్క

image

ఆగ్రాలో జరిగిన సామాజిక న్యాయం, సాధికారత సదస్సులో కేంద్ర మంత్రులు డాక్టర్ వీరేంద్ర కుమార్, రాందాస్ అథవాలేతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై సీతక్క మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమంపై దృష్టి సాధించాలని విజ్ఞప్తి చేశారు.

News September 9, 2024

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నకు రికార్డు ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న మరోసారి రికార్డు ధర పలికింది. గత వారం మార్కెట్లో క్వింటా మొక్కజొన్న ధర రూ.3,015 పలకగా.. నేడు అదే ధర పలికి రికార్డును కొనసాగించింది. మార్కెట్ చరిత్రలోనే ఇంత ధర రావడం ఇదే మొదటిసారి అని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మొక్కజొన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News September 9, 2024

అవినీతి నిర్మూలనే ధ్యేయం: సీఎండీ వరుణ్ రెడ్డి

image

TGNPDCL సంస్థలోని ఉద్యోగులు భారీ వర్షాలను వరదలను సైతం లెక్కచేయకుండా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి నిబద్ధతతో పనిచేస్తున్నారని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, ఎవరైనా లంచం అడిగితే 92810 33233 నంబరుకు, విజిలెన్స్ విభాగానికి సమాచారం ఇవ్వాలన్నారు. అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064లో ఫిర్యాదు చేయాలన్నారు.

News September 9, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజా మిర్చి క్వింటాకు నేడు రూ.18,200 పలికింది. అలాగే 341 రకం మిర్చికి రూ.14,500 ధర రాగా వండర్ హాట్(WH) మిర్చికి రూ.15,500 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ నాణ్యమైన సరుకులు మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.

News September 9, 2024

వరంగల్ మార్కెట్‌లో పెరిగిన పత్తి ధర

image

2 రోజుల విరామం తర్వాత వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈ రోజు మళ్లీ ప్రారంభమైంది. దీంతో పత్తి తరలి వచ్చింది. అయితే ధర మాత్రం గత వారంతో పోలిస్తే పెరిగింది. గత వారం గరిష్ఠంగా క్వింటా పత్తి ధర రూ.7,665 పలకగా.. నేడు రూ.7700 పలికిందని మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. మార్కెట్‌లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

News September 9, 2024

గ్రేటర్‌ వరంగల్‌లో అపురూపమైన కట్టడం!

image

గ్రేటర్‌ వరంగల్‌లో అపురూపమైన కట్టడంగా కాళోజీ కళాక్షేత్రం నిలవనుంది. కాళోజీ నారాయణరావు స్మారకార్థం హనుమకొండ హయగ్రీవాచారి మైదానంలో నిర్మిస్తున్న కళాక్షేత్రం ఓరుగల్లుకు తలమానికం కానుంది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతికి దీటుగా దీనిని నిర్మించారు. సువిశాలమైన పరిసరాలు, ఆహ్లాదకరమైన ఉద్యానవనం, ప్రకృతి వాతావరణంలో ఈ కళాక్షేత్రం అందుబాటులోకి రానుంది.

News September 9, 2024

బుడమేరులా.. భద్రకాళి చెరువుతో పొంచి ఉన్న ముప్పు!

image

APలో విజయవాడను బుడమేరు వాగు వరదలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. అధికారులు పట్టించుకోకుంటే మన వరంగల్ నగరంలో భద్రకాళి చెరువుతోనూ పెద్ద ముప్పే ఉంది. గతంలో భద్రకాళి చెరువుకు గండి పడటంతో సమీపంలోని కాలనీ వాసులను ఖాళీ చేయించారు. హంటర్ రోడ్డు బొందివాగు పొంగితే వరద ధాటికి పోతన నగర్ వైపు మరోసారి గండి పడే ప్రమాదం ఉంది. స్మార్ట్ సిటీ పనుల్లో కట్టకు కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మిస్తేనే సమస్య తొలుగుతుంది.