India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నర్సంపేటలోని జిల్లా మహిళా స్పెషల్ కారాగారం జైలర్ కే.ఎన్.ఎస్. లక్ష్మీ శృతిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నర్సంపేట మహిళా జైలులో ఈనెల 21న రిమాండ్ ఖైదీ సుచరిత మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. జైలర్ నిర్లక్ష్యంతో రిమాండ్ ఖైదీ మృతి చెందారని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎటువంటి అంతరాయం లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని కలెక్టర్ సత్య శారద చెప్పారు. నిమజ్జనోత్సవ సమయంలో చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వివిధ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ పండుగ నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు రాకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
వరంగల్ డీఈవోగా బి.రంగయ్య నాయుడిని నియమిస్తూ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్ఞానేశ్వర్‌ను నిర్మల్ DEO ఆఫీసులో FAOగా బదిలీ చేస్తూ విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో రంగయ్యను FAC DEOగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న వరంగల్ డీఈవో మామిడి జ్ఞానేశ్వర్‌ను నిర్మల్ జిల్లా FAC FAOగా పంపిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ డా.నవీన్ నికోలస్ శఉక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జ్ఞానేశ్వర్‌పై వివిధ ఉపాధ్యాయ సంఘాలు 21 ఆధారాలతో కూడిన ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ డైరెక్టర్ వేటు వేసినట్లు తెలుస్తోంది.
జిల్లాలోని 10 జూనియర్ కళాశాలల మౌలిక వసతుల పనులను దసరా లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. ‘అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి’పై సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.1.36 కోట్లు కేటాయించిందని తెలిపారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని ప్రిన్సిపాల్స్, కమిటీ ఛైర్మన్లను ఆదేశించారు.
ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూ.కళాశాలల్లో ఈనెల 23 నుంచి ముఖ గుర్తింపు హాజరు(ఫేస్ రికగ్నెషన్ సిస్టమ్) హజరు పద్దతి అమలు చేయనున్నట్లు DIEO డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఈరోజు ఇంటర్ విద్య కార్యాలయంలో ప్రిన్సిపళ్లకు, సంబంధిత ఇన్ఛార్జ్లకు నూతన హాజరు విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీజీబీఐఈ-ఎఫ్ ఆర్ఎస్ యాప్ ఇన్స్టాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని రోజువారీ హాజరు నమోదు చేయాలన్నారు.
విద్యార్థుల ఆరోగ్యం & విద్యాభివృద్ధి కోసం మరో ముందడుగు అని మంత్రి కొండా సురేఖ అన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో మెస్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచి వసతులు మెరుగుపరుస్తూ రామకృష్ణ మిషన్ & అక్షయపాత్ర సహకారంతో జిల్లాలోని 123 ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్ఠికాహార మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభమైంది. కరీమాబాద్ బీరన్నకుంట పాఠశాలలో విద్యార్థులకు మంత్రి భోజనం వడ్డించారు. కలెక్టర్, మేయర్ ఉన్నారు.
డ్రగ్స్ సంబంధిత సమాచారం ఇవ్వడానికి 1908కు కాల్ చేయాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ ప్రజలను కోరారు. ఎవరి వద్దనైనా డ్రగ్స్ వ్యాపారం, వాడకం లేదా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చే వారి వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. డ్రగ్స్ సమాజాన్ని నాశనం చేస్తాయన్నారు.
వరంగల్ రైల్వే స్టేషన్లో గురువారం ఉదయం ప్రమాదం సంభవించింది. వరంగల్ రైల్వే స్టేషన్లో ఓ గూడ్స్ రైలు రివర్స్ వస్తూ రైల్వే స్టేషన్ ముందున్న ఏటీఎం పక్క గోడను తగిలింది. ఈ ఘటనలో గోడ ధ్వంసం కాగా, ఎవరికీ ఏం కాలేదు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
యూరియా కొరత, ఇతర వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం రైతులు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద సూచించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 18004253424, ఫోన్ నంబర్లు 0870-2530812, 9154252936లకు సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.
Sorry, no posts matched your criteria.