India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. నేడు మక్కలు(బిల్టీ) క్వింటాకి రూ.2,545 పలికింది. గతవారం బుధవారం రూ.2,416 ధర, గురువారం రూ.2,420, శుక్రవారం రూ.2,470 ధర పలికాయి. పత్తిధరలు మళ్లీ పెరుగుతుండడంతో మొక్కజొన్న పండించిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కష్టేఫలి అన్నారు పెద్దలు. అది ఆచరణలో పెట్టి నిరూపించాడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువకుడు. పెద్దముప్పారం గ్రామానికి చెందిన తొడేటి కొమురయ్య కుమారుడు అనిల్ మల్టీజోన్-1లో సివిల్ విభాగంలో 9వ ర్యాంక్ సాధించి పాలిటెక్నిక్ లెక్చరర్ అయ్యారు. NIT కాలికట్(కేరళ)లో బీటెక్, IIT బొంబాయిలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీ మెట్రోలో AEగా ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అయి పాలిటెక్నిక్ లెక్చరర్ అయ్యారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటిస్తున్నారు. మాపోలోనే చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే కేంద్రాన్ని పరిశీలించారు. రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైకిల్ చేసి, విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తీరును మంత్రులు అడిగి తెలుసుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో మహబూబాబాద్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కంకర అయ్యప్ప రెడ్డి ఉన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు మిర్చి తరలిరాగా.. వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు రూ.17,500 ధర వచ్చింది. అలాగే వండర్ హాట్ మిర్చికి రూ.16వేల ధర రాగా, 341 రకం మిర్చి క్వింటాకు రూ.16,000 ధర వచ్చింది. కాగా మిర్చి ధరలు గత వారం లాగే స్థిరంగా ఉన్నాయి.
ఓ రైతు కుటుంబంలోని అన్నాతమ్ముడు ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించుకున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన కౌడగాని మైసారావు-వినోధ దంపతులకు మధు, మనోజ్ ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మనోజ్‌కి 3, చిన్న కుమారుడు మధుకి 4 ఉద్యోగాలు సాధించారు. కొందరు ఒక ఉద్యోగం సాధించడానికి తంటాలు పడుతుంటే, వీరు మాత్రం రాసిన ప్రతి పరీక్షలో ఉద్యోగాన్ని సాధించడం గొప్ప విషయం.
అన్న అస్తికలు కలపడానికి వెళ్తూ తమ్ముడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని సుదనపల్లికి చెందిన నర్సయ్య అన్న ఇటీవల మృతిచెందాడు. ఆయన అస్తికలు కలపడానికి కుటుంబీకులతో కలిసి భద్రాచలానికి బయలుదేరారు. ఈ క్రమంలో కురవి మండలం లింగ్యా తండా మూలమలపు వద్ద ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో నీలం నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
MLG: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజా భవన్ కంచెలు తొలిగించామని మంత్రి సీతక్క తెలిపారు. హనుమకొండలో సీతక్క మాట్లాడుతూ.. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశామన్నారు. పదేళ్లుగా వాయిదాలు పడుతున్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సీతక్క తెలిపారు.
ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా బాల పురస్కార్ అవార్డును అందుకున్న కూచిపూడి నాట్య కళాకారుణి చిరంజీవి పెండ్యాల లక్ష్మీ ప్రియను వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. ఈరోజు సీపీ ఆఫీసులో లక్ష్మీప్రియకు పుష్పగుచ్ఛం అందజేసి విషెస్ చెప్పారు. బాల పురస్కార్ అవార్డును అందుకున్న లక్ష్మీ ప్రియ.. విశ్రాంతి పోలీస్ అధికారి గంధం మనోహర్ మనుమరాలు కావడం విశేషం.
భారత జనరల్ సర్జన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ ఎన్నికయ్యారు. హైదరాబాద్ లో సర్జన్ అసోసియేషన్ 10వ సదస్సును నిర్వహించారు. ఇందులో తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడిగా దాస్‌ను ఎన్నిక చేశారు. ఏడాది పాటు జనరల్ సర్జన్స్, అకడమిక్ అండ్ వర్క్ షాప్ కార్యక్రమాల బాధ్యతను మోహన్ దాస్ చూడనున్నారు. ఆయనను పలువురు సన్మానించారు.
Sorry, no posts matched your criteria.