India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భద్రకాళి చెరువు పూడికతీత, మట్టి తరలింపు ప్రక్రియ వేగవంతంగా జరగాలని హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద అన్నారు. పూడికతీత పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, బల్దియా కమిషనర్ పరిశీలించారు. పూడిక తీత మట్టి తరలింపు రూట్ మ్యాప్, వాహనాల రాకపోకలకు సంబంధించి వేస్తున్న ఫార్మేషన్ రోడ్డు పనులు మట్టి తరలించేందుకు ఇచ్చే వాహనాల రూట్‌లను పరిశీలించారు.
రాయపర్తి మండల పరిధిలో, ఉకల్, ఘటికల్, జగన్నాథపల్లి, గ్రామాల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డీబీఎం 54, 57, కాల్వ వరి పంట పొలాలను కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. ఈ సందర్భంగా వరికి నీరును సకాలంలో అందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ సత్య శారద అదేశించారు. వరి సాగు చేసే రైతులకు నూతన పద్ధతులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.
మంత్రి కొండా సురేఖ తన CMRF చెక్కును అందజేశారు. చేర్యాల మండలం నాగపురి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ప్రశాంత్ కుమారుడు నయన్ కుమార్ మాటలు రాక ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఏ హాస్పటల్‌కి పోయినా రూ. 8 నుంచి 10లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సూచనతో తక్షణమే వారి పరిస్థితి తెలుసుకొని కింగ్ కోటిలోని ప్రభుత్వ ENT ఆసుపత్రికి రూ. 8లక్షలను CMRF చెక్కును మంత్రి అందజేశారు.
ములుగు జిల్లా సమక్క-సారక్క గిరిజన యూనివర్సిటీకి మొదటి వైస్ ఛాన్సలర్‌ను భారత ప్రభుత్వం/ కేంద్ర విద్యా శాఖ నియమించింది. హైదరాబాదులోని ఆరోరా హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అకాడమీకి చెందిన ప్రొఫెసర్ యెడవల్లి లక్ష్మీ శ్రీనివాస్‌ను నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. నిన్న పత్తి ధర క్వింటాకి రూ.6,960 పలకగా.. నేడు రూ.10 తగ్గి.. రూ.6,950కి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారస్థులు తెలుపుతున్నారు.
వరంగల్ జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 32 నుంచి 36 డిగ్రీలు, రేపు 32-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.
హైదరాబాద్ సచివాలయం నుంచి సాగునీటి నిర్వహణ సరఫరాపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు వరంగల్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నీటిపారుదల వ్యవసాయ విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పంటలకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
నర్సంపేటలోని సంజీవని అనాథాశ్రమంలో చిన్నప్పటి నుంచి ఆశ్రయం పొందిన రోజా, నాగరాణి అనే ఇద్దరు అనాథ యువతులకు ఈనెల 12న వివాహాలు జరగనున్నాయి. ఆ పెళ్లితంతులో భాగంగా సోమవారం అదే ఆశ్రమంలో ఇద్దరు యువతులకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళల నడుమ మంగళస్నానాలు చేయించారు. ఏ లోటు లేకుండా పెళ్లిళ్లు జరపాలనే సేవాగుణాన్ని చాటుకోవడం పట్ల ఆశ్రమ నిర్వాహకుడు డా.మోహనరావును ఐసీడీఎస్ సీడీపీవో మధురిమ అభినందించారు.
ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సదుపాయాలని లేఅవుట్, నాన్ లేఅవుట్ ఫ్లాట్లు, యజమానులు డెవలపర్లు ఫ్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ తెలిపారు. కూడా కార్యాలయంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ సంబంధిత అధికారులతో ఎల్ఆర్ఎస్‌పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు రెగ్యులరైజ్ చేసుకోవాలన్నారు. నిబంధనల మేరకు అనుమతులు ఇస్తామన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి సోమవారం అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.17వేలు పలకగా,1048 రకం మిర్చి రూ.11వేలు, 5531 రకం మిర్చికి రూ. 11,300 ధర వచ్చింది. అలాగే ఎల్లో మిర్చికి రూ.20 వేలు, టమాటా మిర్చికి రూ.28వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.39వేల ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.